పోసానికి రాసిన 4 సీన్స్ అండ్ డైలాగ్స్ , అనైక సోఠి గ్లామర్ ట్రీట్ , నందు డీసెంట్ పెర్ఫార్మన్స్ పోసానికి రాసిన 4 సీన్స్ అండ్ డైలాగ్స్ , అనైక సోఠి గ్లామర్ ట్రీట్ , నందు డీసెంట్ పెర్ఫార్మన్స్ వెరీ సింపుల్ స్టొరీ లైన్ , ఊహాజనితమైన స్క్రీన్ ప్లే , డెడ్ స్లో నేరేషన్ , డైరెక్షన్ , ఎడిటింగ్ , అస్సలు కనెక్ట్ కాని సెకండాఫ్ , ఎమోషనల్ డెప్త్ లేకపోవడం , ఇర్రిటేట్ చేసే స్లో మోషన్ షాట్స్ , సిల్లీ సిల్లీ క్లైమాక్స్

రామ్ గోపాల్ వర్మ తన కెరీర్లో మొదటిసారి చేసిన పూర్తి ప్రేమకథా చిత్రం '365 డేస్'.. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య పరిచయం మొదలైనమొదటి రోజు నుంచి 365 రోజు లోపు వీరి పరిచయం ప్రేమగా మారడం, ప్రేమ పెళ్ళిగామారి, ఆ పెళ్లి కాస్తా ఎలా పెటాకులయ్యింది అనేదే ఈ సినిమా వన్ లైన్ స్టొరీ. ఇక కథలోకి వెళితే.. లైఫ్ లో తనకు నచ్చినట్టు బతికే ఓ కుర్రాడు అపూర్వ్(నందు). కెరీర్లో ఓ మంచి జాబ్ చేస్తూ సెటిల్ అయ్యుంటాడు. అపూర్వ్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రశాంత్(కృష్ణుడు) ఇచ్చిన ఓ ఫ్యామిలీ పార్టీలో శ్రేయ(అనైక సోఠి)ని చూసి ప్రేమలో పడతాడు. కట్ చేస్తే ఇద్దరూ గాఢమైన ప్రేమలో మునిగిపోతారు..దాంతో వీరి పరిచయం అయిన 100వ రోజు పెద్దల అంగీకారంతో వీరి పెళ్లి కూడా అయిపోతుంది. కొత్త మోజు కాబట్టి పెళ్ళైన 47 రోజులు బాగనే ఉంటుంది కానీ ఆ తర్వాత అసలు సమస్యలు మొదలవుతాయి. ప్రతి చిన్న విషయానికి గొడవపడడం, ఒకరంటే ఒకరికి పడకుండా పోవడం, ఒకరికొకరు నీతో బ్రతకలేను అనుకోవడం, పెళ్లి కంటే బ్యాచిలర్ లైఫ్ ఏ బాగుంది అనుకునే స్థాయికి ఇద్దరి మధ్యా గొడవలు అవుతాయి. ఈ గొడవల వల్ల అపూర్వ్ - శ్రేయల వైవాహిక జీవితం విడాకుల తీసుకునే స్థాయికి వెళ్తుంది. మరి వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారా.?  అయ్యి కలిసి పోయారా.? ఒకరిని విడిచి ఒకరం ఉండలేం అనుకున్న ప్రేమ జంట పెళ్లి కాగానే సంవత్సరం రోజులు కూడా కలిసి ఉండలేకపోవడానికి గల కారణం ఏమిటి.? అసలు వర్మ పెళ్లి అనే దాని గురించి ఏం చెప్పాలనుకున్నాడు.? అనే ప్రశ్నలకి సమాధానం మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..   

రామ్ గోపాల్ వర్మ ఎంచుకున్న కాన్సెప్ట్ ప్రకారం ఎక్కువ పాత్రలని కూడా కథలో పెట్టలేదు. ఎక్కువ భాగం ఇద్దరు ముగ్గురితోనే లాగించేసాడు. నటీనటుల పరంగా ఈ సినిమాకి హైలట్ అయ్యింది పోసాని కృష్ణ మురళి. కావున మొదట పోసాని గురించి చెప్తా.. పోసాని వచ్చేది కేవలం నాలుగు సీన్స్ లో.. కానీ పెళ్ళికి పూర్తి వ్యతిరేఖి అయిన పాత్రలో పోసాని బాగా చేసాడు. ముఖ్యంగా ఆయన సీన్స్ కి రాసిన డైలాగ్స్ సూపర్బ్. పోసాని సీన్స్ మాత్రం ఆడియన్స్ కి  బాగా కనెక్ట్  అవుతాయి. ఇకపోతే హీరో నందు విషయానికి వస్తే.. ఒక యాక్టర్ గా వర్మ ఇచ్చిన పాత్రలో డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ప్రేమలో ఉన్న యువకుడిగా, ఫ్రస్ట్రేషన్ భర్తగా బాగానే చేసాడు. హీరోయిన్ గా కనిపించిన అనైక సోఠి పెర్ఫార్మన్స్ పరంగా డైలాగ్స్ లేని సీన్స్ లో ఎక్స్ ప్రెషన్స్ ఓకే, కానీ డైలాగ్స్ వస్తే మాత్రం ఆ హావభావాలను చూడలేం. ఓవరాల్ జస్ట్ యావరేజ్ పెర్ఫార్మన్స్. కానీ అనైక చేత చేయించిన ఎక్స్ పోజింగ్, పాటల్లో తన అందాల్ని చూపించిన తీరు కచ్చితంగా ముందు బెంచ్ వారిని మెప్పిస్తుంది. ఇది రొమాంటిక్ లవ్ స్టొరీ కావడం వలన వర్మ అందాల ఆరబోత పరంగా అనైకని బాగానే వాడుకున్నారు. ఇక సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన కృష్ణుడు, సత్య కృష్ణ, గీతాంజలి, కొండలరావు, సురేఖ వాణి తదితరులు ఉన్నంతలో బాగానే చేసారు. 

ఈ 365 డేస్ అనే సినిమా మొదలవ్వడానికి సూత్ర దారుడు రామ్ గోపాల్ వర్మ, తను లేకపోతే మిగతా ఏ టెక్నీషియన్ ఈ సినిమాలోకి రాలేడు కావున ముందుగా వర్మ గురించి చెబుతా.. తర్వాతే మిగతా వారి గురించి.. విలక్షణ సినిమా అంటే వర్మ పేరు చెప్పుకునే సినీ పరిశ్రమ ఇప్పుడు ఫ్లాప్ సినిమా అన్నా లేక వివాదాస్పదం అన్నా వర్మ పేరు చెబుతున్నారు. చాలా కాలం నుంచి కథ - కథనాలపై ఏ మాత్రం దృష్టి సారించకుండా తన మదిలో మెదిలిన ఏదో పాయింట్ ని పెట్టుకొని సినిమా తీసేస్తున్నాడు వర్మ. తన అభిమానులేమో ప్రతి సినిమాకి వర్మ ఈజ్ బ్యాక్ అవుతాడని ప్రతి సినిమాకి వెళ్ళడం వర్మ ఈజ్ నాట్ బ్యాక్ అనుకుంటూ నిరాశతో బయటకి రావడం కామన్ గా జరుగుతున్న విషయం. ఈ సారి కూడా వర్మ మరో ఫ్లాప్ సినిమానే ప్రేక్షకులకు అందించాడు. వర్మ తన లైఫ్ లో జరిగిన మరియు బయట సొసైటీలో చూస్తున్న ప్రేమ పెళ్ళిళ్ళను స్పూర్తిగా తీసుకొని 'ప్రేమించుకునేటప్పుడు ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ పెళ్ళయ్యాక ఉండదు' అనే పాయింట్ ని చెప్పడమే ఈ 365 డేస్ స్టొరీ లైన్.. దీన్ని బట్టే సినిమా కోసం ఎంచుకున్న కథ ఎంత సింపుల్ గా ఉందో అర్థమవుతుంది. అంతే కాదు సినిమాలో ఆడియన్స్ సర్ప్రైజ్ అవ్వడానికి గానీ, వావ్ క్యా సీన్ హై మామ అనుకునేలా ఏమీ ఉందనేది అర్థం అవుతోంది. ఇదే ఫీలింగ్ నే రామ్ గోపాల్ వర్మ కూడ కలిగించాడు. ఈ సినిమా స్టొరీ లైన్ చిన్నదే అయినా కథనం పరంగా, నేరేషన్ పరంగా ఆడియన్స్ మెప్పించవచ్చు. కానీ వర్మ అలాంటి ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. కేవలం హీరోయిన్ గ్లామర్ తో ఎక్కువ అట్రాక్ట్ చెయ్యాలనుకున్నాడు. హీరోయిన్ విషయాన్ని పక్కన పడితే ఫస్ట్ హాఫ్ పరంగా లవ్ సీన్స్, పోసాని సీన్స్ మరియు 45 నిమిషాల్లోనే అయిపోవడంతో ఫస్ట్ హాఫ్ పరవాలేదనిపిస్తుంది. కానీ సెకండాఫ్ కి వచ్చాక అసలైన వర్మ పైత్యం మొదలవుతుంది. సినిమా ఫేస్ ఒక్కసారిగా పడిపోతుంది. ఇద్దరి మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలని తిప్పి తిప్పి చూపిస్తూ ఉంటాడు. సెకండాఫ్ లో వాళ్ళిద్దరి వైవాహిక జీవితం చెడిపోవడానికి గల బలమైన కారణాన్ని ఎక్కడా చూపించలేకపోయాడు. అలాగే ఈ సినిమాలో చూపించాల్సిన ఎమోషనల్ బాండింగ్ ని ఎక్కడా సరిగా చూపించలేదు. ప్రేమ అంటే వ్యామోహం, కోరిక అన్న తరహాలోనే సినిమా కథ ముందుకు సాగడం, దానికి పూర్తి రివర్స్ లో కథని ఎండ్ చేయడం చాలా సిల్లీగా అనిపిస్తుంది. సెకండాఫ్ లో కథకి కావాల్సిన ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు. లాజికల్ గా చూసుకుంటే.. ప్రేమంటేనే అర్థం చేసుకోవడం అంటారు కానీ మన వర్మ మొదటి నుంచి ప్రేమంటే కోరిక అని చూపించి చివరికి అడ్జస్ట్ అవ్వడమే ప్రేమ అనే సగం క్లారిటీతో చాలా అసంపూర్ణంగా కథని ముగించడం వెరీ సిల్లీగా ఉంది. మొదట పాత్రలని తమకు ఇష్టం ఉన్నట్టు చూపిస్తాడు, పెళ్ళయ్యాక ఆ పాత్రల బిహేవియర్ మొత్తం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎలా అంటే వారిలా వారు ఉండరు, అలా అని అడ్జస్ట్ అయ్యి ప్రేమలోనూ హ్యాపీ గా ఉండరు. ఇక పాత్రలకి జస్టిఫికేషన్ ఏముంది అన్నదే నా పాయింట్. ఇక డైరెక్టర్ గా కూడా వర్మ ఫెయిల్ అయ్యాడు. డబ్బు పెట్టి థియేటర్ కి వచ్చిన ప్రేక్షకులకు కొత్త కథ ఇవ్వకపోయినా పర్లేదు, ఏదో ఒక ఎమోషన్ ని కనెక్ట్ చేసి వారిని ఎంటర్టైన్ చెయ్యాలి కానీ వర్మ ఆ మేజిక్ చెయ్యలేకపోయాడు.  కథ - కథనం - దర్శకత్వం పరంగా వర్మలోని నాశిరకమైన డైరెక్టర్ ని మనకు చూపించే సినిమా 365 డేస్.  


ఇక మిగిలిన టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. సినిమా కోసం ఎంచుకున్న లొకేషన్స్ బాగున్నాయి, సినిమాటోగ్రాఫర్ అనిత్ సెట్ చేసుకున్న లైట్ ఎఫెక్ట్స్ కూడా డీసెంట్.. కానీ అనవసరమైన సీన్స్ లో ఎక్కువగా స్లో మోషన్ షాట్స్ తీయడం చూసే ఆడియన్స్ కి పెద్ద టార్చర్. ఆ అనవసరమైన స్లో మోషన్ షాట్స్ ని కట్యిరించేసి ఉంటే సినిమా రన్ టైం ఇంకాస్త తగ్గి సినిమాకి ఏమన్నా హెల్ప్ అయ్యుండేదేమో.. నాగ్ శ్రీ వత్స - ఎల్.ఎం ప్రేమ్ అందించిన పాటలు ఎక్స్ట్రార్డినరీగా లేవు, జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి. కానీ సినిమా అంతా పాటలే ఉన్నాయి.. అది సినిమాకి మరో డ్రా బ్యాక్..ఇక శేషు కెఎంఆర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. అన్సర్ అలీ ఎడిటింగ్ బాలేదు. ముఖ్యంగా సెకండాఫ్ లో ఆడియన్స్ కి ఇర్రిటేషన్ తెప్పించేసాడు. రఘు కులకర్ణి ఆర్ట్ వర్క్ బాగుంది. వెంకటేష్ నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. 365 డేస్ సినిమా విషయానికి వస్తే.. ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రేమ అనేది లేదు, ప్రేమ అంటే కామం.. కోరిక, కానీ మనం కోరిక కోసం అమ్మాయిని అడిగితే చెప్పుతో కొడుతుంది కాబట్టి ప్రేమ అనే పదాన్ని వాడుకుంటున్నాం అని సినిమా మొదటి నుంచి చివరి దాకా దాదాపు అన్ని పాత్రల్లోనూ చూపించాడు. కానీ క్లైమాక్స్ లో ఒక్క సీన్స్ లో కథ మొత్తాన్ని రివర్స్ చేసేసాడు. అనుకున్నట్టుగా ఎండ్ చేసి ఉన్నా ఆడియన్స్ కాస్త బెటర్ గా ఫీలయ్యేవారు కానీ చాలా రెగ్యులర్ గా అసంపూర్ణంగా ముగించడం వలన ఆడియన్స్ కి ఇర్రిటేషన్ వస్తుంది. సినిమా శూసాక వర్మ ఇంకా మారడా అనుకునే ప్రేక్షకులు కూడా ఉంటారు. ఒక అమ్మాయి - అబ్బాయి మధ్య జరిగిన 365 రోజుల జర్నీని ఒక 110 నిమిషాల టార్చర్ గా చూపించడమే '365 డేస్'.. ఈ సినిమాలో ఆడియన్స్ చూడటానికి ఏమీలేదు.. ఎలా అంటే పెళ్ళైన వారు రోజూ మా ఇంట్లో జరిగేదే కదా ఇక్కడ కూడా ఈ టార్చర్ ఏనా అని ఫీలవుతారు.. ఇక యువత కోరిక మీద ఉంటారు కాబట్టి సినిమాలో ఏం చెప్పారు, ఏం చెప్పాలి అనుకున్నది పట్టించుకోరు. కాస్తో కూస్తో ఉపయోగపడేది సి సెంటర్ వారికి ఎలా అంటే అనైక సోఠి అందాల విందు వలన. మండిపోతున్న ఈ సమ్మర్ సీజన్ లో '365 డేస్' సినిమాకి దూరంగా ఉంటే మీ జేబుకి, మీకు ఆరోగ్యానికి చాలా మంచిదని మా ఫీలింగ్.  

తన విభిన్నతతో, సరికొత్త టెక్నాలజీస్ తో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న రామ్ గోపాల్ వర్మ తన ఇమేజ్ ని తానే చెడగొట్టుకోవడం కోసమే ఈ మధ్య వర్మ సినిమాలు చేస్తున్నట్లు ఉంది. ఆయన చివరిగా చేసిన 10కి పైగా సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద దారుణంగా విఫలం అవ్వడమే కాకుండా ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తున్నాయి. అదే లిస్టులోనే వర్మ లేటెస్ట్ రొమాంటిక్ లవ్ స్టొరీ '365 డేస్' కూడా చేరింది. వర్మ మైండ్ లో ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచనతో సినిమా చేయలనుకోవడంలో తప్పులేదు కానీ దాన్ని ఎంత గ్రిప్పింగ్ గా చెప్పి ఆడియన్స్ ని కూర్చోబెడుతున్నాం అన్నదే మెయిన్ పాయింట్. కానీ వర్మ ఈ పని చేయడం లేదు. తనకి నచ్చినట్టు తీస్తున్నాడు.     

Nandu,Anaika Soti,Ram Gopal Varma,Nag Srivatsav.పంచ్ లైన్ : 365 డేస్ - 110 నిమిషాల టార్చర్.!

మరింత సమాచారం తెలుసుకోండి: