కొంతమంది పెర్ఫార్మన్స్ , సినిమాటోగ్రఫీ , పంకజ్ కేసరి రోల్ , ఇరికించినా పరవాలేదనిపించే క్లైమాక్స్ ఎపిసోడ్ కామెడీకొంతమంది పెర్ఫార్మన్స్ , సినిమాటోగ్రఫీ , పంకజ్ కేసరి రోల్ , ఇరికించినా పరవాలేదనిపించే క్లైమాక్స్ ఎపిసోడ్ కామెడీఊహాజనితమైన నేరేషన్ , సాగదీసిన స్క్రీన్ ప్లే , ఫస్ట్ హాఫ్ , హీరో , హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ లేకపోవడం , డైరెక్షన్ కామెడీ , ఎడిటింగ్ , కొన్ని చోట్ల బలవంతంగా ఇరికించిన కామెడీ

నిఖిల్ - స్వాతి జంటగా వచ్చిన 'స్వామి రారా' సినిమాకి సీక్వెల్ అంటూ 'మోసగాళ్ళకు మోసగాడు' సినిమాని ప్రమోట్ చేసారు కానీ ఈ సినిమాకి ఆ సినిమాకి సంబంధం లేదు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మోసగాళ్ళకు మోసగాడు అనే క్రైమ్ సినిమా అయోధ్యలోని బాగా ఫేమస్ అయిన రామాలయంలోని రాముడు - సీత విగ్రహాల చోరీతో మొదలవుతుంది. ఈ విగ్రహాలు చాలా పవిత్రమైనవి మరియు చాలా ఖరీదైనవి. ఇక్కడ నుంచి కట్ చేస్తే ఎలాంటి వారినైనా మోసం చేసి దొంగతనం చేయగల టాలెంట్ ఉన్న కుర్రాడు క్రిష్(సుధీర్ బాబు). హైదరాబాద్ లో నివసించే క్రిష్ హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో లైబ్రేరియన్ గా పనిచేసే అమాయకమైన బ్రాహ్మణి అమ్మాయి జానకి(నందిని రాయ్) ని చూసి ప్రేమలో పడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఆ విగ్రహాల చోరీ పాయింట్ తో కథ అయోధ్య - లక్నో - హైదరాబాద్ ప్రాంతాల చుట్టూ ఫస్ట్ హాఫ్ తిరుగుతూ ఉంటుంది. అదే టైంలో  హైదరాబాద్ లోకల్ డాన్ అయిన గురు(జయప్రకాశ్ రెడ్డి) ఈ విగ్రహాల చోరీని క్రిష్ కి అప్పగిస్తాడు. కానీ క్రిష్ ఆ విగ్రహాలతో పారిపోవాలని నిర్మయించుకోవడంతో అసలు సమస్య మొదలవుతుంది. దాంతో ఇంటర్నేషనల్ స్మగ్లర్ రుద్ర(అభిమన్యు సింగ్) రంగంలోకి దిగుతాడు. అక్కడి నుంచి క్రిష్ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కున్నాడు.? చివరికి రాముడు - సీత విగ్రహాలు ఏమయ్యాయి? అన్నదే మీరు వెండితెరపై చూడాల్సిందే..   

మెయిన్ లీడ్ రోల్స్ చేసిన వారి నుంచి మొదలు పెడతా.. ముందుగా హీరో సుధీర్ బాబు. ఇప్పటి వరకూ తనని తానూ స్టైలిష్ గా ప్రెజంట్ చేసుకునే చాన్స్ సుధీర్ బాబుకి రాలేదు, కానీ ఈ సినిమాలో ఆ అవకాశం రావడంతో దాన్ని ఉపయోగించుకున్నాడు. లుక్ పరంగా చాలా స్టైలిష్ గా కనిపిస్తాడు. ఇక పెర్ఫార్మన్స్ పరంగా కాస్త మెరుగు పడ్డాడు. చాలా కాన్ఫిడెంట్ గా కనిపించే దొంగగా మంచి హావ భావాలనే పలికించాడు. తెలుగమ్మాయి నందిని రాయ్ తన ప్రెట్టీ లుక్స్ మరియు అమాయకత్వపు పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా, అందరినీ తనవైపు ఆకర్షించుకుంది. సిన్సియర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో పంకజ్ కేసరి పర్ఫెక్ట్ గా సరిపోవడమే కాకుండా సూపర్బ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అభిమన్యు సింగ్ డాన్ పాత్రలో బాగానే చేసాడు, కానీ స్క్రీన్ పల వలన ఎక్కువగా తనకు నటనను చూపే ఆస్కారం రాలేదు. అతిధి పాత్రలో కనిపించిన మంచు మనోజ్ గడ్డం లుక్ బాగుంది. అలాగే తన అతిధి పాత్ర సింపుల్ అండ్ స్వీట్. సప్తగిరి, ఫిష్ వెంకట్, జయ ప్రకాష్ రెడ్డి బాగా నవ్వించారు. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏమిటి అంటే దువ్వాసి మోహన్ ఎక్కువగా నవ్వించాడు. చంద్ర మోహన్ స్కూల్ టీచర్ గా పాత్రకి తగ్గ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. 

స్వామి రారా లాంటి సినిమాకి ఇది సీక్వెల్ అని చెప్పుకోవడం వలన ఆ సినిమా ప్రభావం ఈ సినిమాపై ఎక్కువగా ఉంటుంది. స్టొరీ లైన్ పరంగా ఈ సినిమా కథ కూడా అలానే ఉంటుంది కానీ టేకింగ్ పరంగా వచ్చేసరికి దానికి దీనికి అస్సలు సంబంధం ఉండదు. మోసగాళ్ళకు మోసగాడు ఆసక్తికరమైన విగ్రహాల దొంగతనంతో మొదలవుతుంది, అక్కడ చూపించిన యాక్షన్ ఎపిసోడ్, లోకేషన్స్ చాలా బాగుంటాయి.. కానీ ఎప్పుడైతే కథ ప్రేమ, డ్రామా అనే పాయింట్ లోకి ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి పక్కదారి పట్టేస్తుంది. సినిమా స్లో అయిపోతుంది. ఈ విషయంలో స్వామి రారాకి డైరెక్టర్ ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేసి క్రైమ్, కామెడీ, లవ్ అన్నిటినీ ఒకే ఫ్లాట్ లో మిక్స్ చేసాడు. కానీ దానికి సీక్వెల్ అయిన మోసగాళ్ళకి మోసగాడు సినిమాలో స్టొరీ లైన్ పరంగా అదే కంటిన్యూ చేసినా టేకింగ్ పరంగా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పరంగా మాత్రం స్వామి రారా మేజిక్ ని క్రియేట్ చెయ్యలేకపోయింది. అలాగే ఈ సినిమా ద్వారా చెప్పాలనుకున్న పాయింట్ 'చెడు చేసేవాడు ఆలోచించాలి.. మంచి చేసేవాడు చేసుకుంటూ పోవాలి'. కానీ ఈ పాయింట్ ని కూడా ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెయ్యలేకపోయాడు. ఈ స్క్రిప్ట్ లో సబ్ ఫ్లాట్స్ ఎక్కువ అయిపోవడం, కథనం కాస్త కన్ఫ్యూజన్ గా తయారవడం వల్ల చెప్పాలనుకున్న పాయింట్ ఆడియన్స్ కి రీచ్ అవ్వలేదు. వీటన్నిటికీ తోడూ అసంపూర్తిగా ముగించిన క్లైమాక్స్ ఆడియన్స్ ని ఇంకాస్త నిరాశపరుస్తుంది. సినిమాలో థ్రిల్స్ కంటే కామెడీ ఎక్కువ ఉంది, ముఖ్యంగా క్లైమాక్స్ లో బలవంతంగా చేర్చిన కామెడీ ఫన్నీ అనిపించినా సినిమా కాన్సెప్ట్ కి హెల్ప్ అవ్వలేదు. మొదటగా డికె బోస్ అనే సినిమాకి దర్శకుడిగా పనిచేసిన నెల్లూరి బోస్ ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఉండాల్సిన థ్రిల్స్ రాసుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు. చాలా చోట్ల సినిమా బాగా పోతుంది అనుకున్న టైంలో సబ్ ఫ్లాట్స్ ని కథలోకి తెచ్చి ఉన్న ఫీల్ ని పోగొట్టేసాడు. ఈ సినిమా అన్ని క్రైమ్ కామెడీ సినిమాల్లానే చాలా రెగ్యులర్ గా ఊహాజనితంగా సాగుతుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే పై బోస్ ఇంకాస్త ఎక్కువగా వర్క్ చెయ్యాల్సింది. ఎందుకు అంటే ఎక్కువగా లూప్ హోల్స్ వదిలేసాడు. ఉదాహరణకి.. లోకల్ డాన్ మనుషులు సుదీర్ చెప్పిన మాటలని నమ్మి వారి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతారు కానీ నెక్స్ట్ సెకండ్ లోనే వాడు మనలా దొంగే అని రివర్స్ అవుతారు.. ఇక ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ దగ్గర క్రిష్ ని పట్టుకోవడానికి వీడియో ప్రూఫ్ తన దగ్గర ఉన్నా దాన్ని పట్టించుకోకుండా విగ్రహాలు అమ్మే లోపే రుద్రని పట్టుకోవాలి అని ట్రై చేస్తుంటాడు. సుధీర్ బాబు ఓ పురాతన కాలానికి సంబందించిన బుక్ ద్వారా రాముడు - సీతల విగ్రహం యోగ్గా రేటు తెలుసుకోవడం.. జోక్ ఆ అదెలా సాధ్యం అవుతుంది.. ఇలాంటివి చాలానే ఉన్నాయి. 
కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ మణికాంత్ ఖాద్రి అందించిన సాంగ్స్ జస్ట్ యావరేజ్. కానీ రెండు పాటలని మాత్రం బాగా షూట్ చేసాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చాడు. ముఖ్యంగా సుధీర్  బాబు, అభిమన్యు సింగ్ ల ఇంట్రడక్షన్ కి ఇచ్చిన ట్యూన్స్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి.  సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. తీసుకున్న లోకేషన్స్ ని చూపించిన విధానం చాలా ఫ్రెష్ ఫీలింగ్ కి గురిచేస్తుంది. ఎడిటింగ్ అనుకున్న స్థాయికి లేదు. ఫస్ట్ హాఫ్ నుంచి చాలా సీన్స్ కత్తిరించేసి ఉండచ్చు. యాక్షన్ ఎపిసోడ్ ని బాగానే షూట్ చేసారు. చక్రి చిగురుపాటి నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. 


మనకు ఇప్పటి వరకూ విగ్రహాల చోరీల మీద పలు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి.. అలాంటి మరో సినిమాకి సుధీర్ బాబు సైన్ చేసాడు.. ఒక హీరోయిన్ ఉంది.. ఇన్వెస్టిగేషన్ కోసం ఓ టఫ్ లుకింగ్ యాక్టర్ ని ఎంచుకున్నారు.. డాన్ పాత్రలని సృష్టించారు.. మధ్య మధ్యలో కమెడియన్స్ తో కామెడీ చెయ్యడానికి ట్రై చేసారు... క్రైమ్ కామెడీ సినిమాలో ఇవి ఉంటాయి.. ఇందులోనూ అవే ఉన్నాయి. తను కొత్తగా చెప్పాలనుకున్న పాయింట్ ఏమీ లేదు.. హీరో వేరే ఏమన్నా చేస్తాడా అంటే లేదు ఎప్పటిలానే తనొక దొంగ. ఈ సినిమా కథ నుకున్నప్పుడు ఇది స్వామీ రారా సినిమాకి సీక్వెల్ కానీ సినిమా పూర్తయ్యాక మోసగాళ్ళకు మోసగాడు సీక్వెల్ లా అనిపించదు. సీక్వెల్ అంటే ఒరిజినల్ సినిమా థీమ్ లైన్ తో ఇంకాస్త ఆసక్తికరంగా, ఇంకాస్త హై లెవల్ లో ఉండాలి. కానీ ఈ సినిమాకి కెప్టెన్ గా వ్యవహరించిన డైరెక్టర్ నెల్లూరి బోసు సినిమాని అంత ఆసక్తికరంగా నడిపిన్చాలేకపోవాడు.. స్టార్టింగ్ బాగా చేసి వెంటనే సినిమాని బాగా డల్ చేసేసి.. మళ్ళీ క్లైమాక్స్ దగ్గర సినిమాని నడిపించాడు..  ఓవరాల్ గా మెప్పించదగిన అటెంప్ట్ ని బోస్ చెయ్యలేదు. ముఖ్యంగా ఒరిజినల్ వెర్షన్ లోని ఒక్క సీన్ కూడా మ్యాచ్ అయ్యేలా ఈ సినిమా లేకపోవడం బాధాకరం.

Sudheer Babu,Nandini Rai,AN Bose,Chakri Chigurupati,Manikanth Kadri.పంచ్ లైన్ : మోసగాళ్ళకు మోసగాడు - ఎంటర్టైన్ చెయ్యలేక ఆడియన్స్ ని మోసం చేసిన మోసగాడు.!

మరింత సమాచారం తెలుసుకోండి: