ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు విడుదలకు ముందు ఎన్నో వివాదాల్లో చిక్కుకొని బయటకు వస్తున్నాయి. గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాలు వివాదాల్లో పడి అవి కోర్టు దాకా పోయిన బాపతులు ఉన్నాయి. కమల్ హాసన్ సినిమా విశ్వరూపం, ఉత్తమ విలన్ ఎన్నో వివాదాలు దాటుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లింగ సినిమా కూడా ఎన్నో వివాదాలు దాటుకొని తెరపై కనిపించింది.

రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మంగా రూపొందించిన చిత్రం ‘బాహుబలి’ కూడా ఒక వర్గాన్ని కించపరిచారంటూ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరికల మద్య విడుదల అయ్యింది. మదురైలో అయితే ఏకంగా పెట్రల్ బాంబే వేశారు ఒక వర్గం వారు. ఇలా ఎన్నో చిక్కుముళ్లు తెంచుకుంటు ప్రేక్షకుల ముందు వచ్చే సినిమాలు కామన్ అయిపోయాయి. తాజాగా దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మంగా తీర్చి దిద్దిన సినిమా ‘రుద్రమదేవి’ ఇదే కోవలోకి రాబోతుందని వార్త కథనాలు వినిపిస్తున్నాయి. విషయానికి వస్తే కాకతీయుల వంశంలో వీరనారీమణిగా పేరు తెచ్చుకున్న రాణి రుద్రమదేవి గాధన ఇతివృత్తంగా చేసుకొని రూపొందించిన చిత్రం రుద్రమదేవి.

రుద్రమదేవి పోస్టర్


ఇంత వరకు బాగానే ఉంది మరి సినిమా అన్నతర్వాత చ‌రిత్ర‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్ అంశాల్ని కూడా బాగానే చొప్పించాడు గుణ‌శేఖ‌ర్. మరి ఇక్కడే కాలింది కొందమందికి...? సినిమాలో అనుష్క‌, రానాపై ఓ రొమాంటిక్ సాంగ్ చిత్రీక‌రించాడు రుద్ర‌మ‌దేవి కొండ‌లు, జ‌ల‌పాతాల ప‌క్క‌న నిల‌బ‌డి అర్ధ‌న‌గ్నంగా పాటలుపాడుతుందా.. ఇలా చేస్తే చ‌రిత్ర‌కారులు ఊరుకుంటారా అని ఇప్పుడు కొత్త అనుమానాలు రేగుతున్నాయి. రుద్రమదేవి అంటే వీరనారీమణిగానే అందరికీ తెలుసు మరి ఈ రొమాంటిక్ దృశ్యాలు ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది. మరి విడుదల అయిన తర్వాత ఎవరి మనోభావాలు దెబ్బతినేలా ఉండకుంటే అంతా ఓకే.. మరి అలా కాకుంటే మటుకు మరో వివాదానికి తెరలేపినట్లే అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: