డీసెంట్ సినిమాటోగ్రఫీ , సినిమా కోసం ఎంచుకున్న అనే లొకేషన్స్ , కళ్యాణి కోడూరి మ్యూజిక్ డీసెంట్ సినిమాటోగ్రఫీ , సినిమా కోసం ఎంచుకున్న అనే లొకేషన్స్ , కళ్యాణి కోడూరి మ్యూజిక్ పరమ రొటీన్ తేజ ప్రేమకథ , ఊహాజనితమైన కథనం , సాగదీసిన స్లో స్లో నేరేషన్ , సెకండాఫ్ ని అంతకు మించి అనేలా సాగదీయడం , రన్ టైం , ఎడిటింగ్ , హీరో పెర్ఫార్మన్స్ , సినిమాలో ఎలాంటి ఎమోషన్ ని క్యారీ చేయకపోవడం , జయం క్లైమాక్స్

ప్రేమకథని ఒక్కో సారి ఒక్కో ఫార్మాట్ లో చెప్పడానికి ప్రయత్నించే తేజ చేసిన మరి ప్రేమకథ చిత్రమే ఈ 'హోరా హోరీ'. ఇక సినిమా కథలోకి వెళితే.. షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పాలి అంటే ఈ సినిమా ఎక్కువ భాగం జయం నువ్వు-నేను సినిమా ఫార్మాట్ లోనే ఉంటుంది. సినిమాలో మెయిన్ విలన్ అయిన బసవేశ్వర్(చస్వ) మన సినిమా హీరోయిన్ అయిన మైథిలి(దక్ష)ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకుంటా అంటే నో అంటారు. దాంతో పెళ్లి కొడుకుల్ని చంపేస్తూ ఉంటాడు. దాంతో మతి చలించి షాక్ లోకి వెళ్ళిన మైథిలిని తీసుకొని తన ఫ్యామిలీ బసవేశ్వర్ కి దొరక్కుండా కర్ణాటకలోని సిమోఘ జిల్లాలోని ఆగుంబె పల్లెటూరికి వెళ్ళిపోతారు. దాంతో బసవేశ్వర్ మైథిలి ఎటు పోయిందా అని ఎతుకుతూ ఉంటాడు. అక్కడి నుంచి కట్ చేస్తే ఆగుంబెలో మైథిలి మన హీరో స్కంద(దిలీప్) మాటలకి రెస్పాండ్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యా పరిచయం, అది కాస్త ప్రేమగా మారడం చకచకా జరిగిపోతాయి. కట్ చేస్తే అదే ఊరికి ఓ పని మీద బసవేశ్వర్ వస్తాడు. దాంతో అక్కడి నుంచి కథ పలుములు తిరుగుతుంది. ఈ మలుపుల్లో ఒక ట్విస్ట్ ఏంటి అంటే బసవేశ్వర్ - స్కందలు ఫ్రెండ్స్ గా మారడం. ఇలాంటి సందర్భంలో ఎవరి ప్రేమ ఎవరి ప్రాణాలు తీసింది. ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో చివరిగా ఎవరి ప్రేమ గెలిచింది అన్నది చూడాలంటే మీరు సినిమా చూడాలి.  

 దాదాపు ప్రతి సినిమాలోనూ నూతన నటీనటుల్ని పరిచయం చేసే తేజ ఈ సినిమా కోసం కూడా అందరినీ కొత్త వారినే ఎంచుకున్నాడు. అందులో ముందుగా హీరో దిలీప్ విషయానికి వస్తే.. పల్లెటూరి కుర్రాడిగా, కాస్త అమాయకం చూడటానికి లుక్ పరంగా బాగానే సెట్ అయ్యాడు. కానీ పెర్ఫార్మన్స్ విషయంలోనే చాలా పూర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఇతని విషయంలో తేజదే తప్పని చెప్పాలి. ఎందుకంటే ప్రతి సినిమాలోనూ హీరోకి ఓ పాత్ర ఉంటుంది కానీ ఇందులో మాత్రం హీరోకంటూ ఓ పాత్ర లేదు, ఓ క్వాలిటీ, ఓ క్యారెక్టరైజేషణ్ లేదు. అందుకే తన కన్నా పక్కన ఉన్న పాత్రలు హైలైట్ అయ్యాయి. సో దిలీప్ కి ఈ సినిమా వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం. ముఖ్యంగా తెలుగువాడై ఉండి సొంతంగా డబ్బింగ్ చెప్పుకోకపోవడం తనకి  పెద్దగా సెట్ అవ్వలేదు. ఇక నటీనటుల్లో హైలైట్ అనిపించుకుంది మాత్రం హీరోయిన్ దక్ష అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. దక్ష ఇచ్చిన పాత్రలో చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మొదటి నుంచి క్యూట్ క్యూట్ గా కనిపించిన దక్ష ఎమోషనల్ సీన్స్ లో అందరినీ అమితంగా ఆకట్టుకుంది. చాలా చోట్ల తన లుక్స్ తో యువతని బాగా ఆకట్టుకుంది. ఇకపోతే తనకు తెలుగు పూర్తిగా రాకపోయినా తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోవడం సినిమాకి ఇంకా హెల్ప్ అయ్యింది. ఈ సినిమా నటీనటుల్లో ఎవరికన్నా హెల్ప్ అయ్యిందా అంటే అది దక్షకి మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక సెకండ్ హీరోయిన్ గా చేసిన అశ్విని జస్ట్ ఫర్ అందాల ఆరబోత. ఆ పనిని ఆ అమ్మాయి పర్ఫెక్ట్ గా చేసి కాసేపు మాస్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసి వెళ్ళిపోయింది. విలన్ గా చేసిన చస్వ పెర్ఫార్మన్స్ తో బాగానే మెప్పించాడు. అంతే కాకుండా తన ఒరిజినల్ వాయిస్ బాగా సెట్ అయ్యింది. కానీ విలన్ కి కూడా ఓ క్యారెక్టరైజేషణ్ లేదు. అందుకే హీరో - విలన్ పాత్రలు డమ్మీగా మిగిలిపోయాయి. హీరో నానమ్మ పాత్రలో సీమ, హీరోయిన్ అన్న పాత్రలో అభిరామ్ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. జబర్దస్త్ గ్యాంగ్ అయిన రాకింగ్ రాకేష్, రాఘవ, రచ్చ రవిలు అక్కడక్కడా నవ్వించారు. ఓవరాల్ గా హోరా హోరీ నటీనటుల్లో ది బెస్ట్ పెర్ఫార్మన్స్ విన్నర్ దక్ష అని చెప్పవచ్చు.



సాంకేతిక నిపుణుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది.. డైరెక్టర్ తేజ గురించి.. ఆయన కథ వల్లే ఈ సినిమా మొదలైంది.. ఈ రోజు రిలీజ్ అయ్యింది.. కావున కెప్టెన్ అఫ్ ది 'హోరా హోరీ' తేజ గురించి చెప్పాలంటే.. తేజ ఈ సినిమా ద్వారా కొత్తగా చెప్పింది ఏమీ లేదు ఎందుకు ఇప్పటి వరకూ ఆయన చెప్పిన పల్లెటూరి ప్రేమకథని మరో కోణంలో, మరో బ్యాక్ డ్రాప్ లో చెప్పడానికి ట్రై చేసాడు. అందుకోసం ఎంచుకున్న నేపధ్యం, లొకేషన్స్ అన్నీ బాగున్నాయి. కానీ అవి బాగుంటే సినిమా నడవదు కదా.. కథ కథలోని కంటెంట్ బాగుండాలి.. ఈ మాటలు తేజ చెప్పినవే.. ఆయన చెప్పిన మాటలని ఆయనే ఎందుకు ఫాలో అవ్వలేదు అనే విషయం మీద క్లారిటీ ఆయనకే ఉండాలి. కథ పాతది కావడం వల్ల ఆడియన్స్ లో ఓ సూపర్బ్ కాదు కాదు ఓ కొత్త సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే రాదు. సినిమా స్టార్టింగ్ అయిన మొదటి 10 నిమిషాల్లోనే కథ ముగింపు ఏంటి ఎలా ఉంటుందో తెలిసిపోతే ఇక చూసే ఆడియన్స్ లో కిక్ ఏముంటుంది చెప్పండి. ఇక మరీ చెప్పాలంటే క్లైమాక్స్ అయితే జయం సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. సరే కథ విషయంలో ఆడియన్స్ ని పూర్తిగా నిరాశ పరిచినా కథనం, ఆ కథనంలోని సీన్స్ అన్నా ఆసక్తికరంగా ఉండాలి కదా. అది కూడా లేదు.. ఆడియన్స్ కి తెలిసిందే, తెలిసిందే మళ్ళీ మళ్ళీ చెప్తూ సినిమాని ముందుకు నడిపించడం పరమ బోరింగ్. ఇక నేరేషన్ పరంగా చూసుకుంటే రెండున్నర గంటల సినిమాని 5 గంటలు చూసాం అనేలా నేరేట్ చేసారు. అంటే సినిమా ఎంత స్లోగా సాగుతుందో మీరే అర్థం చేస్కొండి. సెకండాఫ్ లో ఏదో చెయ్యాలని రకరకాల మలుపు తిప్పేయాలని ప్లాన్ చేసుకొని చివరికి కామన్ ట్రై యాంగిల్ లవ్ స్టొరీగా మార్చేసారు. సెకండాఫ్ లో ట్విస్ట్ లు ఒక్కటి కూడా వర్క్ అవుట్ కాకపోవడంతో క్లైమాక్స్ కి వచ్చేసరికి మాకు తెలియంది ఏమన్నా చూపిస్తావా అనే స్టేజ్ లో ఆడియన్స్ సినిమాని ఫినిష్ చేస్తారు. హీరోకి ఆపోజిట్ గా ఉండే సమస్య/విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో అప్పుడే హీరోకి సూపర్ బిల్డప్ వస్తుందని నమ్మిన తేజ, ఈ సినిమాలో హీరోయిజం ని బిల్డప్ చేసే సమస్యని గొప్పగా రాసుకోలేదు, అంతెందుకు హీరో పాత్రని, విలన్ పాత్రలనే స్ట్రాంగ్ గా రాసుకోకపోవడం ఈ సినిమాకి మైనస్. ఇప్పటి వరకూ వచ్చిన తేజ సినిమాల్లో కథ, కథనాలు ఎలా ఉన్నా హీరో, విలన్ లకి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, కానీ ఇందులో అవే లేవు. ఓవరాల్ గా కథ పాయింట్ కి వస్తే విలేజ్ బ్యాక్ డ్రాప్, లవ్ స్టొరీ, విలన్ ఎంట్రీ, కట్ చేస్తే హీరో హీరోయిన్ కి వాడివల్ల సమస్య, హీరో - హీరోయిన్ స్ట్రగ్లింగ్ ఫైనల్ గా ప్రేమదే విజయం. దీనివల్ల ఓవరాల్ సినిమా అయ్యే టైంకి ఆడియన్స్ మదిలో వచ్చే ఆలోచన ఇదే కాబట్టి తేజ తీసిన ఏయే సినిమాలతో ఈ సినిమాని పోలుస్తారో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక డైరెక్టర్ గా కూడా తేజ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. హీరో నుంచే కాదు చాలా పాత్రల నుంచి సరైన పెర్ఫార్మన్స్ రాబట్టుకోలేకపోయాడు. అలాగే ప్రతి సినిమాలో ఒక ఎమోషన్ ని స్ట్రాంగ్ గా చెప్పాలనుకునే తేజ ఈ సినిమాలో ఏ ఎమోషన్ ని ఆడియన్స్ కి ఇవ్వలేదు. అందుకే ఆడియన్స్ చిరాకు అనే ఎమోషన్ ని బాగా ఫీలవుతారు. 


ఇక మిగిలిన టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ విషయానికి వస్తే.. దీపక్ భగవంత్ సినిమాటోగ్రఫీ విజువల్స్ పరంగా సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికీ ఓ కొత్త ఫీలింగ్ ని కలిగించింది. ఎప్పుడు ఎక్కువగా వర్షం పడే ఆగుంబె ప్రాంతాన్ని తెరపై చాలా బాగా చూపించాడు. అలాగే 4థ్ వాల్ అనే టెక్నిక్ ని వినియోగించి చేసిన చాలా సీన్స్ చూడటానికి బాగున్నాయి. కళ్యాణి కోడూరి మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాకి పాటలు హెల్ప్ అయ్యాయి, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా హెల్ప్ అయ్యింది. ఎడిటర్ జునైద్ సినిమాని చాలా ట్రిమ్ చేసి ఉంటే బాహుండేది. పాంథర్ స్టంట్స్ జస్ట్ ఓకే ఓకే అనేలా ఉన్నాయి. కెఎల్ దామోదర ప్రసాద్ నిర్మాణ విలువలు బాగున్నాయి.   


తేజ ఆడియో ఫంక్షన్ నుంచి టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు కథలే వస్తున్నాయి, కొత్తవి తీయడం లేదు, తీయడం లేదు అని ఓ మైకులు అరిగిపోయేలా మాట్లాడారు. ఇది విని అందరూ ఆయనేదో ఓ కొత్త లవ్ స్టొరీ కి నాంది పలికారేమో అనుకోని థియేటర్స్ కి వెళ్ళే వారికి కలిగే ఫీలింగ్ ఒకటే.. జేబులో డబ్బులు ఖర్చు పెట్టి ఈ 'హోరా హోరీ' సినిమాకి వచ్చి థియేటర్స్ లో యుద్ధం చేయడం కంటే ఇంట్లో అరిగిపోయి ఉన్న జయం సిడిని వేసుకొని మళ్ళీ ఇంకోసారి ఆ సినిమాని చూడచ్చు. తేజ నుంచి చాలా ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. కానీ ఇది అన్నిటిలో కంటే డిజాస్టర్ అని చెప్పాలి. అలా ఎందుకు అన్నాను అంటే.. ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కథలోనో, కంటెంట్ లోనో, లేదా డైరెక్టర్ గానో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేవాడు. కానీ ఈ సినిమా విషయంలో ఆయన అన్ని విషయాల్లోనూ తన కెరీర్లోనే పూర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. సినిమాకి కెప్టెన్ అయిన తెజనే ఈ రేంజ్ లో ఫెయిల్ అయ్యాక మిగతా డిపార్ట్ మెంట్స్ ఏం చేసినా, ఎంత బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చినా వృధానే.. ఓవరాల్ గా తేజ తను తీసిన ఫ్లాప్స్ కంటే మించిన డిజాస్టర్ తీస్తే ఎలా ఉంటుందో అని చూపించడానికి ఈ సినిమా తీసినట్టుంది. ఓవరాల్ గా తేజ మార్క్ అనేది 99% కనిపించని సినిమానే 'హోరా హోరీ'.. ఈ సినిమాకి 'ఫైట్ ఫర్ లవ్' అనే ట్యాగ్ లైన్ సినిమాకి సెట్ అవ్వదు కానీ థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కి మాత్రం ఇది 'ఫైట్ ఫర్ సర్వైవల్'. ఈ సినిమాకి వెల్లడం మీకు టైం వేస్ట్, మనీ వేస్ట్.. 

Dileep,Daksha,Teja,KL Damodara Prasad,Kalyani Malikసక్సెస్ కోసం ట్రై చేసిన తేజ మరో డిజాస్టర్.!

మరింత సమాచారం తెలుసుకోండి: