యూత్ ఫుల్ డైరక్టర్లలో మారుతి అంటే స్పెషల్ క్రేజ్, సినిమాను ఎలాగైనా సరే ప్రేక్షకులకు ముఖ్యంగా యూత్ కి బాగా ఎక్కేలా చేస్తాడు. అయితే అది కామెడీతోనా, ఇక హీరోయిన్ అందచందాలతోనా అనేది స్క్రిప్ట్ ని బట్టి ఉంటుంది. మనోడు వచ్చిన కొత్తలో కొద్దిగా విమర్శలు ఎదుర్కున్నా తర్వాత మాత్రం పంథాని మార్చుకుని మంచి ట్రాక్ లోకి వచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘భలే భలే మగాడివోయ్’. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సెకండ్ బ్యానర్, యు.వి.ఆర్ట్స్ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్నారు. అయితే తెలుస్తున్న కథనాల ప్రకారం ఈ సినిమా షూటింగ్ టైమ్లోనే అల్లు అర్జున్ కి ఒక కథని వినిపించాడట మారుతి.

 కథ నచ్చిన బన్నీ ముందు ‘భలే భలే మగాడివోయ్’ సినిమా హిట్ అవ్వనివ్వు అప్పుడు చూద్దాం అన్నాడట. సో అందుకే మారుతి ‘భలే భలే మగాడివోయ్’ సినిమాకు తన టాలెంట్ అంతా బయటపెట్టి మరి తీస్తున్నాడట. నాని, లావణ్య త్రిపాటి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా కూడా ఫుల్ లెంథ్ కామెడీ జానర్లో నడుస్తుందట. రీసెంట్ గా రేడియో మిర్చీలో ఈ సినిమాకు సంబందించిన ఓ సాంగ్ని కూడా రిలీజ్ చేశారు. మారుతి ప్లాన్ ప్రకారం ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేసుకుని అల్లు అర్జున్ సినిమా డైరెక్ట్ చేయాలని పట్టు మీదున్నాడు.

భలే భలే మగాడివోయ్ లో నాని.లావణ్య:


ఇక స్టైలిష్ స్టార్ సినిమా అంటే భారీ రేంజ్లో ఉండాలి. యూత్ ఐకాన్ అయిన బన్నీ లాంటి స్టార్ తో మారుతి సినిమా తీస్తే ఇక డైరక్టర్ గా మారుతికి కూడా తిరుగుండదు. అందుకే ప్రస్తుతం చేస్తున్న ‘భలే భలే మగాడివోయ్’ సినిమాపై తన దృష్టినంతా పెట్టాడు దర్శకుడు మారుతి. రీసెంట్ గా నాని కూడా ఈ సినిమా గురించి చెబుతూ తన పిల్ల జమిందార్, అలా మొదలైంది సినిమాల కన్నా ఈ సినిమాలో ఇంకా కామెడీ బాగా ఉంటుందని ఆడియెన్స్ కి ఒక సిగ్నల్ ఇచ్చాడు. రీలీజ్ అయిన పోస్టర్స్ లో కూడా సినిమా ఫ్రెష్ లుక్ తో కనిపిస్తుంది.

 మరి ఈ సినిమా హిట్ తో ఒకేసారి బన్నీ ఆఫర్ నే కొట్టేయాలనే దర్శకుడి మారుతి ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో లేదో తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇటు నానికి కూడా భలే భలే మగాడివోయ్ సినిమా రిజల్ట్ మీదే తన భవితవ్యం ఆధారపడి ఉంది. ఇక లావణ్య త్రిపాటి కూడా ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకుంది మరి ఇంత మంది ఆశలు పెట్టుకున్న ‘భలే భలే మగాడివోయ్’  సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: