చిన్నప్పటి నుంచీ చిరంజీవిని చూస్తూ పెరిగిన వారు ఉన్నారు, చిరంజీవి వయసుతో పాటు పెరిగి పెద్దయిన వారూ  ఉన్నారు, చిరంజీవి పుట్టిన నాలుగైదు  దశాబ్దాలకి పుట్టినా ఆయన గొప్పతనం గురించి ఇంకా వింటూ ఉన్న వారు కూడా ఉన్నారు. ఆయన స్థాయి స్థానం తెలుగు సినిమా లో చిరస్మరణీయం .. ఆయన వదిలిన కొన్ని ఆయనకే సాధ్యం అయిన 'మార్క్' సాధ్యమైన పనులను మనం ఇవాళ చూడబోతున్నాం.


14  విషయాలు కేవలం చిరంజీవి కి మాత్రమే సాధ్యపడినవి,ఈ జనరేషన్ హీరోలు తమ కలలో కూడా ప్రయత్నించడానికి వెనకాడేవి::


1. ఈ జనరేషన్ లో స్టార్ లు ఉన్నారు సూపర్ స్టార్ లు ఉన్నారు పవర్ స్టార్ లు ఉన్నారు కానీ ఒక్కరైనా తమ ముందు జనరేషన్ హీరోలుగా ఉండి తెలుగు సినిమా కి మూల స్తంభాలై ఈ సినిమా కీర్తి ని కాపాడుతున్న ' చిరంజీవి' లేదా 'బాలకృష్ణ' లతో ఒక్క సినిమా చెయ్యగలరా? అప్పట్లోనే తన కెరీర్ పీక్ స్టేజీ లో ఉన్న సమయం లో ఎన్టీఆర్ తో తిరుగులేని మనిషి లో నటించిన చిరంజీవి తరవాత 'ఏఎన్నార్ ' తో మెకానిక్ అల్లుడు లో కామెడీ పండించి కడుపుబ్బా మనల్ని నవ్వించారు. సూపర్ స్టార్ కృష్ణ తో ఎనభైల్లోనే తోడు దొంగలు సినిమాతో నటించి అందరి మెప్పూ పొందారు

2. తెలుగు - తమిళ ఇండస్ట్రీలలో ఉన్న అందరు దర్శకులలో అగ్రగణ్యులతో నటించిన ఘనత చిరంజీవి కి మాత్రమే దక్కుతుంది. బాల చందర్, భారతీ రాజా ,కే విశ్వనాథ్, వంశీ , జంధ్యాల వీరితో చిరంజీవి వండర్ లు సృష్టించారు. ఈ జనరేషన్ లో రెండు ఇండస్ట్రీ ల టాప్ దర్సకులనూ కవర్ చెయ్యగల హీరో ఒక్కరూ లేరు

3.ప్రపంచానికే డాన్స్ నేర్పించిన మైకల్ జాక్సన్ ని తన దొంగ సినిమా లో ఇమిటేట్ చేసి ఎక్కడా నవ్వుల పాలు అవకపోగా అత్యద్బుత పెర్ఫార్మెన్స్ తో 'ఇండియన్  వెర్షన్ ఆఫ్ కిల్లర్' గా ఆ సినిమాలోని గోలీ మార్ పాట ని దేశం మొత్తం వ్యాపింప చేసారు . మైకల్ జాక్సన్ కీ చక్కటి ఈక్వేషన్ ఇచ్చి ఇండియన్ మైకేల్ గా మార్కులు కొట్టేసారు. అచ్చం మైకేల్ లాగానే రెడ్ కలర్ ప్యాంటూ షర్టూ వేసి జోంబీ లుక్ లో అదరకొట్టిన చిరంజీవి కిల్లర్ కి ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో తన స్టైల్ చూపించి జనాల్ని మంత్రం ముగ్ధుల్ని చేసాడు . మైకేల్ ని ఒక పాట లో పూర్తిగా అనుకరించి అచ్చం అతనిలగానే అంత అద్భుతంగా ఈ ప్రపంచం లో మరే వ్యక్తీ చెయ్యలేక పోయాడు. జిల్లెర్ సాంగ్ సంగతి పక్క పెట్టండి కనీసం మూన్ వాక్ స్టెప్ చెయ్యగల ఒక్క స్టార్ ఉన్నాడా ఈ రోజు ?

4. పవన్ కళ్యాణ్ జల్సా సినిమా కి మహేష్ వాయిస్ ఇస్తేనో , బాద్షా లో మహేష్ ఎన్టీఆర్ కి గొంతు అరువు ఇస్తేనో , మర్యాద రామన్న లో సైకిల్ పాత్ర కి రవితేజ గొంతు ఇస్తేనో మనం గొప్పగా చెప్పుకున్నాం కానీ ఒక సాధారణ మీడియం బడ్జెట్ యానిమేషన్ సినిమా లో హనుమంత్రుడు పాత్ర కి సినిమా మొత్తం వాయిస్ ఇచ్చాడు చిరంజీవి. అదే హనుమాన్ అనే యానిమేషన్ చిత్రం 

5.ఎలాంటి క్రైసిస్  వచ్చినా కూడా తన కుటుంబానికి పూర్తిగా అండగా ఉన్నాడు చిరంజీవి. ఈ దేశం లో ఒక హీరో కాడలు పట్టుకుని ఎత్తుకి ఎదిగి వచ్చిన హీరోలు చాలా తక్కువ కానీ మీరు మెగా హీరోలు అనండీ ఇంకేమన్నా అనండీ చిరంజీవి చెట్టు కాడ ని పట్టుకుని పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , అల్లూ అర్జున్ లాంటి స్టార్ లు ఈ రోజు తెలుగు సినిమా ని ఏలుతున్నారు. ఒక హీరో ని నమ్ముకుని ఆ కుటుంబం లో వ్యక్తి హీరో అవడం వేరు ఆ హీరో కి వెన్ను దండుగా ఉండి చాలా పెద్ద స్టార్ అయ్యే వరకూ సపోర్ట్ ఇవ్వడం వేరు .

6. 1987 లో సౌత్ నుంచీ ప్రపంచ ఆస్కార్ కి అతిధి గా అఫ్ఫెషియాల్ గా ఇన్విటేషన్ అందుకుని ఆస్కార్ కి అటెండ్ అయ్యిన మొట్ట ముదటి హీరో చిరంజీవి

7. సింగల్ పాత్ర లో ,ద్విపాత్రాభినయం లో , త్విపాత్రాభినయం లో మూడింటా 100 రోజుల సినిమా లు తీసిన ఏకైక హీరో చిరంజీవి. ఇప్పటి హీరోలు ద్విపాత్రాభినయం చెయ్యడం కెరీర్ కే పెద్ద సవాల్ ఇక త్విపాత్రాభినయం సంగతి దేవుడు ఎరుక 

8. రష్యన్ ఇటాలియన్ లలో సినిమాలు డబ్బింగ్ అయ్యిన తొలి హీరో చిరంజీవి - స్వయం కృషి - పసివాడి ప్రాణం సినిమాలు ఈ ఘనత సాధించాయి

9. ఫేస్ బుక్ , ట్విట్టర్ లలో ఫాన్స్ తో ఇప్పటి హీరోలో బాగానే టచ్ లో ఉండే వారు మరి రెండు దశాబ్దాల క్రితం సంగతో? అప్పట్లో తనకంటూ ఒక సొంత వెబ్సైటు స్టార్ట్ చేసుకుని ఫాన్స్ కి దగ్గర వాదం లో కూడా తనతో ఎవ్వరూ పోటీకి రాలేడు అని నిరూపించుకున్నారు చిరంజీవి

10. ఫిలిం ఫేర్ లలో ఏడు ఫిలిం ఫేర్ లు అందుకుని అవి కూడా ఒకే కాటగిరీ లో అందుకున్న నటుడు ఆయన 

11 అమితాబ్ , షారూఖ్ , సల్మాన్ రాజ్యం ఏలుతున్న సమయం లో బాలీవుడ్ తారలైన వారిని కూడా తలదన్ని 'బిగ్గెర్ థన్ బచ్చన్' గా అవతరించి భారత దేశంలోని ఎక్కువ పారితోషికం తీసుకున్న తారగా చరిత్ర సృష్టించారు. ఇప్పటి హీరోల సంగతేంటి ? షారూఖ్ , ఆమీర్ హిందీ లో కోట్లకి పడగలు ఎత్తుతూ ఉండగా మనవారు కూడా బాగానే తీసుకుంటున్నారు కానీ వారికంటే చాలా రెట్లు తక్కువ . షారూక్ సంగతి తరవాత పక్క రాష్ట్రం తమిళ విజయ్ పారితోషికం దాటడానికి పవన్ - మహేష్ లకి ఎంత సమయం పడుతుందో !!

12. మొట్టమొదటి సారి తన సినిమా లో తానే పాట పాడి కొత్త ట్రెండ్ ని సెట్ చేసిన హీరో చిరంజీవి

13. డాన్స్ లో మూడు దశాబ్దాలు నిరంతరాయంగా తన 'మార్కు' చూపించిన చిరు. దాయి దాయి దామ్మ స్టెప్ తో ఒక కొత్త ఒరవడి సృష్టించారు. ఒక సెకండ్ క్లాస్ పిల్లాడు కూడా ఆ స్టెప్ చూస్తే చిరంజీవి దే అని చెప్పెయగలడు అంటే ఆ ఎఫెక్ట్ ఎంతగా ఉందో అర్ధం చేస్కోవచ్చు. ఒక చిన్న డాన్స్ స్టెప్ తో అదిరిపోయే క్రేజ్ ఏ హీరో కీ కుదరలేదు డాన్స్ విషయం లో .

14. ఒక ఇండస్ట్రీ కి ఉన్న టాప్ హీరో , టాప్ నెంబర్ 1 హీరో రాజకీయాల కోసం సినిమాలు వదిలి బయటకు వెళితే ఆ పోసిషన్ ని గ్రాబ్ చేసుకోవడానికి ఆ ఇండస్ట్రీ లో ఉన్న అతని ప్రత్యర్దులకి కానీ అతని తరవాత వచ్చిన హీరోలకి గానీ ఎంత సమయం పడుతుంది ? ఒక ఏడాది? రెండేళ్ళు ? మూడేళ్ళు? పూర్తిగా ఎనిమిది  సంవత్సరాల పాటు ఆయన రాజకీయంగా పక్కి వెళ్ళిపోతే ఇంకా ఆ పోసిషన్  అలాగే ఉంది తప్ప , ఆ నెo 1 కుర్చీ ఆయన కోసం ఎదురు చూస్తోందే తప్ప ఇంకొకరి పంచన చేరలేదు .. అదీ చిరంజీవి స్టామినా 


మరింత సమాచారం తెలుసుకోండి: