సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ రివీలింగ్ ఎలిమెంట్స్ ,లక్ష్మీ మంచు , అడవి శేష్ ల పెర్ఫార్మన్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ సెకండాఫ్ లో వచ్చే ట్విస్ట్ రివీలింగ్ ఎలిమెంట్స్ ,లక్ష్మీ మంచు , అడవి శేష్ ల పెర్ఫార్మన్స్ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ స్లో అండ్ స్టడీ అన్నట్టు సాగే ఫస్ట్ హాఫ్ , స్లో నేరేషన్ , ఎమోషన్స్ ని ఎక్కడా కనెక్ట్ చేయకపోవడం , ఎడిటింగ్ , సింపుల్ స్టొరీ , ఊహాజనితమైన స్టొరీ బ్లాక్ , బలవంతంగా జొప్పించిన కామెడీ మరియు పాటలు

శృతి(మంచు లక్ష్మీ) తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ మరియు క్రేజ్ ఉన్న హీరోయిన్. పవర్ఫుల్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ టాప్ ప్లేస్ లో ఉంటుంది. శృతి తన పుట్టిన రోజు సందర్భంగా ఇండస్ట్రీలోని స్టార్స్ అందరికీ ఓ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేస్తుంది. పార్టీ అంతా సూపర్బ్ గా జరుగుతుంది.. అప్పుడే కథలోకి వెంకట్ (అడవి శేష్), కాటం రాజు(ప్రభాకర్), విజ్జు(మధు) ఎంటర్ అవ్వడం, స్టార్ హీరోయిన్ శృతిని కిడ్నాప్ చెయ్యడం చకచకా జరిగిపోతాయి. అలా కిడ్నాప్ చేసి శృతిని బందించి, శృతి మదర్ జ్యోతి లక్ష్మీ(ప్రగతి)ని ఓ 10 కోట్లు ఇమ్మని డిమాండ్ చేస్తారు. శృతి స్టార్ హీరోయిన్ కావడం వలన పోలీసులు రంగంలోకి దిగుతారు. అప్పుడే ఈ కేసుని చేదించడానికి స్పెషల్ డిటెక్టివ్ ఆఫీసర్ బ్రహ్మి (బ్రహ్మానందం) ఎంటర్ అవుతాడు. అక్కడి నుంచి కథ ఎలాంటి మలుపులు తిరిగింది.? అసలు వెంకట్, విజ్జు, కాటం రాజులు ఎందుకు శృతినే కిడ్నాప్ చెయ్యాలనుకున్నారు.? కేవలం డబ్బు కోసమేనా లేక పగ ప్రతీకారాలు ఏమన్నా ఉన్నాయా.? కిడ్నాపర్స్ వెనకున్న గతం ఏమిటి.? ఫైనల్ గా శృతి సేఫ్ గా బయటపడిందా.? లేదా.? అన్న ఆసక్తికర విషయాలను మీరే చూసి ఎంటర్టైన్ అవ్వండి.. 

నటీనటుల పరంగా అందరి నుంచి డైరెక్టర్ వంశీ కృష్ణ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ రాబట్టుకోగలిగాడు, వాళ్ళు ది బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి. ముందుగా మంచు లక్ష్మీ ఇప్పటి వరకూ చేయని కామెడీ యాంగిల్ ని ఇందులో ట్రై చేయడమే కాకుండా సక్సెస్ కూడా అయ్యింది. కామెడీ చాలా టఫ్ అయినప్పటికీ బాగా ప్రాక్టీస్ చేసి మరీ అందరినీ నవ్వించింది. ఇకపోతే అడవి శేష్ ఈ సినిమాతో నటనలో కాస్త పరిపక్వత చూపాడు. ఇప్పటి వరకూ అతనికి ప్లస్ అయిన  డైలాగ్ డెలివరీకి నటనని కూడా జత చేసి ఆడియన్స్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో అందరినీ థ్రిల్ చేసాడు. రాజమౌళి సినిమా ఎఫెక్ట్ వలన ఇప్పటి వరకూ విలన్ గానే కనిపించిన ప్రభాకర్ ఈ సినిమాతో తనలోని కామెడీ యాంగిల్ ని బయటపెట్టాడు. అతని పాత్ర ఈ సినిమాలో చాలా మేరకు హైలైట్ అవ్వడమే కాకుండా అక్కడక్కడా నవ్విస్తూ ఉంటుంది. అతను చూడటానికి సీరియస్ గా ఉన్నా అతను చేసే పనులు మాత్రం నవ్వు తెప్పిస్తాయి. కమెడియన్ మధు కూడా ఉన్నంతలో బాగానే చేసాడు. కామెడీ కింగ్ బ్రహ్మానందం డిటెక్టివ్ ఆఫీసర్ పాత్రలో నవ్వులు పూయించాడు. పొట్టి, బట్ట, పొట్ట ఉన్న నువ్వేం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని బ్రహ్మి పై వేసే పంచ్ లు నవ్విస్తాయి. బ్రహ్మానందం - ప్రగతి - పృథ్వి కాంబినేషన్ లో వచ్చే డబుల్ మీనింగ్ డైలాగ్స్ కామెడీ బాగా పేలింది. ప్రగతి కూడా తన పాత్రకి న్యాయం చేసింది. రానా - బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చే ఒకే ఒక్క సీన్ చాలా ఫన్నీగా ఉంది. ఇక అతిధి పాత్రల్లో కనిపించిన మన స్టార్ హీరోస్, హీరోయిన్ ఉన్నంత సేపు ఆడియన్స్ ని అలరించి వెళ్ళిపోయారు.    

మంచు లక్ష్మీ బ్యానర్ నుంచి వచ్చిన క్రైమ్ కామెడీ మూవీ దొంగాట కోసం డైరెక్టర్ మంచి స్టొరీ లైన్ మరియు ఆసక్తికరమైన బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు.అంత వరకూ పర్ఫెక్ట్.. కానీ నటీనటుల కోసం అనుకున్న కథలో అవసరం లేకపోయినా పలు సాంగ్స్, పలు సీన్స్ ని బలవంతంగా జోప్పించాల్సి వచ్చింది. అవే సినిమాని దెబ్బ కొట్టేసాయి. అలా అనవసరపు సీన్ ,అరియు సాంగ్స్ ని తీసేసి 2 గంటల రన్ టైంతో ఈ సినిమాని ప్రేక్షకులకు అందింస్తే సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చేది. అది లేకపోవడం వలన జస్ట్ ఓకే టాక్ తో సరిపెట్టుకుంది. డైరెక్టర్ సినిమాని వేగంగా కదల్చాలి అనే ఉద్దేశంతో సీన్స్ ని ఎప్పుడు ఎలా కట్ చేస్తున్నాడో చూసుకోలేదు. ఎందుకు అంటే చాలా సీన్స్ ఒక ఫ్లోలో వెళ్తుంటాయి సడన్ గా కట్ చేసి వేరే సీన్ కి వెళ్ళిపోతారు. అది ఆడియన్స్ కి కాస్త చిరాకు తెప్పిస్తుంది. ఇక డైరెక్టర్ తప్పు చేసింది కథనం మరియు నేరేషన్ విషయంలో.. ఫాస్ట్ గా కథలోకి వెళ్లి సడన్ గా స్లో అయిపోయాడు, మళ్ళీ ఇంటర్వల్ లో కాస్త స్పీడ్ అయ్యాడు, మళ్ళీ తగ్గి ప్రీ క్లైమాక్స్ నుంచి ఊపందుకున్నాడు. ఇలా పడుతూ లేస్తూ స్క్రీన్ ప్లే సాగడం వలన ఆడియన్స్ కాస్త బోర్ ఫీలవుతారు. కానీ మెయిన్ థ్రిల్స్ అన్నిటినీ చివర్లోనే ప్లాన్ చేసుకొని వాటిని పర్ఫెక్ట్ గా రివీల్ చెయ్యడం అతన్ని చాలా వరకూ సేవ చేసింది. అలాగే ఈ సినిమాకి చాలా అవసరం పాత్రల మధ్య ఎమోషన్స్ ని క్రియేట్ చెయ్యాలి కానీ ఆ ఎమోషన్స్ ని ఎక్కడా క్రియేట్ చెయ్యలేకపోయాడు. వంశీ కృష్ణ డైరెక్టర్ గా మాత్రం తనకు టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు. తను కథనంని స్ట్రాంగ్ గా రాసుకోగలిగితే ఇకపై మంచి ప్రోడక్ట్ ఇవ్వగలడు. ఇకపోతే సినిమాటోగ్రాఫర్ సామల భాస్కర్ లోకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. ఎస్ఆర్ శేఖర్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే రఘు కుంచె, సత్య మహావీర్, సాయి కార్తీక్ అందించిన సాంగ్స్ కూడా ఓకే. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. ఆయన మనసుకు హత్తుకునే డైలాగ్స్ తో పాటు ఈ సినిమాలో కామెడీ టచ్ ఉన్న డబుల్ మీనింగ్ డైలాగ్స్ ని కూడా బాగా రాసాడు. అతని డైలాగ్స్ ఈ సినిమాకి హైలైట్ అవుతాయి. ఇక మంచు లక్ష్మీ నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి.

మంచు వారి ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన మరో ప్రోడక్ట్ దొంగాట. ఈ సారి దొంగాట కోసం టాలీవుడ్ సక్సెస్ఫుల్ ఫార్మాట్ అయిన క్రైమ్ కామెడీ ఫార్మాట్ ని ఎంచుకున్నారు. ఆ జోనర్ కోసం కాన్సెప్ట్ ని కూడా బాగానే ఎంచుకున్నారు కానీ ఎగ్జిక్యూషన్ విషయానికి వచ్చే సరికి సిల్క్ స్మితకి ఎక్కువ జ్యోతి లక్ష్మీకి తక్కువ అన్న స్టైల్లో సినిమాని అబో యావరేజ్ కి ఎక్కువ హిట్ సినిమాకి తక్కువ అనిపించేలా చేసారు. సినిమాలో కొన్ని థ్రిల్స్ ని సూపర్బ్ గా రాసుకున్నారు. సూపర్బ్ గా డీల్ చేసాడు, అలాగే కొన్ని కామెడీ ఎపిసోడ్స్ ని బాగా రాసుకున్నారు, బాగా తీసారు కానీ.. కొన్ని కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే బాగుంటే ఆడియన్స్ ని రెండు గంటల 20 నిమిషాలు కూర్చో బెట్టడం కష్టం అందుకే ఆద్యంతం ఆసక్తిగా ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది. ఓవరాల్ గా మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన డీసెంట్ అటెంప్ట్ దొంగాట. మంచు లక్ష్మీ, అడవి శేష్ ల నటన, చివరి 30 నిమిషాల్లో వచ్చే థ్రిల్స్, ఇంటర్వల్ బ్లాక్ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యాయి. ఓవరాల్ దొంగాట సమ్మర్ సీజన్ కావడం వలన ఈ వారంతం రెగ్యులర్ ప్రేక్షకులను అలా ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోయే పాసబుల్ సినిమా.  

Lakshmi Manchu,Adivi Sesh,Vamsi Krishna,Sai Karthik.పంచ్ లైన్ : దొంగాట - థ్రిల్స్ ఉన్నా ఆటలో మజా లేదు.!

మరింత సమాచారం తెలుసుకోండి: