తెలుగు ఇండస్ట్రీలో సంచలనాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ ఈ మద్య ట్విట్టర్ తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.  నిన్న ఆదివారం నుండి పోర్న్ సైట్ లు చూసే ప్రేక్షకులకు నిరాశ మిగిలింది. అన్ని రకాల ప్రొవైడర్స్ లలో టెలికాం ఆర్డర్ ప్రకారం పోర్న్ సైట్ లు ఓపెన్ అవ్వలేదు. దాంతో శృంగార ప్రియులు తీవ్ర నిరాశకు గురయ్యరట. పాపులర్ పోర్న్ సైట్లను ఓపెన్ చేస్తే ఇక నుంచి బ్లాంక్ పేజి వస్తుంది. పోర్న్ సైట్స్ ఓపెన్ కావట్లేవనే విషయాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు పోర్న్ మూవీస్ లవర్స్. అంతే కాదు, ఐఎస్పీల పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

పోర్న్ సైట్లు యువతని నాశనం చేస్తున్నాయని ,వాళ్ళు పక్కదారి పట్టేలా చేస్తున్నాయని కాబట్టి వాటిపై నిషేధం విధించాలని రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలు వీటిపై చర్యలు తీసుకుంటున్నాయి. దీనిపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందిస్తూ..అసలు పోర్న్ వెబ్ సైట్లు ఉండటం వల్లే తమ కోరికలను అదుపులో ఉంచుకోగలుగు తున్నారని శాస్త్రీయంగా కూడా ఇది నిజమేనని పాశ్చాత్య దేశాలు రుజువు చేసాయని ఆయన అంటున్నారు.  పోర్న్ సైట్లపై కేంద్రం అధికారిక నిషేధించడాన్ని విమర్శించారు ఇలా చేస్తే యువత నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని ఇది తిరోగామి చర్య అంటూ వరుస ట్వీట్లు చేశారు.

ఒక వేళ ఈ చిత్రాలు చూసే యువత చెడిపోతుంది అనుకుంటే పొరపాటని లైంగిక నేరాలను నిరోధించడానికి అశ్లీల సైట్లను నిషేధించడం పరిష్కారం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకదానికి అలవాటు పడ్డా వారికి అది అందుబాటు లో లేకుండా చేస్తే దాని గురించి ఎంతకైనా తెగించే సైకాలజీ మనిషికి ఉంటుందని వివరించారు.దేన్నైనా నిషేధిస్తే అది తెరవెనుక బలం పుంజుకుంటుంది. ఇది చరిత్రలో చాలాసార్లు నిరూపితమైంది.  


ఫోర్స్ సైట్స్

fdf143c4-9ef4-4b3d-bd5a-c2f07a53d10dwallpaper1
అశ్లీల చిత్రాలు లైంగిక నేరాలను పెంచవని, పైగా లైంగిక నిగ్రహానికి అది ఒక సురక్షిత మార్గమని పలు అంతర్జాతీయ సర్వేల్లో నిరూపితమైన సత్యం’’ అని ట్వీట్ చేశారు. మరో వైపు పోర్న్ సైట్స్ ఓపెన్ కావట్లేవనే విషయాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు పోర్న్ మూవీస్ లవర్స్. అంతే కాదు, ఐఎస్పీల పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలాగైతే.. కొన్ని రోజుల్లోనే స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గిపోవచ్చు అని అభిప్రాయ పడుతున్నారు. 

రాంగోపాల్ వర్మ ట్విట్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: