ప్రస్తుతం  టాలీవుడ్ లోనే  కాదు  దక్షిణ  భారతదేశ సినిమా రంగంలోనే టాప్  డైరెక్టర్  స్టేటస్ అందుకొని దర్శకుల  విలువ  పెంచుతున్న రాజమౌళి  150 సినిమాలుతీసి దర్శక రత్నగా ఒక వెలుగు వెలిగిన దాసరి నారాయణరావు పుట్టినరోజు  అయిన  మే 4వ తేదీని తన ‘బాహుబలి’ ప్రమోషన్ కోసం వాడుకోవడం  అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.


నిన్నటి నుంచి ప్రారంభం  అయిన ‘బాహుబలి’  ప్రమోషన్  మరింత స్పీడ్ తో కొనసాగించే  నిర్ణయంతో రాజమౌళి  ‘బాహుబలి’ కి  సంబంధించిన  తదుపరి  పోస్టర్  అయిన  శివుడును మే 4వ తారీఖున విడుదల  చేస్తున్నట్లు  ప్రకటించాడు. ఇది ఇలా ఉండగా నిన్న విడుదలైన ‘బాహుబలి’ బిగినింగ్ ఫస్ట్ లుక్  పోస్టర్ ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

పోస్టర్ లో క్రియేటివిటీ ఎక్కువగానే కనిపిస్తున్నా నిన్నటి పోస్టర్ లో ఎక్కడా ప్రభాస్ ప్రస్తావన లేకపోవడం ప్రభాస్ వీరాభిమానులను కలవర పెడుతున్నట్లు టాక్. అంతేకాదు చాలారోజుల తరువాత ‘బాహుబలి’ కి సంబంధించిన పబ్లిసిటీ పోస్టర్ కావడంతో ప్రభాస్ ప్రస్తావన ఈ పోస్టర్ పై ఉంటే బాగుండేది అన్న విషయాన్ని అభిమానులు రాజమౌళి దృష్టికి తీసుకు వెళ్ళినట్లు తెలుస్తోంది.

ఈ అసంతృప్తి రాజమౌళి వరకు వెళ్ళడంతో శివుడు గా ‘బాహుబలి’ లో రెండవ పాత్రలో చేస్తున్న ప్రభాస్ శివుడి లుక్ ను మొట్టమొదటి సారిగా మే 4వ తారీఖున బయటకు తీసి ప్రభాస్ అభిమానులను ఆశ్చర్య పరచాలని రాజమౌళి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరి ‘బాహుబలి’ లో శివుడి గెటప్ స్టిల్ ఈసారి ఈసినిమా అంచనాలను ఏ లెవల్ కు తీసుకువెళ్ళుతుందో చూడాలి..








మరింత సమాచారం తెలుసుకోండి: