తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే సినిమాగా ‘బాహుబలి’ చరిత్ర సృష్టిస్తుంది అని కామెంట్స్ వస్తూ ఉంటే ‘బాహుబలి’ సినిమా వల్ల గత ఏడాది పైగా టాలీవుడ్ లో సరియైన స్థాయిలో సినిమాల నిర్మాణం జరగడం లేదు అని ఒక ప్రముఖ నిర్మాత కామెంట్ చేసినట్లుగా వస్తున్న వార్తలు సంచలనాలను సృస్టిస్తున్నాయి. దీనికి ఆ ప్రముఖ నిర్మాత చెప్పిన కారణాలు కూడ అత్యంత ఆసక్తిదాయకంగా ఉన్నాయి. 

టాలీవుడ్ లో సినిమాలకు ఫైనాన్స్ చేసేవారంతా ఒక్కసారిగా భారీ సినిమాల వైపు ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమా వైపు మొగ్గు చూపడంతో చిన్న చిత్రాలకు, మీడియo బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే ఫైనాన్షియర్లు అంతా తమ డబ్బును ‘బాహుబలి’ నిర్మాతల వద్ద బ్లాక్ చేసుకున్నారని దీనివల్ల టాలీవుడ్ లో గత ఏడాది కాలంగా జరుగుతున్న సినిమా ప్రారంభోత్సవాల సంఖ్య బాగా తగ్గిందని ఆ ప్రముఖ నిర్మాత విశ్లేషణ. 

రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' కోసం వందల కోట్లు ఖర్చవడంతో తెలుగు సినిమాలకు ఫైనాన్సియర్లు ఇచ్చేవారందరినీ ఏరికోరి ఆ నిర్మాతలు పట్టుకున్నారని భారీ ప్రాజెక్ట్‌లో పెట్టిన పెట్టుబడితో పాటు అడిగినంత వడ్డీ కూడా రావడంతో చిన్నాచితకా కలిపి దాదాపు 18 మంది ఫైనాన్సియర్లు ఆ చిత్రానికి పెట్టుబడి పెట్టారు అనే షాకింగ్ కామెంట్స్ ఆ ప్రముఖ నిర్మాత ‘బాహుబలి’ నిర్మాతల పై చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా ‘బాహుబలి’ సాధించే విజయం బట్టి తదుపరి కాలంలో టాలీవుడ్ లో భారీ సినిమాల నిర్మాణం ఆధార పడి ఉంటుంది అన్నది వాస్తవం. 

ఈ వార్తలు ఇలా ఉండగా ‘బాహుబలి’ సినిమాను చైనా, జపాన్ దేశాలలో కూడా విడుదల చేసే ఉద్దేశ్యంలో రాజమౌళి ఉండటంతో అక్కడ తెలుగు చిత్రాలు విడుదలయితే చైనా చిత్రాలకు ఆదరణ తగ్గిపోతుందనే ఉద్దేశ్యంతో అక్కడి ధియేటర్ల రెంట్ దాదాపు 7 రెట్లు ఎక్కువ చెప్పినా వెనుతిరిగి చూడకుండా ఆ దేశాలలో ‘బాహుబలి’ ని విడుదల చేయడానికి రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని పరిశీలిస్తే బాహుబలి విజయం పై రాజమౌళికి ఎంత నమ్మకం ఉందో అర్ధం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: