హీరోయిన్ ప్రగతి , కొన్ని చోట్ల బాగున్నాయి అనిపించే టెక్నికల్ వర్క్స్ హీరోయిన్ ప్రగతి , కొన్ని చోట్ల బాగున్నాయి అనిపించే టెక్నికల్ వర్క్స్ శ్రేయాన్ , మ్యూజిక్ , సందర్భం లేకుండా అవచ్చే సాంగ్స్ , బలవంతంగా ఇరికించిన అడల్ట్ కామెడీ , అనవసరంగా సాగదీసిన సెకండాఫ్ , పాత్రల మధ్య ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవ్వడం , డైరెక్షన్ , పరమ రొటీన్ స్క్రిప్ట్ , హీరో , హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ లేకపోవడం , క్లైమాక్స్

అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన అమ్మిరాజు(ముఖేష్ ఋషి) తమ్ముడు విజయ్(శ్రేయాన్ కపూర్) తన ఇంట్లో ఉన్న స్రవంతి(ప్రగతి)ని చూసి ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకి అది టూ సైడ్ లవ్ గా మారుతుంది. కానీ ప్రగతి అమ్మిరాజుకి పోటీ అయిన భిక్షపతి(కోట శ్రీనివాసరావు) కూతురు. భిక్షపతి కొడుకు అభిమన్యు సింగ్ ఆ బస్తీలో పెద్ద గుండా. అమ్మిరాజు ఫ్యామిలీ మీద దాడి చేసిన అభిమన్యు సింగ్ అమ్మిరాజుకి బాగా కావాల్సిన తన అసిస్టెంట్ భార్యని చంపేస్తాడు. అప్పుడే కథ మొత్తం స్రవంతి మీదకి డైవర్ట్ అవుతుంది. అదే టైంలో ఒక ఇద్దరు గుట్టు తెలియని వ్యక్తులు స్రవంతిని కిడ్నాప్ చేస్తారు. అభిమన్యు సింగ్ ఆ పని చేసింది అమ్మిరాజు అని ఫిక్స్ అయిపోతాడు. అక్కడి నుంచి విజయ్ రంగంలోకి దిగి న్ని గోదావాలని ఎలా కంట్రోల్ చేసాడు.? చివరికి తమ శత్రువుగా భావించే భిక్షపతి కూతురు స్రవంతిని పెళ్లి చేసుకున్నాడా.? లేదా.? అనేది మీరు వెండితెరపై చూడాల్సిందే. 

అలనాటి స్టార్ హీరోయిన్, ఇప్పటి స్టార్ యాక్టర్, సహజనటి జయసుధ కుమారుడు శ్రేయాన్ కపూర్ బస్తీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. జయసుధ తనయుడు కావడంతో అతనిపై, సినిమాపై చాలా అంచనాలే ఉన్నాయి. కానీ ఈ సినిమా మమ్మల్ని పూర్తిగా నిరుత్సాహపరిచింది. శ్రేయాన్ కపూర్ ఫేస్ లో హావభావాలు సరిగా పలకలేదు. చాలా సన్నివేశాలలో అతని హావభావాలు నేచురల్ గా కాకుండా ఓ స్టడీ బొమ్మలా ఉన్నాయి. శ్రేయాన్ డైలాగ్ డెలివరీ కూడా బాగాలేదు. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ప్రగతి మాత్రం మంచి మార్కులు కొట్టేసింది. తొలి సినిమా అయినా చాలా కాన్ఫిడెంట్ గా చేసి తన పాత్రకి పూర్తి న్యాయం చేసారు. ఎంతో ఎనర్జీతో నటించిన ప్రగతికి లిప్సిక భాష్యం చెప్పిన డబ్బింగ్ కూడా బాగా సెట్ అయ్యింది. ఓకే డాన్ గా, బ్రదర్ గా ముఖేష్ ఋషి మంచి నటనని కనబరిచారు. ఓ పర్ఫెక్ట్ విలన్ గా అభిమన్యు సింగ్ మెప్పించాడు. కమెడియన్స్ అయిన స్నిగ్ద, అలీ, సప్తగిరి, సత్యలు నవ్వించడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు. మిగిలిన వారు చిన్న చిన్న పాత్రల్లో పరవాలేధనిపించారు. 

శ్రేయాన్ ని పరిచయం చేయడానికి ఎంచుకున్న ఈ సినిమా కథ చాలా చాలా పాతది మరియు చాలా కాలం నుంచి తెలుగులో వస్తున్న రొటీన్ టిపికల్ ఫార్మాట్ కమర్షియల్ సినిమా. గతంలో తెలుగులో వచ్చిన ఢీ, రెడీ, దేనికైనా రెడీ, జయీభవ, బాబీ సినిమాలు కనిపిస్తాయి. రొటీన్ అనే పదానికే కోపం వచ్చేంత రొటీన్ గా ప్రారంభమయ్యే సినిమా ఆక్కడి నుంచి అదే ఫార్మాట్ లో ఇంటర్వల్ కి చేరుకోవడం దానికన్నా ఘోరంగా సెకండాఫ్ చాలా వరకూ సాగడం చాలా చెత్తగా అనిపిస్తుంది. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్.. క్లైమాక్స్ ముందు ఒక 20 నిమిషాలు అలా పర్లేదు అనిపించి మళ్ళీ క్లైమాక్స్ ని గంగలో కలిపేసాడు. కానీ ఇలాంటి ఫార్మట్ సినిమాలో అస్సలు కామెడీ లేకపోవడం, ఆకట్టుకునే ఒక్క రొమాంటిక్ సీన్స్ కూడా లేకపోవడం పెద్ద డ్రా బ్యాక్. శ్రేయాన్ - ప్రగతిల మధ్య లవ్ ట్రాక్ అస్సలు బాలేదు, వాళ్ళిద్దరూ లవర్స్ అంటున్నారు నాలుగు మంచి సీన్స్ అన్నా పెట్టండ్రోయ్ అని ప్రేక్షకులు ఫీలవుతారు. అలాగే సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ఒక్క ఎమోషనల్ సీన్ ని కూడా సరిగా తీయలేదు. దానివల్ల ఆడియన్స్ అస్సలు ఈ సినిమాలోని పాత్రలకి, ఎమోషన్స్ ని కనెక్ట్ కారు. ఈ చిత్ర డైరెక్టర్ వాసు మంతెన ప్రతి పాయింట్ లోనూ ఓ ఎమోషన్ లేదా ఒక కారణంని చూపించే అవకాశం ఉన్నా ఎక్కడా చూపలేకపోయాడు. ఈ సినిమాకి చాలా చోట్ల హెల్ప్ అయ్యింది మాత్రం ఈ సినిమా మ్యూజిక్. ప్రవీణ్ ఇమ్మడి అందించిన మ్యూజిక్ ఆల్బంలో మూడు సాంగ్స్ చాలా బాగున్నాయి కానీ ఆ పాటలు అవ్చ్చే సందర్భాలు మాత్రం అస్సలు బాలేదు. అలాగే రీ రికార్డింగ్ అస్సలు హెల్ప్ కాలేదు. ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల మనకు జీన్స్ మరియు రామ్ గోపాల్ వర్మ సినిమాల మ్యూజిక్ ప్రతిబింబించేలా మ్యూజిక్ ఉంది. వికె గుణశేఖర్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఈ మూవీ ఎడిటింగ్ పెట్రోల్ అయిపోయిన బండి జర్క్ లు ఇచ్చినట్టు సాగుతుంది. చాలా సీన్స్ సరిగా ఎండ్ అవ్వకముందే నెక్స్ట్ సీన్ కి వెళ్లిపోతుంటాయి. ఈ సినిమాని ఇంకాస్త కట్ చేసి ఉంటే బాగుండేది. వజ్మాన్ ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే, పరవాలేదు బాగానే ఉన్నాయి. 

'టాలీవుడ్ లో ఇప్పటివరకూ వచ్చిన, వస్తూనే ఉన్న ఎన్నో టిపికల్ అండ్ రొటీన్ టీనేజ్ రొమాంటిక్ లవ్ స్టొరీనే ఈ బస్తీ కూడాను. డైరెక్టర్ వాసు ఫ్యాక్షన్ - లవ్ ని బేస్ చేసుకొని ఓ సింపుల్ స్టొరీ లైన్ ని ఈ మూవీ కోసం సెలక్ట్ చేసుకున్నాడు. అనుకున్న దాని ప్రకారం వాసు ఓ ఎమోషనల్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో ఈ టీనేజ్ లవ్ స్టొరీని చెప్పాలి కానీ తను మాత్రం టీనేజర్స్ లవ్ లైఫ్ ఎలా ఉంటుందనేది చూపించారే తప్ప ఫ్యామిలీ ఎమోషన్స్ ని గాలికి వదిలేసాడు. పూర్తిగా ఇప్పటితరాన్ని మైండ్ లో పెట్టుకొని ఈ కథ రాయలేదనే విషయం మనకు సినిమా చేస్తున్నప్పుడు తెలుస్తుంది. దానికి ఎఫెక్ట్ గానే మనకు లవ్ సీన్స్ లో ఎక్కడా ఫ్రెష్ నెస్ కనపడదు. ఈ సినిమాని కాపాడిన విషయాలు ఏమన్నా ఉన్నాయా అంటే అది చార్మింగ్ గర్ల్ ప్రగతి పెర్ఫార్మన్స్ ఒక్కటే. ఓవరాల్ గా ఒక్క మాటలో ఫినిష్ చెయ్యాలంటే థియేటర్లో 116 నిమిషాలు టార్చర్ పెట్టే సినిమానే 'బస్తీ'.

Shreyan,Pragathi Chourasiya,Vasu Manthena,Praveen Immadiపంచ్ లైన్ : బస్తీ - మీ 'బస్తీ'లో ఉంటే పారిపోండి.!

మరింత సమాచారం తెలుసుకోండి: