మంచు లక్ష్మి, శ్రీధర్ రావ్, మాస్టర్ ప్రేమ్ బాబు, బేబీ డాలి ముఖ్య పాత్రధారులుగా మన్మోహన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బుడుగు'. సుధీర్ సమర్పణలో హైదరాబాద్ ఫిలిం ఇన్నోవేటివ్స్ పతాకంపై భాస్కర్, సారికా శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సైకాలజిస్ట్ గా ఇంద్రజ నటించారు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఏప్రిల్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -  ''ఒక ఎనిమిదేళ్ల బాలుడి నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందించాం. కథ గురించి చెప్పాలంటే... బుడుగు ఎనిమిదేళ్ల బాలుడు. అమ్మా, నాన్న, చెల్లెలు, ఓ బుజ్జి కుక్క పిల్ల... ఇదీబుడుగు కుటుంబం.



బుడుగు చిత్రంలోని మంచు లక్ష్మి


తన వయసున్న పిల్లలందరిలా బుడుగు హుషారుగా ఉండడు. ఎవరితోనూ కలవడు. ఉద్యోగాలతో బిజీగా ఉండే తల్లిదండ్రులకు ఇది తెలియదు. చివరికి స్కూల్ నుంచి, ఇరుగు పొరుగు నుంచి బుడుగు గురించి వచ్చిన ఫిర్యాదులతోబుడుగుని బోర్డింగ్ స్కూల్ లో చేర్చాలనుకుంటారు. ఇదిలా ఉంటే బుడుగు విచిత్రమైన ప్రవర్తన అతని తల్లిదండ్రులను కలవరపెడుతుంది. ఇతరులకు కనిపించనవి చూసినట్లుగా చెబుతాడు. ఆందోళన చెంది, సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళతారు.బుడుగు గురించి ఆ సైకాలజిస్ట్ తెలుసుకున్న నిజాలేంటి? ఆ తర్వాత ఏం జరిగింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు  ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసే చిత్రం ఇది'' అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ - ''చక్కని ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రం అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. చిన్న పిల్లల మనస్తత్వాన్ని, వారు ఎదుర్కొనే సమస్యల్ని దర్శకుడు హృద్యంగా ఆవిష్కరించారు'' అన్నారు.సన, ఇందుఆనంద్, శైలజవాణి, అల్తాఫ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పులూరి, సంగీతం: సాయికార్తీక్, కెమెరా: సురేష్ రఘుతు, ఎడిటింగ్: శ్యామ్, ఆర్ట్: ఎ. రామ్, రచన, దర్శకత్వం: మన్మోహన్.


మరింత సమాచారం తెలుసుకోండి: