ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టరైజేషన్ , సొనారిక బదోరియా గ్లామరస్ లుక్స్ , సాగర్ మహతి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ , కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ఫస్ట్ హాఫ్ లో హీరో క్యారెక్టరైజేషన్ , సొనారిక బదోరియా గ్లామరస్ లుక్స్ , సాగర్ మహతి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ , కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్రొటీన్ కథ, అంతకు మించిన రొటీన్ కథనం, టెంపో లేని సెకండాఫ్ , సెకండాఫ్ లో హీరో క్యారెక్టరైజేషన్ ని చంపేయడం , సెకండాఫ్ లో స్లో నేరేషన్ , వీక్ క్లైమాక్స్ , ఎడిటింగ్ , రన్ టైం , ఇరికించిన సొల్లు కామెడీ

'ఇప్పుడు కష్టానికి డెఫినిషన్ మారిపోయింది.. కష్టపడటం అంటే బుర్ర వాడటం' ఇదే కాన్సెప్ట్ ని ఫాలో అయ్యే క్యారెక్టర్ ఏ మన హీరో కృష్ణ(నాగశౌర్య). కోటి రూపాయలు సంపాదించాలని హైదరాబాద్ వచ్చిన కృష్ణ ఒక బ్యాంకు లోన్ రికవరీ ఏజంట్ గా కోటి రూపాయలు వసూలు చేయడానికి రెడీ అవుతాడు. కానీ వాళ్ళందరూ రౌడీలు అవ్వడం వలన అతనికి లోన్ కట్టరు. దాంతో తనే వాళ్ళ రూట్ లోకి వెళ్లి రౌడీలా డబ్బు వసూలు చేస్తాడు. అది చూసిన హైదరాబాద్ రౌడీ శ్రీశైలం(జాకీర్ హుస్సేన్) కృష్ణకి తన దగ్గర దందాలు చేసే పని ఇస్తాడు. అదే టైంలో మన హీరో కృష్ణ హీరోయిన్ పార్వతి(సోనారిక బదోరియా)ని చూసి ప్రేమలో పడడం ఇద్దరూ కనెక్ట్ అవ్వడం జరిగిపోతాయి. ఇదిలా ఉండగా ఎప్పటికప్పుడు తన టీం మెంబర్స్ పేరు మీద హవాలా బిజినెస్ చేసే శ్రీశైలం 2000కోట్ల రూపాయల డీల్ ని తనకు తెలియకుండా తన పేరు మీద స్టార్ట్ చేస్తాడు. అది మొదలైనప్పటి నుంచి కృష్ణ పలు ఇబ్బందుల్లో పడతాడు. తన లవర్ పార్వతి కిడ్నాప్ అవుతుంది. వీళ్ళ గ్రూప్ లో ఉన్న గుంటూరు శీను(అజయ్) రివర్స్ అవుతాడు. చివరికి తన ప్రాణాలు కూడా కోల్పోయే స్టేజ్ కి వచ్చిన కృష్ణ ఈ సమస్యలన్నిటి నుంచి ఎలా బయటపడ్డాడు.? అన్నదే మిగిలిన కథ. 

రొమాంటిక్ ఎంటర్టైనర్స్ అయిన ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, లక్ష్మీ రావే మా ఇంటికి సినిమాలతో పూర్తి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగ శౌర్య జాదూగాడులో మొదటిసారి ఫుల్ మాస్ పాత్ర చేసాడు. ఓ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న కుర్రాడు ఫుల్ లెంగ్త్ మాస్ పాత్ర చెయ్యాలంటే అతని దానిపై ఎక్కువ అవగాహన ఉండాలి లేదా డైరెక్టర్ కి అన్నా పట్టుండాలి. కానీ ఈ ఇద్దరికీ సరైన అవగాహన లేకపోవడం వలన అనుకున్న స్థాయిలో నాగ శౌర్య పాత్ర ఆన్ స్క్రీన్ పై రాలేదు. నాగ శౌర్య తన వంతు కృషి చేసాడు కానీ పాత్రకి కావాల్సిన మాస్ ని చూపడంలో తనకి ఇంకా అనుభవం మరియు ఫేస్ లో మెచ్యూరిటీ కావాలి. ఆ రెండు లేకపోవడం వలన నాగశౌర్య ఒక 60% మాత్రమే మాస్ పాత్రలో సక్సెస్ కాగలిగాడు. కానీ ఈ రేంజ్ అన్నా చేస్తాడని ఎవరూ ఆశించరు కావున కామన్ ఆడియన్స్ కి బాగానే అనిపిస్తుంది. మొదటిసారైనా ఫైట్లు ఎంతో ఎనర్జీతో బాగా చేసాడు. డాన్సులు కూడా బాగానే చేసాడు. ఇక ఈ సినిమాతో పరిచయం అయిన సొనారిక బదోరియా గురించి చెప్పాలంటే.. ఈ భామ చూడటానికి బొద్దుగా ఉన్నా ముద్దుగానే ఉంది. ముఖ్యంగా తన క్యూట్ లుక్స్ అందరినీ ఆకర్షిస్తాయి. సోనారికలో ఈజ్ అండ్ ఎనర్జీ లెవల్స్ బాగున్నాయి. మొదటి సినిమా, కొత్త భాష అయినా సీన్ కి తగ్గా హావభావాలను బాగా పలికించింది. ఇక పాటల్లో అయితే ఇప్పటి ట్రెండ్ కి కావాల్సిన పొట్టి పొట్టి బట్టల్లో బాగా గ్లామరస్ గా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఇదొక కమర్షియల్ సినిమా కావున తనకి పెద్ద పాత్ర లేదనే చెప్పాలి. విలన్ పాత్రలో అజయ్ మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మెయిన్ విలన్ గా చేసిన జాకీర్ హుస్సేన్ ఓ ఏరియాకి పెద్ద గుండా పాత్రలో బాగా సరిపోయాడు. ఆశిష్ విద్యార్థి, రవి కాలే, కోట శ్రీనివాస్ రావుల పెర్ఫార్మన్స్ కూడా పాత్రకి తగ్గట్టు ఉంది. కమెడియన్స్ గా తాగుబోతు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, సత్య, పృథ్వీలు చేసింది చిన్న చిన్న పాత్రలే అయినా ఉన్నంత సేపూ బాగా నవ్వించారు. ఇక హడావిడి పాత్రల్లో కనిపించే సప్తగిరి విషయానికి వస్తే ఈ పాత్ర సినిమాకి పెద్ద పాడింగ్. సెకండాఫ్ లో కామెడీ పెట్టాలని ఇరికించిన పాత్ర. పాత్ర ఇంట్రడక్షన్ బాగున్నా రాను రాను డబుల్ మీనింగ్ లోకి వెళ్ళిపోయి ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తుంది. 

'జాదూగాడు' ఈ సినిమా టైటిల్ లోనే తెలుస్తోంది సినిమాలో హీరో పాత్ర ఎలా ఉంటుంది అనేది.. అనుకున్నట్టుగా అవసరం కోసం, ఎదగడం కోసం కష్టాన్ని కాకుండా తెలివిని వాడుకొని ఎలాంటి మేజిక్ అన్నా చెసీ తనకి కావాల్సింది దక్కించుకోగల పాత్ర హీరోది. హీరో పాత్రని బాగానే రాసుకున్న రైటర్ మధు సూధన్ పూర్తి కథని మాత్రం కొత్తగా కానీ లేదా ఆసక్తికరంగా గానీ రాసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. పాత్ర ట్రీట్ మెంట్ లో కొత్తదనం ఉంది, కానీ దాన్ని కూడా సరిగా క్యారీ చెయ్యలేకపోయారు. ఎలా అంటే సినిమా మొదటి పది నిమిషాల్లోనే హీరో పాత్రని ఆడియన్స్ కి కనెక్ట్ చేసాడు, అదే ఫ్లోని దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా కంటిన్యూ చేసాడు, కానీ సెకండాఫ్ లో మనకు అస్సలు హీరో హీరోయిజం అనేది అస్సలు కనిపించదు. చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో ఉన్న హీరో క్యారెక్టర్, సెకండాఫ్ లో ఉన్న హీరో క్యారెక్టర్ ఒకటేనా అని అనుకుంటాం. ఇదంతా చేసింది ఓ సస్పెన్స్ ఎలిమెంట్ ని చివర్లో రివీల్ చెయ్యడానికి కానీ ఆ సస్పెన్స్ ఎంతనేది మనకు ముందే తెలిసిపోతుంది. ఎందుకంటే అంత రెగ్యుల కథ కాబట్టి.. కమర్షియాలిటీ కోసం కథలో లెక్కలేనన్ని పాత్రలని తీసుకోచ్చేసాడు. అనవసరంగా కథలో సినిమా లెంగ్త్ కోసం రొమాన్స్ ఎక్కువ పెట్టేసాడు. దాని బదులు హీరోయిన్ కి కాస్త ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ లో అంటా హీరోయిజం ఎలివేషన్ కోసం సీన్స్ అన్నీ రాసుకొని హైప్ పెంచేసి సెకండాఫ్ లో ఆ హైప్స్ పై నీళ్ళు పోసి చల్లార్చేయడం సినిమాని ముంచేసిన పాయింట్.  

కథ విషయంలో ఇలా ఉంటే డైరెక్టర్ యోగేష్ అన్నా కథనంలో జాగ్రత్తలు తీసుకున్నాడా అంటే అదీ లేదు. ఏదో హీరో క్యారెక్టరైజేషన్ వలన ఫస్ట్ హాఫ్ గడిచిపోయినా సెకండాఫ్ అతనికి అగ్ని పరీక్ష. కానీ అందులో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. సినిమా మొత్తాన్ని ఇంకో యాంగిల్ లోకి తీసుకెళ్ళిపోయాడు. ఎలాంటివి అంటే రెగ్యులర్ సినిమాలో ఉండే అంశాలే ఇందులో ఉండడం, పాత్రలోని కొత్త ట్రీట్ మెంట్ ని కూడా బోర్ కొట్టించేలా చేయడం. ఇక డైరెక్షన్ పరంగా చూసుకుంటే మాస్ ఎంటర్ టైనర్స్ విషయంలో అవగాహన లేకపోవడం వలన చాలా సీన్స్ ని సరిగా డీల్ చేయలేకపోయాడు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ ఎపిసోడ్. ఎందుకంటే అది మరీ చెత్తగా అనిపిస్తుంది. ఇకపోతే అందరికీ ఉన్న డబుల్ మీనింగ్ భూతు కామెడీ పిచ్చ ఈయనకి కూడా తగులు కుంది. అందుకే సప్తగిరి చేత యాక్ అనిపించే సొల్లు కామెడీ చేయించాడు. ఓవరాల్ గా కొత్తగా అనిపించే పాత్రని, పాత్ర స్వభావాన్ని రాసుకొని దానికి సరైన స్క్రీన్ ప్లే అల్లుకోలేక, ఆ పాత్రకి సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేక ఫెయిల్ అయిన సినిమా జాదూగాడు.

మధు సూధన్ అందించిన డైలాగ్స్ బాగున్నాయి. ముఖ్యంగా హీరో పాత్రని రెప్రజెంట్ చేస్తూ రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఈ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయిన సాగర్ మహతి సాంగ్స్ బాగున్నాయి. అంతకుమించి సాగర్ మహతి నేపధ్య సంగీతం బాగుంది. హీరో ఎలివేషన్ మరియు చాలా కీ సీన్స్ లో అతని మ్యూజిక్ బాగా హెల్ప్ అయ్యింది. ఇకపోతే సాయి శ్రీరామ్ విజువల్స్ చాలా క్లాస్ అండ్ గ్రాండ్ గా ఉన్నాయి. నటీనటుల్ని ఆన్ స్క్రీన్ చూపిన విధానం, ఇచ్చిన లోకేషన్స్ ని చాలా పర్ఫెక్ట్ గా చూపాడు. పాటల పిక్చరైజేషన్ చాలా బాగుంది. నాగ శౌర్య బాడీ లాంగేవేజ్ కి తగ్గట్టుగా వెంకట్ యాక్షన్ ఎపిసోడ్స్ ని కంపోజ్ చేసాడు. ఎంఆర్ వర్మ ఎడిటింగ్ జస్ట్ ఓకే అనేలా ఉంది. కొన్ని సొల్లు సీన్స్ ని కట్ చేసేసి ఇంకాస్త స్పీడ్ గా ఉండేలా ఎడిటింగ్ చేయాల్సింది. వివిఎస్ ప్రసాద్ నిర్మాణ విలువలు రిచ్ గానే ఉన్నాయి.     


ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డైడ్' అనే కాన్సెప్ట్ ఈ జాదూగాడు సినిమాకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అందుకు అంటే రైటర్ మధు సూధన్ - డైరెక్టర్ యోగేష్ కలిసి ఓ మంచి స్క్రిప్ట్ రాయాలని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కొత్త మాస్ క్యారెక్టర్ ని సృష్టించారు. ఆ పాత్రకి ఇంట్రడక్షన్, ఫస్ట్ ఎలివేషన్ సీన్స్ వరకూ బాగానే రాసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో వీరిద్దరికీ కథ కాశ్మీర్ కి వెళితే, హీరో క్యారెక్టరైజేషన్ కన్యాకుమారికి వెళ్ళింది. దాంతో ఫస్ట్ హాఫ్ కామన్ గా అనిపించినా మాస్ కి కనెక్ట్ అయ్యే కొన్ని ఎపిసోడ్స్ తో మేనేజ్ అయిపొయింది. కానీ సెకండాఫ్ మాత్రం తుస్సుమంది. కనీసం సినిమాలో ఉన్న ఒక్క ట్విస్ట్ అన్నా సరిగా ప్లాంక్ హేసుకొని ఉంటే క్లైమాక్స్ లో ఆడియన్స్ కి కాస్త అబ్బా పర్లేదు బతికించాడు అనే ఫీలింగ్ కలిగేది. కానీ చాలా బోరింగ్ గా రివీల్ చేయడం వలన క్లైమాక్స్ ఇంకా దారుణం అయిపొయింది. ఫైనల్ గా ఓ మంచి క్యారెక్టర్ ని బూడిదలో పోసిన పన్నీరులా ఫ్లాప్ సినిమాలో పెట్టేసారు. ఓవరాల్ గా జాదూగాడు సినిమా నాగ శౌర్య మరియు యోగేష్ లకి కమర్షియల్ గా మాస్ హిట్ ని ఇవ్వలేకపోయింది.

Naga Shourya,Sonarika Bhadoria,Yogesh,VVN Prasad,Sagar Mahathi.పంచ్ లైన్ : జాదూగాడు - వీడో సోదిగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: