వెన్నెల కిషోర్ కామెడీ పంచ్ లు , సినిమాటోగ్రఫీ , మనోజ్, నాని, అల్లరి నరేష్, తనీష్ ల గెస్ట్ అప్పియరెన్స్ , సాయి కార్తీక్ రీ రికార్డింగ్ వెన్నెల కిషోర్ కామెడీ పంచ్ లు , సినిమాటోగ్రఫీ , మనోజ్, నాని, అల్లరి నరేష్, తనీష్ ల గెస్ట్ అప్పియరెన్స్ , సాయి కార్తీక్ రీ రికార్డింగ్ రొటీన్ స్టొరీ లైన్ , ఊహాజనిత స్క్రీన్ ప్లే , డెడ్ స్లో నేరేషన్ , సొల్లు సెకండాఫ్ , హెల్ప్ కాని సాంగ్స్ ప్లేస్ మెంట్స్ , దర్శకత్వం , ఎడిటింగ్ , చాలా సిల్లీగా అనిపించే కిడ్నాప్ ఎలిమెంట్స్

ఈ కిడ్నాప్ కథ ఒక ముగ్గురు యువకుల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళలో ఒక్కక్కరి గురించి చెబితే.. చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో సినిమా నిర్మాత కొడుకైన జై(ఆదర్శ్ బాలకృష్ణ) డ్రగ్స్ కి అలవాటు పడతాడు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి ప్రియ(పూనం కౌర్) తనని వదిలి ఎవరితోనో ఉందని తెలుసుకొని డిప్రెషన్ లో ఉంటాడు నందు(నందు). చివరిగా భూపాల్(భూపాల్) ఎప్పటికైనా మహేష్ బాబుతో సినిమా చెయ్యాలని సిటీకి వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేస్తుంటాడు. ఒకానొక సందర్భంలో ఈ ముగ్గురు రౌడీ షీటర్ అయిన పత్తాల రాజు(ఫిష్ వెంకట్) దగ్గర ఇరుక్కుంటారు. వాడికి 10 రోజుల్లో 50 లక్షలు కట్టాల్సి వస్తుంది. దాంతో చేతిలో చిల్లిగవ్వ కూడా లేని ఈ ముగ్గురులో జై చెప్పిన ఐడియా ప్రకారం సూపర్ స్టార్ మహెష్ బాబుని కిడ్నాప్ చెయ్యాలని ప్లాన్ చేస్తారు. అనుకున్నట్టుగానే చేసేస్తారు. కానీ కథలో అప్పుడే అసలైన ట్విస్ట్. అసలు ఆ ట్విస్ట్ ఏంటి.? ఆ ట్విస్ట్ వల్ల వారి జీవితంలో ఎదుర్కున్న సమస్యలు ఏమిటి.? అసలు ఈ ముగ్గురు పత్తాల రాజు దగ్గర ఎందుకు ఇరుక్కున్నారు.? ఫైనల్ గా వారు ఈ కిడ్నాప్ ద్వారా కావాలి అనుకున్న మనీ దక్కిందా.? లేదా.? అనేది మీరు సిల్వర్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయాల్సిందే.. 

ఈ సినిమాలో అందరూ యువ నటీనటులే నటించారు. అందరూ తమ పాత్రల్లో పరవాలేదనిపించారు. హ్యాపీ డేస్ ఫేం ఆదర్శ్ బాలకృష్ణ ఒక నిర్మాత కొడుకులో ఉండే బలుపును, అలాగే డ్రగ్స్ కి అలవాటు పడిన వాడి బిహేవియర్ ఎలా ఉంటుందనేది బాగా చూపించాడు. అలాగే రిచ్ కిడ్ లుక్ కి పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ఇక 100% లవ్ ఫేం నందు ఈ సినిమాలో కూడా తనకిచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. ఇకపోతే భూపాల్ తెలంగాణ కుర్రాడిగా, ఆ యాసలో మాట్లాడుతూ మెప్పించాడు. భూపాల్ తెలంగాణా యాస డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. సెకండాఫ్ లో వచ్చే వెన్నెల కిషోర్ రియల్ లైఫ్ క్యారెక్టర్ లో బాగానే నవ్వించాడు. హాట్ బ్యూటీ శ్రద్ధ దాస్ లేడీ డాన్ ఫరాఖాన్ పాత్రలో బాగా సెట్ అయ్యింది. అలాగే నెగటివ్ షేడ్స్ ని బాగా చూపించింది. ఇక అతిధి పాత్రల్లో మంచు మనోజ్, అల్లరి నరేష్, నాని, తనీష్ లు మెప్పించారు.  ముఖ్యంగా వీరి గెస్ట్ రోల్స్ చేసిన సీన్స్ సినిమాకి బెస్ట్ అని చెప్పుకోవాలి. ప్రియ పాత్రలో పూనం కౌర్ కాసేపు గ్లామరస్ గా కనిపించి వెళ్ళిపోయింది. ఫిష్ వెంకట్, పోసాని కృష్ణ మురళి, తాగుబోతు రమేష్ ల పాత్రల వల్ల సినిమాకి పెద్ద ఉపయోగం లేదు. 

ఈ మధ్య టాలీవుడ్ లో బాగా క్లిక్ అయిన క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్ మూవీ ఫార్మాట్ ని సుశాంత్ రెడ్డి తన మొదటి సినిమా కోసం ఎంచుకున్నాడు. అది కూడా ఒక సూపర్ స్టార్ ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించడం అనే పాయింట్ కూడా మనకు పరిచయమే. ఇటీవలే వచ్చిన 'దొంగాట' సినిమా స్టొరీ లైన్ కూడా దీనికి బాగా దగ్గరిగా ఉంటుంది. కావున స్టొరీ లైన్ పరంగా చాలా రొటీన్ గా అనిపిస్తుంది. కానీ కథలోకి ఎవరో స్టార్ అని కొత్త క్యారెక్టర్ ని క్రియేట్ చెయ్యకుండా మనకందరికీ తెలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు చుట్టూ కథ రాసుకోవడం ఈ సినిమాకి కాస్త హెల్ప్ అయ్యింది. మన టాలీవుడ్ తో లింక్ పెడుతూ రాసుకోవడం కాస్త బాగానే ఉందనిపిస్తుంది. కథ వరకూ ఓకే అనిపించుకున్న డైరెక్టర్ సుశాంత్ రెడ్డి మిహిలిన డిపార్ట్ మెంట్స్ ని సరిగా డీల్ చెయ్యలేకపోయాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా దారుణంగా రాసుకున్నాడు. ఇలాంటి సినిమాని రెండు గంటల్లో చెప్పాలనుకోవడం చాలా మంచి నిర్ణయం కానీ ఆ రెండు గంటలు కూడా ఆడియన్స్ ని సరిగా కూర్చో బెట్టలేకపోవడం చాలా పెద్ద మైనస్. సినిమ మొత్తంలో వచ్చే ఒకే ఒక్క ట్విస్ట్ తప్ప మిగతా అంతా చాలా ఊహాజనితంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాక్ బాగానే ఉంటుంది. కానీ సెకండాఫ్ ని రొటీన్ కె రొటీన్ అనిపించే అంతలా మార్చేశాడు. చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. క్రైమ్ కామెడీ అని చెప్పిన ఈ సినిమాలో కామెడీనే లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఇక నేరేషన్ అయితే చాలా స్లోగా ఉంటుంది. డైరెక్టర్ బెస్ట్ గా తీసిన సీన్స్ ఏవి అంటే మనోజ్, నాని, అల్లరి నరేష్, తనీష్ చేసిన సీన్స్ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మిగతా వేటినీ ఆయన సరిగా చేయలేదు. అలాగే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని కిడ్నాప్ చెయ్యడానికి వేసే ప్లాన్స్ చాలా సిల్లీగా ఉంటాయి. అలాగే సెకండాఫ్ లో వచ్చే బేరసారాల సీన్స్ కూడా చాలా చెత్తగా అనిపిస్తాయి. రొటీన్ స్టొరీ లైన్ తీసుకున్నా ఆసక్తికరంగా తీస్తే ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. కానీ కథనం - నేరేషన్ - దర్శకత్వం అనే విభాగాలను పూర్తిగా మట్టకరిపించేయడం వలన సినిమా చాలా బోరింగ్ గా, స్లోగా తయారయ్యింది. అన్నిటికంటే మించి సెకండాఫ్ లో యానిమేషన్ లో చేసిన ఓ చేజింగ్ ఎపిసోడ్ సినిమాకి హెల్ప్ కాకపోగా, బోరింగ్ గా అనిపిస్తుంది. లాజికల్ గా చెప్పాలంటే.. స్విమ్మింగ్ పూల్ లో పడిన కొకైన్ పాకెట్ దానంతట అదే ఎలా ఊడిపోతుంది. సెట్స్ లో అంత ఈజీగా స్టార్ హీరో కార్ వాన్ లోకి ఎలా వెళ్ళగలరు.?, అక్కడి నుంచి అంత సింపుల్ గా ఎలా హీరోని తీసుకువచ్చారు.? ఇలాంటి సిల్లీ పాయింట్స్ చాలానే ఉన్నాయి. పోసాని, శ్రద్ధ దాస్ పాత్రలు సినిమాలో చాలా సొల్లు అనిపిస్తాయి. ఓవరాల్ గా సుశాంత్ రెడ్డి తన మొదటి సినిమాతో హిట్కొట్టేయాలని క్రైమ్ కామెడీ జానర్ మూవీని సెలక్ట్ చేసుకున్నాడు. కానీ తను సెలక్ట్ చేసుకున్నదే సరిగా డీల్ చెయ్యలేక తన చేతులు తానే కాల్చుకున్నాడు.  

 

ఇక మిగిలిన టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే.. ఈశ్వర్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ఒక మేజర్ ప్లస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. విజువల్స్ పరంగా సినిమా బాగానే ఉండడం వలన మనకు లో బడ్జెట్ లో బాగా తీసాడు అనే ఫీలింగ్ వస్తుంది. సాయి కార్తీక్ సాంగ్స్ జస్ట్ ఓకే.. వినేప్పుడు పెద్దగా ఎక్కకపోయినా విజువల్స్ బాగుండడం వల్ల అలా గడిచిపోతాయి. సాయి కార్తీక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. సస్పెన్స్ ఉన్న సీన్స్ లో రీ రికార్డింగ్ బాగా హెల్ప్ అయ్యింది. బసవ పైడిరెడ్డి ఎడిటింగ్ జస్ట్ ఓకే. ఉన్నంతలో బాగానే చెయ్యడానికి ట్రై చేసాడు, కానీ ఇంకా కొన్ని చోట్ల స్పీడ్ గా ఉండేలా ఎడిట్ చేసి, చాలా సీన్స్ లేపేసి ఉంటే బాగుండేది. డైలాగ్స్ కూడా డీసెంట్ అనిపిస్తాయి. తిరుమల రావు ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. చందు నిర్మాణ విలువలు బాగున్నాయి, దానివల్ల చూసింది చిన్న సినిమా అనే ఫీలింగ్ కలగదు.     

రెగ్యులర్ క్రైమ్ కామెడీ జానర్లో సుశాంత్ రెడ్డి ట్రై చేసిన 'సూపర్ స్టార్ కిడ్నాప్' సినిమా 'బోరింగ్ స్టార్ కిడ్నాప్' గా మారింది. టైటిల్ తోనే ఆకట్టుకోవాలని ఆలోచించిన డైరెక్టర్ సినిమాతో ఆకట్టుకోవాలని ఎందుకు ఆలోచించలేదో తనకే తెలియాలి. సక్సెస్ఫుల్ ఫార్మాట్ అని ఫ్రూవ్ చేసుకున్న జానర్లో కూడా సక్సెఫుల్ హిట్ అందుకోలేకపోయాడు డైరెక్టర్ సుశాంత్ రెడ్డి. సూపర్ స్టార్ కిడ్నాప్ సినిమాలో జరిగిన బెస్ట్ మోమెంట్స్ సినిమాకి మహేష్ బాబు ట్యాగ్ లైన్ తో టైటిల్ పెట్టడం, సినిమాలో కొన్ని మహేష్ బాబు షాట్స్ వాడుకోవడం, మనోజ్, అల్లరి నరేష్, నాని, తనీష్ గెస్ట్ అప్పియరెన్స్. దీనికి మించి సినిమాలో మీరు చూసి ఎంజాయ్ సీన్స్ అయితే ఏం లేవు. ఓవరాల్ గా ఈ సినిమా వల్ల మీ జేబుకి చిల్లు తప్ప మీరు ఎంటర్టైన్ అయ్యేది ఏమీ ఉండదు.  

Nandu,Shraddha Das,Adarsh,Punnam Kaur,A.Sushanth Reddy,Chandu Penmatsha,Sai Karthikపంచ్ లైన్ : సూపర్ స్టార్ కిడ్నాప్ - సొల్లుగా అనిపించే కమెడియన్ కిడ్నాప్.

మరింత సమాచారం తెలుసుకోండి: