తెలుగు చిత్ర సీమలో వారసుల హవా నడుస్తుంది. తండ్రి వారసత్వంగా వచ్చినప్పటికీ వారికంటు మంచి ఇమేజ్ సంపాదించుకొని ప్రేక్షకుల ముందు షెబాష్ అనిపించుకున్న వారిలో నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్,మంచు బ్రదర్స్ లాంటి హీరోలు ముందు వరుసలో వస్తారు. మరి వీరి వారసులుగా వస్తున్నారు ప్రస్తుతం నాగార్జున కొడుకులు నాగచైతన్య ఇప్పటికే ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించకున్నాడు. ఇప్పడు నాగార్జున రెండో కొడుకు అఖిల్ అక్కినేని తెరంగెట్రం చేస్తున్నాడు. అక్కినేని నటవారసుడు అఖిల్ నటిస్తున్న పరిచయ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

అఖిల్ అప్ కమింగ్ మూవీలోని స్టిల్

akhil akkineni Upcoming Movie Stills 1

ఈ చిత్రాన్ని అఖిల్ స్నేహితుడు, యంగ్ హీరో నితిన్ నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 8 అంటే ఈ రోజు అఖిల్ బర్త్‌డే. పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర నిర్మాత హీరో నితిన్ అభిమానులకు గిఫ్టు ఇచ్చారు. ఆ గిఫ్టు మరేదో కాదు అఖిల్ ఫస్ట్‌లుక్ టీజర్. అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ఈ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌లో చూపించిన మేకింగ్‌ను చూసి అంతా అద్బుతమని అంటున్నారు. నితిన్ ఈ సినిమా విషయంలో అన్నీ దగ్గరుండి ప్లాన్ చేస్తున్నారు.

 మాస్   దర్శకుడు వినాయక్ ఏడాది పాటు స్ర్కిప్ట్‌ని డెవలప్ చేసి శరవేగంగా షూటింగ్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సయేషా సైగల్ నటిస్తుండగా..అనూప్ రూబెన్స్, థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: