‘భజరంగి బాయిజాన్’ లాంటి ఉదాత్తమైన కథను ‘బాహుబలి’ లాంటి మాయాజాలాన్ని సృస్టించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక సెక్స్ కామెడీ కథను వ్రాసాడు అంటే ఎవరూ నమ్మరు. కాని ఇది వాస్తవం ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ నవ్వుతూ ఒప్పుకోవడం మరింత ఆశ్చర్యకరం. ప్రస్తుత యూత్ ఆలోచనలు సెక్స్ విషయం ఫై ఎలా ఉంటున్నాయి అన్న విషయాన్ని కథా వస్తువుగా తీసుకుని దానికి సెటైర్ తో కూడిన హాస్యాన్ని రంగరిస్తూ విజయేంద్ర ప్రసాద్ చేయబోతున్న ప్రయోగం ఇది.

ఒక కాలేజి అమ్మాయి ప్రస్తుత పరిస్థుతుల నేపధ్యంలో తన కన్యత్వాన్ని పోగొట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు నేటి యువతరం సెక్స్ ఆలోచనలు ఈ రెండు అంశాలను కలబోసి విజయేంద్ర ప్రసాద్ ఈ స్క్రిప్ట్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది. మారిన సమాజంలో పడిపోయిన నైతిక విలువల నేపధ్యంలో సెక్స్ విషయాలు నేటి యువతరాన్ని ఎంత ప్రభావితం చేస్తున్నాయి అన్న విషయాన్ని ఈసినిమాలో హాస్యాన్ని రంగరించి విజయేంద్ర ప్రసాద్ చెప్పబోతున్నాడు. 

కాలేజీ క్యాంపస్ చుట్టూ తిరిగే ఈ కామెడీ కథను సినిమాగా తీయడానికి ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఇప్పటికే ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈసినిమాను హిందీ భాషలో తీస్తున్నారు. అయితే హిందీతో పాటు తెలుగులో కూడ ఈసినిమాను తీయాలా వద్దా అన్న విషయం పై చర్చలు జరుగుతున్నట్లు టాక్. 

ఈ సినిమాలో నటించే నటీనటులు కొత్త వారే అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక కోసం ఆడిషన్స్ జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 74 సంవత్సరాల విజయేంద్ర ప్రసాద్ నేటి యూత్ ను టార్గెట్ చేస్తూ ఒక సెక్స్ కామెడీ వ్రాయడం మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: