నారా రోహిత్ సూపర్బ్ పెర్ఫార్మన్స్ , ప్రియా బెనర్జీ స్క్రీన్ ప్రెజన్స్ , సాయి కార్తీక్ మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ , కొన్ని థ్రిల్స్ నారా రోహిత్ సూపర్బ్ పెర్ఫార్మన్స్ , ప్రియా బెనర్జీ స్క్రీన్ ప్రెజన్స్ , సాయి కార్తీక్ మ్యూజిక్ , సినిమాటోగ్రఫీ , కొన్ని థ్రిల్స్ సింపుల్ స్టొరీ లైన్ , వెరీ ఫ్లాట్ అండ్ స్లో నేరేషన్ , తెలిసిపోతూ సాగే కథనం , చాలా చోట్ల సాగదీయడం , వావ్ అనుకునే రేంజ్ థ్రిల్స్ లేకపోవడం , ఎడిటింగ్

తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి లోని కేంద్ర కర్మాగారంలో జైలర్ గా పనిచేస్తుంటాడు మన హీరో ధర్మ తేజ(నారా రోహిత్). ధర్మ తేజకి డిపార్ట్ మెంట్ లో రాక్షసుడు అనే పేరుంటుంది. దానికి కారణం తప్పు చేసిన వాడు ఎవడూ తప్పించుకోకూడదు మరియు తప్పు చేసిన వాడికి అక్కడే శిక్ష పడాలి అనే మనస్తత్వం ఉన్నవాడు మన ధర్మ. మన ధర్మ హారిక(ప్రియా బెనర్జీ) ప్రేమలో ఉంటారు. ఇలా అంతా సాఫీగా సాగుతున్న టైంలో.. అలాంటి ధర్మ జైలులోకి ఆస్తి కోసం కుటుంబం మొత్తాన్ని చంపేసిన చంద్రశేఖర్ అలియాస్ చార్లీ(రవి వర్మ) ఖైదీగా వస్తాడు. చార్లీకి మరి కొద్ది రోజుల్లో ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంటుంది. కానీ ఏం చేసైనా అక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుంటాడు చార్లీ. అందులో భాగంగానే చార్లీ అదే జైలులో ఉన్న పాండు అనే వాడితో కలిసి వాడిని రిలీజ్ చేయించి తనని అక్కడి నుంచి తప్పించమని, తనని తప్పిస్తే భారీ అమౌంట్ ఇస్తానని చెప్తాడు. అలా బయట వచ్చిన పాండు లోకల్ రౌడీ అయిన ముత్యం రెడ్డి(మధు సింగంపల్లి) కలిసి చార్లీ ఎస్కేప్ కి ప్లాన్ చేస్తాడు. ఈ ఎస్కేప్ గురించి ధర్మ తెలుసుకోగలిగాడా.? లేదా.? చార్లీని తప్పించడం కోసం ముత్యం రెడ్డి వేసిన ప్లాన్ ఏంటి.? చివరికి ఛార్లీ తప్పించుకున్నాడా.? లేక ధర్మ తన జైల్లోనే ఉరి తీయబడ్డాడా.? అన్న అంశాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాలి..

అసుర సినిమా ఒక ఫ్లాట్ యాక్షన్ థ్రిల్లర్.. సినిమా ఎక్కువ భాగం ఓ ఐదారు పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.. ఇక నటీనటుల విషయానికి వస్తే... సినిమా సినిమాకి నటుడిగా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్న హీరో నారా రోహిత్.. ప్రతి సినిమాలోనూ ఎదో ఒక కొత్త వేరిఎషణ్ ట్రై చేస్తున్న నారా రోహిత్ ఈ సినిమాలోనూ డిఫరెంట్ మానరిజమ్స్ తో ఆకట్టుకున్నాడు. నటుడిగా నారా రోహిత్ ని మరో మెట్టు పైకి తీసుకెళ్ళే సినిమా అసుర. టైటిల్ ని ప్రతిబింబించేలా అతని పాత్రలో నటనని కనబరిచి శభాష్ అనిపించాడు. అలాగే అతని వాయిస్ మాడ్యులేషన్, అతని చేత చెప్పించిన డైలాగ్స్ సూపర్బ్. నారా రోహిత్ ని పక్కన పెడితే హీరో పాత్రలో సరైన ఎస్టాబ్లిష్ మెంట్ లేదు. ఇది డైరెక్టర్ తప్పు కావున దాని గురించి కింద సెక్షన్ లో చెబుతా.. ఇక హీరోయిన్ ప్రియా బెనర్జీ(కిస్, జోరు ఫేం).. ప్రియా ది బెస్ట్ స్క్రీన్ అప్పియరెన్స్ ఈ సినిమాలోనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. డైరెక్టర్ తనని చాలా బాగా చూపించాడు, అంతే కాకుండా తనది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. విలన్ గా రవి వర్మ పెర్ఫార్మన్స్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. మధుసూదన్ రావు కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రని బాగా చేసాడు. స్పెషల్ సాంగ్ లో శ్రీ విష్ణు అతిధి పాత్ర డీసెంట్ గా ఉంది. రూపాదేవి, భాను, సత్యదేవ, వెన్నెల రామారావులు తమ పాత్రలకు న్యాయం చేసారు.

అసుర – ఈ సినిమా తెరకెక్కిన జోనర్ గురించి చెప్పాలంటే.. ఇదొక సైలెంట్ యాక్షన్ థ్రిల్లర్.. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ సినిమా విషయానికి వచ్చే సరికి సైలైంట్ థ్రిల్లర్ ని కాస్తా స్లో ఫేస్ థ్రిల్లర్ గా మార్చేసారు. డైరెక్టర్ కృష్ణ విజయ్ కి ఇది తొలి సినిమా.. కథ కోసం పెద్దగా కష్టపడలేదు.. చాలా సింపుల్ లైన్ కి కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ ని జత చేసి ఆడియన్స్ ని థ్రిల్ చేద్దాం అనుకున్నాడు. అంతవరకూ బాగానే ఉంది. అలా అనుకున్న డైరెక్టర్ ఆడియన్స్ వావ్.. దీనెమ్మా ఏమన్నా థ్రిల్స్ ఇచ్చాడా డైరెక్టర్ అనేలా ప్లాన్ చేసుకోవాల్సింది.. కానీ ఆ విషయంలో డైరెక్టర్ కృష్ణ విజయ్ ఫెయిల్ అయ్యాడు. కథ ఎంత సింపుల్ గా రాసుకున్నాడో థ్రిల్స్ ని కూడా అంతే సింపుల్ గా రాసుకున్నాడు. దానివల్ల సినిమా మొత్తం చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. ఎక్కడా ఆడియన్స్ ని ఉత్కంటకి గురి చేయలేకపోయాడు. ఇక్కడ డైరెక్టర్ చేసిన తప్పు హీరో మరియు విలన్ వెర్షన్స్ ని ఒకేసారి స్క్రీన్ మీద నెరేట్ చేస్తూ ఉండడం.. దానివల్ల రెండు కథలలలో జరిగే ఎలిమెంట్స్ తెలిసిపోతూ ఉండడం వలన ఆడియన్స్ లో పెద్ద థ్రిల్లింగ్ ఉండదు. ఇంటర్వల్ బ్లాక్ దగ్గర సినిమాని కాస్త స్పీడప్ చేసిన ఫీలింగ్ వస్తుంది కానీ సెకండాఫ్ లో మళ్ళీ స్లోగా తీసుకెళ్ళాడు.. సినిమాకి మొత్తంగా ఉన్న ఏకైక థ్రిల్ ని చాలా సింపుల్ గా రివీల్ చేసేసాడు. ఆ థ్రిల్ ని అన్నా కాస్త ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యేలా రివీల్ చేయాల్సింది.. ఇకపోతే డైరెక్టర్ కృష్ణ విజయ్ హీరో పాత్రని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదు.. ఉదాహరణకి హీరోని డిపార్ట్ మెంట్ లో అందరూ రాక్షసుడు అంటుంటారు. అసలు ఎందుకు రాక్షసుడు అంటారు అనే విషయం జస్టిఫై చెయ్యడానికి ట్రై చెయ్యలేదు. నారా రోహిత్ ని ఇంటెన్స్ లుక్ వచ్చేలా చూపించిన పాత్రలో ఆ ఇంటెన్స్ చూపించకపోతే పాత్ర పెద్దగా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వదు. అదే ఈ సినిమాలోనూ జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే కనీసం నెరేషన్ అయినా స్పీడ్ గా ఉండేలా ప్లాన్ చేసుకోవాల్సింది. కానీ చాలా ఫ్లాట్ గా నెరేషన్ ఉండడం సినిమాకి మరో మైనస్. ఓవరాల్ గా కృష్ణ విజయ్ తన మొదటి సినిమాతో యావరేజ్ అటెంప్ట్ మాత్రమే ఇవ్వగలిగాడు. తను చేసిన ఈ అసుర సినిమా ఎలా ఉంది అంటే అటు బాగుంది అనలేం, అలా అని బాలేదు అని కూడా అనలేం. ఎదో మధ్యస్థంగా ఉంది.


ఇక మిగతా డిపార్ట్ మెంట్స్ లో చెప్పుకోవాల్సినవి ఉన్నాయి.. ఎస్వి విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ బాగుంది. హీరోని చూపించిన విధానం చాలా బాగుంది. ప్రతి ఒక్క నటీనటుల హావ భావాలను బాగా కాప్చ్యూర్ చేసాడు. సాయి కార్తీక్ సాంగ్స్ బాగున్నాయి.. అలాగే అతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. హీరో ఎలివేషన్ సీన్స్, విలన్ సీన్స్ కి, ఇంటర్వల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో మ్యూజిక్ బాగుంది. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ ఓకే.. కానీ ఫస్ట్ హాఫ్ లో ఇంకొన్ని సీన్స్ ని కట్ చేసి సాగదీతని కట్ చేసి ఉండాల్సింది. మురళి కొండేటి ఆర్ట్ వర్క్ రియలిస్టిక్ గా ఉన్నాయి. కృష్ణ విజయ్ డైలాగ్స్ చాలా మీనింగ్ ఫుల్ గా ఉండడమే కాకుండా కథకి బాగా సెట్ అయ్యాయి. ముఖ్యంగా సినిమాలో చెప్పిన కవితలు చాలా బాగున్నాయి. ఉదాహరణకి – బతకనివ్వని వాడికి బతికే హక్కు లేదు, మనిషనే వాడు బయటకి కనపడతాడు, కవి అనేవాడు లోపల ఉంటాడు.. శ్యాం దేవభక్తుని – కృష్ణ విజయ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.


నారా రోహిత్ ప్రతి సినిమాతో ఎదో ఒక కొత్తదనం ట్రై చేసి ప్రేక్షకులను థ్రిల్ చెయ్యడానికి ట్రై చేస్తూ ఉన్నాడు.. అలా ట్రై చేసిన సినిమానే ఈ అసుర. ఇలాంటి సినిమా టాలీవుడ్ కి కాస్త కొత్తగా ఉంటుంది. సింపుల్ స్టొరీ లైన్ తో స్క్రీన్ ప్లే తో మేజిక్ చెయ్యాలని మొదలు పెట్టిన ఈ సినిమాకి అనుకున్న స్థాయిలో స్క్రీన్ ప్లే లేదా థ్రిల్స్ మేజిక్ వర్కౌట్ అవ్వలేదు. చాలా డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్లాన్ చేసిన ఈ సినిమాని అంతే పర్ఫెక్ట్ గా తీయగలిగి ఉంటే టాలీవుడ్ లో ఓ కొత్త సినిమా జోనర్ కి శ్రీకారం చుట్టినట్టుండేది. కానీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోవడం వలన ఆ ఫీలింగ్ ని కలిగించలేకపోయారు. డైరెక్టర్ కృష్ణ విజయ్ థ్రిల్స్ మీద ఇంకాస్త వర్కౌట్ చేసి ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. ఓవరాల్ గా అసుర సినిమా థియేటర్ కి వెళ్ళిన ఆడియన్స్ ని నిరుత్సాహపరచదు. అలాగని ఆడియన్స్ చేత సూపర్బ్ సినిమా అని కూడా అనిపించుకోదు. ఒక డీసెంట్ గానే ఉంది అనే ఫీలింగ్ తో ప్రేక్షకులు బయటకి వస్తారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడని వారికి, కాస్త డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలని ఇష్టపడే వారు ఈ సినిమాని ఓ సారి ట్రై చెయ్యచ్చు. చివరిగా నారా రోహిత్ మరో డిఫరెంట్ అటెంప్ట్ తో వచ్చి తనలోని అభిరుచిని, టాలెంట్ ని నిరూపించుకున్నాడు కానీ డైరెక్టర్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోవడం వలన అసుర సినిమా కమర్షియల్ యాంగిల్లో యావరేజ్ గా మిగిలిపోవాల్సి వచ్చింది.

Nara Rohit,Priya Benerjee,Krishna Vijay,Shyam,Sai Karthik.పంచ్ లైన్ : అసుర – ఆడియన్స్ ని థ్రిల్ చేయలేకపోయిన ‘రాక్షసుడు’ అలియాస్ ‘అసుర’.!

మరింత సమాచారం తెలుసుకోండి: