తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నాగురించి అందరికీ తెలుసు నాపై వస్తున్నా రూమర్లు అన్ని అవాస్తవాలు..  షూటింగ్‌ల విషయంలో కథానాయిక అంజలి సమయపాలన పాటించడం లేదని, కొన్నిసార్లు ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరవుతోందని గతకొద్ది రోజులుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి వీటిని ఖండించింది నటి అంజలి. పాత్రకు తగ్గట్టుగా బరువు విషయంలో అంజలి తమకు సహకరించడం లేదని అంజలితో తీసే సన్నివేశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.


అంజలి ఫోటో షూట్



వీటిపై స్పందిస్తూ అంజలి ఇవన్నీ అవాస్తవాలని గత ఆరు నెలలుగా కంటిన్యూగా షూటింగ్స్ లో పాల్గొంటున్నానని అంతే కాదు తన బరువు 8 కిలోలు తగ్గానని నేను బరువు పెరిగానని అసత్య కథనాల్ని ప్రచారం చేస్తున్నారు. ఇండస్ట్రీలో తన వ్యక్తిత్వం ఏమిటో అందరికీ తెలుసు అని నేను ఎవరికీ సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదని అంజలి అన్నారు.

అంజలి డ్యాన్స్ ఫోటో


అయితే ఈ మద్య నా మేనకోడలి తో ఒక ఫోటో దిగి  సోషల్‌మీడియాలో పెట్టాను. దాన్ని చూపిస్తూ అంజలి పెళ్లి చేసుకుంది. ఆమెకు పాప పుట్టింది అని తమిళ మీడియా వారు ప్రచారం మొదలుపెట్టారు  నా గురించి అతిగా ఊహించుకోవడం వల్ల ఇలాంటి పుకార్లు వస్తున్నాయి.  దయచేసి   నాపై తప్పుడు కథనాల్ని ప్రచురించడం మానుకోండి అని చెప్పింది అంజలి.


మరింత సమాచారం తెలుసుకోండి: