ప్రస్తుతం ఫిల్మ్ సెలబ్రిటీస్ రియాలిటీ షోలను నిర్వహించటం చాలా కామన్ అయింది. నాగార్జున, ఆలీ, సాయికుమార్ ఇటువంటి స్టార్స్ ని ఆదర్శంగా తీసుకొని ఇక చిన్నపాటి ఫిల్మ్ ఆర్టిస్ట్ లు టి.వి షోలను నిర్వహించడం షురూ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మద్య కాలంలో కమెడియన్ కం హీరోగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వందల చిత్రాలలో నటించిన ఆలీ, బుల్లితెరలోనూ ప్రేక్షకులను అలరించటానికి పలు రకాల ప్రత్యేక కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాడు.

ఆలీ నిర్వహిస్తున్న కామెడీ రియాలిటీ షోలలో హాస్యం ఎంతా బాగా ఉంటుందో, ఒక్కోసారి ఆశ్ఛర్యాన్ని కలిగించే డబుల్ మీనింగ్ కామెడీ కూడ అంతే ఉంటుంది. దీంతో అప్పటి వరకూ సంతోషంగా ఉన్న ఫ్యామిలీ ఆడియన్, ఒక్కసారిగి ఉక్కిరి బిక్కిరి అయిపోవాల్సి వస్తుంది. ఇక రీసెంట్ లా ఆడియో ఫంక్షన్ లో సుమని కామెంట్ చేస్తూ డబుల్ మీనింగ్ మాటలను వదిలాడు.

షో అనంతరం ఆలీకి సుమ కౌంటర్ ఇవ్వటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అంతే కాకుండా తన షోకి వస్తున్న కొంత మంది ఆర్టిస్ట్ లతో ఆలీ డబుల్ మీనింగ్ దూకుడుని తగ్గించటం లేదు. కొన్ని సమయాల్లో లేడీ యాంకర్స్ తెగ ఇబ్బంది పడుతున్నారు. దీంతో అందరూ మూకుమ్మడిగా ఆలీని టార్గెట్ చేశారనే టాక్స్ బుల్లి తెర ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

సీనియర్ యాక్టర్ కాబట్టి కాం గా ఉన్నాం... అనే టాక్స్ సుమ దగ్గర నుండి ఇతర లేడీ యాంకర్స్, సినీ యాక్టర్స్ వరకూ ఎవరికి వారే అనుకుంటున్నారంట. బుల్లితెర షోలలో ఆలీ నోటి దురుసు ఇలాగే కంటిన్యూ అయితే, లేడీ యాంకర్స్ ఎటాకింగ్ తప్పదేమో అని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: