మహేష్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ అండ్ పెర్ఫార్మన్స్ , శృతి హాసన్ గ్లామర్ , మది సినిమాటోగ్రఫీ , కాలేజ్ బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్ , కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ , ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ ఎపిసోడ్మహేష్ బాబు స్క్రీన్ ప్రెజన్స్ అండ్ పెర్ఫార్మన్స్ , శృతి హాసన్ గ్లామర్ , మది సినిమాటోగ్రఫీ , కాలేజ్ బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్ , కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ , ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్ ఎపిసోడ్సాగదీసిన రన్ టైం , కథనం , ఊహాజనితంగా సాగే సెకండాఫ్ , స్లో నేరేషన్ , ఫస్ట్ సినిమాలోలా మేజిక్ రిపీట్ చేయలేకపోయిన కొరటాల డైరెక్షన్ , ఎంటర్టైన్మెంట్ లేకపోవడం , పాత సినిమాల దేవీశ్రీ మ్యూజిక్
శ్రీమంతుడు - ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టుగానే మన హీరో హర్ష వర్ధన్(మహేష్ బాబు) ఓ రిచ్ కిడ్, కావల్సినంత డబ్బు, ఫేమ్, బిజినెస్ లో నెంబర్ 1 స్టేటస్ ఇలా అన్నీ ఉన్నా తనకివి ఇవి ఏవీ సంతోషాన్ని ఇవ్వవు. తనకి కావాల్సింది ఇంకేదో ఉందని వెతుకుతూ ఉంటాడు. హర్షద్ ఫాదర్ అయిన రవికాంత్(జగపతి బాబు) తన బిజినెస్ చూసుకోమంటే తనకు ఇష్టం లేదని తనకు నచ్చింది చేస్తూ తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ తెచ్చుకోవాలని చెబుతాడు. తనకి ఏం కావాలా అని ఆలోచిస్తున్న సమయంలో మన హీరోయిన్ చారుశీల(శృతి హాసన్)ని చూసి ఇష్టపడుతాడు. కొద్ది రోజుల్లోనే వీరిద్దరి మధ్యా పరిచయం, ఆ పరిచయం ప్రేమగా మారడం చకచకా జరిగిపోతాయి. కానీ చారుశీల మాత్రం హర్ష ప్రేమని రిజెక్ట్ చేస్తుంది. దానికి కారణం రవికాంత్ తన సొంత ఊరు అయిన దేవర కోటని మరచిపోవడం. అప్పటి వరకూ తన ఊరి గురించి తెలియని హర్ష అక్కడికి వెళ్లి దాని గురించి తెలుసుకొని ఆ ఊరిని దత్తత తీసుకొని దాన్ని డెవలప్ చెయ్యాలని చూస్తాడు. కానీ ఊరిని తమ కంట్రోల్ లో ఉంచుకొని, తాము చెప్పినట్టే జరగాలనుకునే వెంకటరత్నం(ముఖేష్ రుషి), శశి(సంపత్), రాధ(హరీష్)లు హర్షద్ కి ప్రతి పనిలోనూ అడ్డుతగులుతూ ఉంటారు. ఈ గొడవల్లో హర్షద్ తనకు బాగా దగ్గరైన వారిని కోల్పోవడమే కాకుండా ఆ ఊరికి తన ఫ్యామిలీకి ఉన్న రిలేషన్ గురించి తెలిసి షాక్ అవుతాడు. అక్కడి నుంచి ఏం చేసి విలన్స్ ని మట్టి కరిపించి ఆ ఊరిని డెవలప్ చేసాడు.? అలానే తన ఫ్యామిలీ గురించి తెలుసుకున్న విషయాలేమిటి.? అనే విషయాలను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.. 

శ్రీమంతుడు సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మహేష్ బాబు వన్ మాన్ షో. మహేష్ ఒక్కడే ఈ సినిమాని పూర్తిగా నడిపించే బాధ్యతను తీసుకోవడమే కాకుండా తన పార్ట్ ని 100కి 200% సమర్ధవంతంగా నిర్వర్తించాడు. మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో ట్రై చేసిన పాత్ర చాలా కొత్తగా ఉండడమే కాకుండా, ఆ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. మొదట్లో సంతృప్తిగాలేని ఓ రిచ్ కిడ్ గా, ఆ తర్వాత హన్డ్సం కాలేజ్ స్టూడెంట్ గా, ఆ తర్వాత ఊరిని డెవలప్ చేసే యువకుడిగా, ఆ తర్వాత ఫ్యామిలీ బాధ్యతని తీసుకొనే కొడుకుగా.. ఇలా ఇన్ని వేరియేషన్స్ ని చాలా పర్ఫెక్ట్ గా చూపించాడు మహేష్. ఇన్ని వేరియేషన్స్ లో తన లుక్ ని కూడా మార్చుకుంటూ వచ్చిన విధానం చాలా బాగుంది. ఇదంతా ఒక ఎత్తైతే మహేష్ బాబు ఈ సినిమాలో ఓ రెండు మూడు పాటల్లో తన డాన్స్ మొమెంట్స్ తో ఫ్యాన్స్ చేత డాన్సులు చేయిస్తాడు. ముఖ్యంగా చారుశీల సాంగ్ లో మైఖేల్ జాక్సన్ స్టెప్స్ ని వేసిన తీరు బాగుంది. శృతి హాసన్ క్యూట్ లుక్స్ మరియు డీసెంట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. పాటల్లో అయితే బాగా గ్లామరస్ గా కనిపించి అందాలతోనూ ఆకట్టుకుంది. జగపతి బాబు - రాజేంద్ర ప్రసాద్ ల పాత్రలు ఈ సినిమాకి చాలా కీలకం, వారి పాత్రల్లో వారు మంచి నటనని కనబరచడమే కాకుండా.. సినిమాలో ఎమోషనల్ డెప్త్ ని తీసుకువచ్చారు. విలన్ గా సంపత్, హరీష్, ముఖేష్ రుషిలు హీరోకి గట్టి పోటీని ఇచ్చారు. ఇక సినిమాలో కొన్ని ముఖ్య పాత్రల్లో నటించిన సుకన్య, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి, అంగన రాయ్ లు తమ పాత్రల పరిధిమేర నటించి వెళ్ళిపోయారు. 

టెక్నికల్ డిపార్ట్ మెంట్ విషయానికి వస్తే మెచ్చుకోదగిన అంశాలు ఉన్నాయి, అలానే చాలా చెత్తగా ఉన్నాయి అని చెప్పుకోదగిన అంశాలు కూడా ఉన్నాయి.. ముందుగా ఈ సినిమాకి కెప్టెన్ ఆఫ్ ది షిప్ గా నిలిచి సినిమా అనే దానికి కీలకమైన కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ - దర్శకత్వం లాంటి విభాగాలను డీల్ చేసిన కొరటాల శివ విషయానికి వద్దాం.. కొరటాల శివ మిర్చి(వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు) స్టైల్ లోనే 'మా ఊరు నాకు చాలా ఇచ్చింది.. ఎంతో కొంత తిరిగిచ్చేయాలి.. లేకపోతే లావైపోతాను' అనే పాయింట్ ని తీసుకొని ఓ సోషల్ మెసేజ్ తో ఈ స్టొరీ లైన్ రాసుకున్నాడు. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ సినిమాని ఓ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల చెప్తే ఫ్లాప్ అవ్వుద్ది.. సో దాన్ని కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పాలని కథని డెవలప్ చేయడం మొదలు పెట్టాడు. ఇక్కడే అసలుసిసలైన తప్పు చేసాడు. అదేమిటంటే.. స్టొరీ లైన్ ని కొత్తగా ఎంచుకున్న కొరటాల శివ పూర్తి కథని మాత్రం చాలా రెగ్యులర్ అండ్ పరమ రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో రాసుకోవడం. కథా విస్తరణ మొత్తం అలానే ఉండడం వలన ఆడియన్స్ కి కథ పెద్దగా ఎక్కదు. అది పక్కన పెడితే, కథనంలో అన్నా కొత్తదనం చూపి ఆడియన్స్ ఊహించలేని ట్విస్ట్ లు ఏమన్నా రాసుకున్నాడా అంటే అదీ లేదు.. ఫ్లాష్ బ్యాక్ తర్వాత ఆడియన్స్ ఊహించిన ట్విస్ట్ లు తప్ప మిగతా ఏమీ సినిమాలో కనిపించవు. ఆ ఫ్లాష్ బ్యాక్ ఏమన్నా ఊహించలేనిదా అంటే అదీ కాదు.. దీనివల్ల సెకండాఫ్ అనేది ఆడియన్స్ బాగా రొటీన్ గా ఫీలవుతారు. వీటన్నిటికి తోడు సినిమాని 2 గంటల 43 నిమిషాలు చెప్పడం చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. కమర్షియల్ అంశాల పరంగా కథ రొటీన్ అయిపోయినా పరవాలేదు, కామన్ ఆడియన్స్ కోరుకునే ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. మొదటి సినిమా మిర్చిలో హీరో పాత్ర చుట్టూనే ఓ తెలియని ఫన్ ని క్రియేట్ చేసుకుంటూ కథని రాసుకొచ్చాడు. కానీ ఈ సినిమాలో ఆ యాంగిల్ ని పూర్తిగా మిస్ చేసాడు. కథ - కథనాలు తేడా కొట్టడం వలన సినిమా ఆడియన్స్ ని కాస్త నిరాశ పరుస్తుంది. ఇక కొరటాల డైలాగ్స్ డీసెంట్ గా ఉన్నాయి. దర్శకత్వం కూడా పరవాలేదనిపించింది. కొరటాల సక్సెస్ అయ్యింది ఒక్క దగ్గరే.. అదెక్కడ అంటే రాసుకున్న కొన్ని యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ని బాగా తీయడంలో.. ఓవరాల్ గా కొరటాల శివ ద్వితీయ విజ్ఞాన్ని సక్సెస్ఫుల్ గా క్రాస్ చేయలేకపోయాడు. 


ఇక సినిమాకి హైలైట్స్ గా నిలిచిన వాటి గురించి చెప్పుకొస్తే మది సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్బ్. ముఖ్యంగా మహేష్ బాబుని చూపించిన విధానం మాత్రం అభిమానులకు, లేడీ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుంది. ఇక తనకి ఇచ్చిన ప్రతి లొకేషన్ ని అద్భుతః అనే రేంజ్ లో చూపించాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన పాటలు పెద్దగా లేకపోయినా పిక్చరైజేషన్ పరంగా మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. ఇక దేవీశ్రీ అందించిన నేపధ్య సంగీతం అస్సలు బాలేదు. చెప్పాలంటే మీకు లెజెండ్ సినిమాలో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ మ్యుజిక్కే ఇక్కడా వినిపిస్తూ ఉంటుంది. ఆర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమా ఎడిటింగ్ పై చాలా వర్కౌట్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన సరిగా ఎడిట్ చేయకుండా వదిలేసిన సీన్స్ సినిమాలో బోరింగ్ గా అనిపిస్తాయి. అనల్ అరసు యాక్షన్ ఎపిసోడ్స్ డీసెంట్ గా ఉన్నాయి. అక్షయ్ త్యాగి కాస్ట్యూమ్స్ అదుర్స్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. 


రెండు వరుస ఫ్లాప్ సినిమాల తర్వాత మహేష్ బాబు అభిమానులు హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలను అందుకొని కేక, బ్లాక్ బస్టర్ అని చెప్పుకునే సినిమా కాకపోయినా వారు ఎదురు చూస్తున్న హిట్ దాహాన్ని మాత్రం తీర్చే సినిమా 'శ్రీమంతుడు'. కొరటాల శివ మహేష్ బాబు సినిమా అనగానే ఓ సోషల్ మెసేజ్ ఉన్న స్ట్రాంగ్ స్టొరీ లైన్ ని ఎంచుకున్నాడు కానీ దానిని కమర్షియల్ గా చెప్పాలనుకున్నాడు. అందులో తప్పులేదు.. కానీ మరీ అన్ని సినిమాల రెగ్యులర్ ఫార్మాట్ లో చెప్పకుండా, సరికొత్తగా కమర్షియల్ గా చెప్పడానికి ట్రై చెయ్యాల్సింది. అలా చెయ్యకపోవడమే ఈ సినిమాకి మైనస్. అదీ కాక సినిమాలో పాత్రలని పరిచయం చేసి వాటిని ఎలివేట్ చెయ్యడానికే మొదటి అర్ధభాగం అంతా సరిపోవడం ఆడియన్స్ ని బోర్ కొడుతుంది. అలాగే సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తరవాత ఆడియన్స్ కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు. దానికి తోడూ క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా సిల్లీగా ఉంటుంది. ఫైనల్ గా మహేష్ బాబుకి కావాల్సిన హిట్ ని ఈ సినిమా అందించినా కొరటాల శివ నుంచి వచ్చిన ది బెస్ట్ ప్రోడక్ట్ అయితే 'శ్రీమంతుడు' కాదు.

Mahesh Babu,Shruti Haasan,Koratala Siva,Y. Naveen,Y. Ravi Shankar,C. V. Mohan,Devi Sri Prasad.శ్రీమంతుడు - మహేష్ బాబు ఫ్యాన్స్ కి మాత్రం పండగ.!

మరింత సమాచారం తెలుసుకోండి: