మెయిన్ యాక్టర్స్ పెర్ఫార్మన్స్ , కొన్ని సాంగ్స్ , కొన్ని పార్ట్స్ లో కామెడీ , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు స్పూఫ్మెయిన్ యాక్టర్స్ పెర్ఫార్మన్స్ , కొన్ని సాంగ్స్ , కొన్ని పార్ట్స్ లో కామెడీ , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు స్పూఫ్థిన్ స్టొరీ లైన్ , నేరేషన్ , ఈ కథ కోసం చాలా సినిమాలను స్ఫూర్తి తీసుకోవడం , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , ఎడిటింగ్ , రిపీట్ గా అనిపించే కామెడీ మరియు పాత్రలు

కార్తీక్ పోతినేని (రామ్) అబ్రాడ్ లో సెటిల్ అయిన ఓ మిల్లీనియర్,అలాగే కెసిజి గ్రూప్ అఫ్ కంపెనీస్ కి హెడ్. వీకెండ్ వెంకట్ రావు(బ్రహ్మానందం) కార్తీక్ కోసం మిల్లీనియర్ అయిన అనుష్క (సోనాల్ చౌహాన్)తో పెళ్లి అరేంజ్ చేస్తాడు. కొద్ది రోజుల్లోనే ఇద్దరూ పెళ్ళికి ఒప్పుకుంటారు. అప్పుడే కార్తీక్ మదర్ (పవిత్ర లోకేష్) తన ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ని చెప్పి తనకి తన బ్రదర్స్ తో కలిసి బొబ్బిలిలో ఉండాలని ఉందనే తన కోరికని బయటపెడుతుంది. అదే టైంలో గ్రీన్ ఆర్మీ హెడ్స్ లో ఒకటైన దివ్య(రకుల్ ప్రీత్ సింగ్) కార్తీక్ కంపెనీ మీద కేసువేస్తుంది. దాంతో అన్ని పనులు ఫినిష్ చెయ్యడానికి మొదటిసారి కార్తీక్ ఇండియా వస్తాడు. గ్రీన్ ఆర్మీలో దివ్యని చూసిన మొదటి చూపులోనే కార్తీక్ ప్రేమలో పడిపోతాడు. అక్కడి నుంచి కట్ చేస్తే దివ్య ఫాదర్ భూపతి మరియు మామయ్య(సంపత్ అండ్ జయప్రకాశ్ రెడ్డి)లు బొబ్బిలిలో బాగా పేరున్నవ్యక్తులు. కానీ చిన్న ఫామిలీ గొడవ వల్ల విడిపోతారు. సత్య ( ఆదిత్య మీనన్) దివ్యని కిడ్నాప్ చెయ్యాలనుకుంటాడు. కానీ  భూపతి దివ్యకి పెళ్లి ఇష్టం లేక పారిపోతోందని దానికి కారణం కార్తీక్ అని అనుకుంటాడు. దాంతో భూపతి కార్తీక్ ని బొబ్బిలి వచ్చి తనని గెలిచి దివ్యని తీసుకెళ్ళమని చెబుతాడు. అలా వచ్చిన కార్తీక్ ఇరు ఫ్యామిలీస్ ని ఎలా కన్విన్స్ చేసాడు.? ఈ జర్నీలో వీకెండ్ వెంకట్ రావు ఏం చేసాడు.? అనుష్క ఏమైంది.? చివరికి కార్తీక్ ఎవరిని పెళ్లిచేసుకున్నాడు.? అలాగే తన మదర్ కోరికని నెరవేర్చాడా.? లేదా.? అన్నది వెండితెరపై చూసి తెలుసుకోవాలి. 

యంగ్ హీరో రామ్ ఈ సినిమాలో మిల్లీనియర్ కాబట్టి లుక్ పరంగా లానే చాలా స్టైలిష్, మోస్ట్ హాన్డ్సం గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ పర్ఫార్మెన్స్ పరంగా పెద్ద చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇలాంటి పాత్రలు రామ్ గతంలో చేశాడు. కావున యాసీటీజ్ గా చేస్కోని వెళ్ళిపోయాడు. రామ్ లో టాలెంట్ ఉంది, ఇలాంటి రెగ్యులర్ స్టోరీస్ మీద కాకుండా కాస్త డిఫరెంట్ స్బజెక్ట్స్ మీద దృష్టి పెడితే తనలోని టాలెంట్ ని బయట పెట్టచ్చు. ఇకపోతే రకుల్ ప్రీత్ సింగ్.. రకుల్ చాలా కష్టపడుతుంది, తనకు ఇచ్చిన పాత్రకి న్యాయం చేస్తోంది. తన పాత్రలు కూడా చాలా సిమిలర్ గా ఉంటున్నాయి. ఇకనైనా కేవలం అలాంటి రెగ్యులర్ పాత్రలే ఎంచుకోవడం తగ్గిస్తే తన కెరీర్ కి పెద్ద హెల్ప్ అవుతుంది. పాటల్లో, సినిమాలో అందంగా కనిపించింది. ఇక సెకండ్ లీడ్ సొనాల్ చౌహాన్ తన అందాల ఆరబోతతో అందరినీ ఆకట్టుకుంది. కానీ తాను డైలాగ్ డెలివరీ మీద, హావ భావాల మీద ఇంకాస్త పట్టు తెచ్చుకోవాలి. కామెడీ కింగ్ బ్రహ్మానందం తన పాత్రలో జీవించడమే కాకుండా ఆడియన్స్ ని నవ్వించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. సంపత్, సాయి కుమార్, బ్రహ్మాజీ, ఆదిత్య మీనన్, రఘుబాబులు వారి పాత్రలకి న్యాయం చేశారు. పవిత్ర లోకేష్, సురేఖ వాణి లాంటి వారు కూడా తమ పాత్రల పరిధిమేర నటించారు. పృధ్వి - శకలక శంకర్ లపై చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు స్పూఫ్ ఆన్ స్క్రీన్ సూపర్బ్ గా వర్క్ ఔట్ అయ్యింది. ఈ ఎపిసోడ్ అందరినీ బాగా నవ్విస్తుంది.

పండగ చేస్కో సినిమా చూడగానే మీ మాదిలో చాలా సినిమాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను కలబోసి మిక్స్ చేసి వడబోసి ఈ సినిమాని తీసారు. మాకు అనిపించిన కొన్ని మీకు అందిస్తున్నాం. మొదటగా రామ్ హీరోగా 2000 సంవత్సరంలో వచ్చిన రెడీ. అనగా విడిపోయిన రెండు ఫామిలీస్ మధ్యకి రావడం వారికి కుటుంబ విలువలు తెలియజేసి వారిని కలపడం. ఇకపోతే సుకుమారుడు, గ్రీకు వీరుడు, గోవిందుడు అందరివాడేలే, అత్తారింటికి దారేది సినిమాల నుంచి హీరో పాత్రని కాఫీకొట్టారు. అబ్రాడ్ లో సెటిల్ అయిన కుర్రాడు ఫ్యామిలీని దగ్గర చెయ్యడం కోసం ఇండియా రావడం. ఓవరాల్ గా మిమ్మల్ని థ్రిల్ చేసేలానో లేదా సర్ప్రైజ్ చేసేలానో కథలో ఎలాంటి ఎలిమెంట్స్ లేవు, కొత్తదనమూ లేదు. 

పండగ చేస్కో సినిమాలో మీకెక్కడా ఒరిజినాలిటీ కనిపించదు. చాలా సినిమాలలో వచ్చిన సీన్స్ ఏ మీకు కనిపిస్తూ ఉండడం, గతంలో వచ్చిన కోన వెంకట్ మార్క్ సీన్స్ రిపీట్ అవుతూ ఉండడం చూసే ఆడియన్స్ కి నచ్చదు. ఎంచుకున్న స్టొరీ లైన్ చాలా చిన్నది. స్క్రీన్ ప్లే కూడా చాలా దానికి తోడు చాలా రొటీన్ ప్లాట్ కి సిల్లీ జోక్స్ ని అక్కడక్కడా పేర్చుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడో కొన్ని కామెడీ సీన్స్ మాత్రమే పేలాయి. కాస్త కథలో ఒరిజినాలిటీ ఉండి,  సీక్వెన్స్ లను ఇంకాస్తా బాగా అరేంజ్ చేసుకొని ఉంటే సినిమాకి ఇంకాస్త బెటర్ ఎంటర్ టైనర్ అయ్యుండేది. కనీసం ఇలాంటి రొటీన్ కథలని కాస్త చిన్నగా  చెప్పాలి కానీ పండగ చేస్కో సినిమాని బాగా సాగదీసి 2 గంటల 42 నిమిషాలుగా చేయడం ఆడియన్స్ కి భారంగా మారింది. ఇకనైనా మేలుకొని దాదాపు 20 నిమిషాలు ట్రిమ్ చేస్తే బాగుంటుంది. గోపీచంద్ మలినేని - కోన వెంకట్ - వెలిగొండ శ్రీనివాస్ ల కథలో ఒరిజినాలిటీ, కొత్తదనం, ఫ్రెష్ కామెడీ అన్నీ మిస్ అయ్యాయి. గోపీచంద్ మలినేని డైరెక్షన్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. 

మిగిలిన సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, తమన్ అందించిన సాంగ్స్ మరియు నేపధ్య సంగీతం జస్ట్ ఓకే. ఆర్థర్ ఎ. విల్సన్ సినిమాటోగ్రఫీ ఉండాల్సిన స్థాయిలో లేదు. కొన్ని చాలా బాగుంది , కొన్ని చోట్ల అంత గొప్పగా లేదు. కోన వెంకట్ డైలాగ్స్ కొన్ని చోట్ల మాత్రమే వర్క్ అవుట్ అయ్యాయి. ఉదాహరణకి లైఫ్ లో గోల్ ఉన్నవాడు రీచ్ అయ్యాక కూల్ అవుతాడు, ఏ గోల్ లేనివాడు ఎక్కడికైనా దూసుకెళ్ళిపోతాడు. ఇన్నాళ్ళు పగని గెలిపించారు, ఈ ఒక్కసారి ప్రేమను గెలిపించండి. కొంతమందికి మిర్రర్ లా కనపడతా కొంతమందికి ఎర్రర్ లా కనపడతా. మగతనం అనేది మట్టిలో కాదు రా చేతుల్లోఉంటుంది, నీకు బిపి వస్తే నీ పనివాడు వణుకు తాడేమో నాకు బిపి వస్తే ప్రతి వాడు వణుకు తాడు మొదలైనవి. యాక్షన్ ఎపిసోడ్స్ జస్ట్ ఓకే. ఎడిటింగ్ అస్సలు బాలేదు. యునైటెడ్ బ్యానర్  నిర్మాణ విలువలు బాగున్నాయి. 


పండగ చేస్కో సినిమా ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ తో మిమ్మల్ని బాగా నవ్విస్తారు, కానీ ఒక్కసారి ఇంటర్వెల్ అయ్యాక సినిమా వేగం పడిపోవడమే కాకుండా కామెడీ కాస్తా డ్రామాగా మారిపోతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గరికి తీసుకువచ్చే సీన్స్ ని బాగా సాగాదీసేసారు. అంతే కాకుండా క్లైమాక్స్ మరీ ఊహాజనితం కావున బాగా బోరింగ్అనిపిస్తుంది . పైన చెప్పిన ఏవీ సరిగా కుక్ చేయకపోవడం వలన పండగ చేస్కో ఎవ్వరినీ  మెప్పించలేకపోయింది. ఓవరాల్ గా పండగ చేస్కో సినిమాని ఎ కోన వెంకట్ ఫిల్మ్ అని చెప్పచ్చు. కానీ సినిమాలో చాలా అనవసరమైన ఎలిమెంట్స్ ఉండడం వలన, రైటింగ్ లో కొన్ని తేడాలు ఉండడం వలన స్క్రీన్ వారి మేజిక్ మిస్అయ్యింది, సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయలేకపోయింది.

Ram,Rakul Preet Singh,Sonal Chauhan,Gopichand Malineni,Paruchuri Kireeti,S.Thaman.పంచ్ లైన్ : పండగ చేస్కో - ఆల్ హిట్ ఫిల్మ్స్ మిక్స్డ్ ఫిల్మ్ బట్ ఫెయిల్యూర్ ప్రోడక్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి: