ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈ వారం 9వ తారీఖున విడుదల అవుతున్న ‘రుద్రమదేవి’ క్రేజ్ అనుకోకుండా సునామీలా పరుగులు పెడుతూ గుణశేఖర్ తో పాటు బయ్యర్ల ఆశలను కూడ చిగురింప చేస్తోంది. ఈసినిమా ప్రమోషన్ ఊహించిన స్థాయికన్నా వేగo పుంజు కోవడంతో ఈసినిమా నెగిటివ్ నుండి పాజిటివ్ టాక్ లోకి విడుదల కాకుండానే ఎంటర్ అవుతోంది. 

దీనికితోడు గుణశేఖర్ ఈసినిమాలో నటించిన నటీనటులందరిచేత ఛానల్స్ ద్వారా ఈసినిమాను ప్రమోట్ చేయిస్తున్నాడు. ఇది ఇలావుండగా టాప్ హీరోల సినిమాలతో సమానంగా శుక్రవారం ఉదయం 5 గంటలకు స్పెషల్ షోకు ఏర్పాట్లు చేసినట్టు టాక్. దీనికి సెలబ్రిటీస్ హాజరు అవుతున్నారని టాక్. అంతేకాకుండా ఇరు రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలలో ఈ సినిమా బెనిఫిట్ షోలకు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ విషయమై ఇప్పటికే అధికారుల పర్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు 70 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈసినిమా గట్టెక్కాలి అంటే కనీసం మూడు వారాలు ఈసినిమా అత్యధిక ధియేటర్లలో ప్రదర్శింపబడి తీరాలి. అయితే ఈ సినిమా విడుదలైన వారంరోజులకే చరణ్ ‘బ్రూస్ లీ’ ఆ తరువాత మరో వారం రోజులకే ‘అఖిల్’ సినిమాలు భారీ స్థాయిలో అత్యధిక ధియేటర్ల లో విడుదల అవుతున్న నేపధ్యంలో ‘రుద్రమదేవి’ హిట్ టాక్ తెచ్చుకున్నా ధియేటర్లు ఎక్కడ మిగులుతాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి. 

టాలీవుడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి పరిస్థుతులలో ‘రుద్రమదేవి’ మొదటి వారంలోనే 40 కోట్లు కలెక్షన్స్ రాబట్టుకోగలిగితేనే ఈసినిమా బతికి బయట పడగలుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఓవర్సీస్ మార్కెట్లో తెలుగు సినిమాలకు డాలర్లు కురుస్తున్న నేపధ్యంలో అమెరికాలోని మన తెలుగు ప్రేక్షకులు ‘రుద్రమదేవి’ ని కరుణిస్తే కొంత వరకు గుణశేఖర్ కష్టాల నుండి బయటపడినట్లే అనుకోవాలి. ఒక చారిత్రాత్మక సినిమాను మన ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: