తెలుగు,తమిళ,హిందీ  ఇండస్ట్రీల్లో తన అద్భుతమైన నటనతో విశ్వవిఖ్యాత నటుడిగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ వారసురాలిగా  శృతిహాసన్ వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ మద్య వచ్చిన సినిమాలు  శృతిహాసన్ కి పెద్ద పేరు తీసుకు రాలేదు పైగా ఐరెన్ లెగ్ అని ముద్ర కూడా పడింది. సంగీతం,డ్యాన్స్,సింగింగ్ లో మంచి ప్రావిణ్యం ఉన్నా శ్రుతికి మాత్రం ఏదీ కలిసి రాలేదు. ఇక తండ్రి ఇమేజ్ కూడా ఈ అమ్మడికి అప్పట్లో వర్క అవుట్ కాలేదు.

ఇక ఇండస్ట్రీలోకి వచ్చి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి మంచి హిట్ సినిమా రాలేదు.. అదే సమయంలో వచ్చి ‘గబ్బర్ సింగ్’ ఈ ఇద్దరి ఆశలు నెరవేర్చింది. ఈ సినిమాతో అటు ప‌వ‌న్ 12 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది.. ఇటు  శృతి  కెరీర్ కూడా శృతిలోపడింది. ఇక తెలుగులో శృతిహాసన్ పై దర్శక, నిర్మాతలు కళ్లు పడ్డాయి. దీంతో ఈ అమ్మడిని అప్పటి వరకు ఐరెన్ లెగ్ అన్నవారు గోల్డెన్ లెగ్ అనడం మొదలు పెట్టారు.

శృతిహాసన్


తెలుగులో  ర‌వితేజ‌కు బ‌లుపు.. రామ్ చ‌ర‌ణ్ కు ఎవ‌డు.. బ‌న్నీకి రేసుగుర్రం.. తాజాగా మ‌హేశ్ కు శ్రీ‌మంతుడు.. ఇలా వ‌ర‌స‌గా హిట్లు ఇచ్చేస్తూ వ‌స్తుంది శృతిహాస‌న్. విచిత్రమేమిటంటే ఈ హీరోలతో మరో హీరో కూడా ఉన్నాడు అందులోనూ మంచి ఫామ్ లో ఉన్న హీరో మన ఎన్టీఆర్. ఇప్పటి వరకు శృతి గోల్డెన్ లెగ్ మటుకు ఎన్టీఆర్ కి వర్క్ అవుట్ కాలేదు. ఈయ‌న‌తో ద‌మ్ము సినిమాలో న‌టించాల‌నుకున్నా అది కుద‌ర్లేదు. త‌ర్వాత రామ‌య్యా వ‌స్తావ‌య్యాలో న‌టించినా అది డిజాస్ట‌ర్ అయి కూర్చుంది. మరి ఎన్టీఆర్, శృతిల కాంబినేషన్ ఎప్పుడు హిట్ వస్తుందో..ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో వేచి చూడాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: