సాయి ధరమ్ తేజ్ ను మెగా ఫ్యామిలీ డైరెక్ట్ గా ప్రమోట్ చేయకపోయినా ఈ యంగ్ హీరో తన తెలివైన ఎత్తుగడలతో తనకు తానే ప్రమోట్ చేసుకుంటూ అంతర్లీనంగా మెగా కుటుంబ నేపధ్యాన్ని వాడుకుంటున్న ఎత్తుగడలను చూసి మెగా ఫ్యామిలీ కూడ షాక్ అవుతోంది అన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు ఏ మెగా హీరోకి కలిసిరాని అవకాశాలు సాయి ధరమ్ తేజ్ కు కలిసి రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

చిరంజీవి పాటలను రీ మిక్స్ చేయడంలో రామ్ చరణ్ కూడ చేయలేని సాహసాలు సాయి ధరమ్ తేజ్ చేస్తూ ఉండటం చివరకు చిరంజీవిని కూడ ఆశ్చర్య పరుస్తోంది అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఇప్పటికే ఈ యంగ్ హీరో ‘రేయ్’ సినిమా కోసం ‘గోలీమార్’ పాటను ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’  కోసం ‘గువ్వా గోరింక’ పాటను రీమిక్స్ చేసి తన క్రేజ్ ను ఈ మెగా యంగ్ హీరో పెంచుకుంటున్న విషయం తెలిసిందే. 

సాయి ధరమ్ తేజ్ తాను లేటెస్ట్ గా నటిస్తున్న సినిమాకు చిరంజీవి ఒకనాటి బిరుదు ‘సుప్రీమ్’ ను తన టైటిల్ గా మార్చుకోవడమే కాకుండా తాను రాశిఖన్నాతో జంటగా నటిస్తున్న ‘సుప్రీమ్’ సినిమాలో  ‘యముడికి మొగుడు’ సినిమాలోని సుప్రీమ్ హీరో అంటూ సాగే  పాటను రీమిక్స్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ ఆలోచనకు చిరంజీవి కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. 

అయితే ఈ వార్త బయటకు వచ్చిన తరువాత టాలీవుడ్ విశ్లేషకులు మరో విధంగా స్పందిస్తున్నారు. మెగా స్టార్ నటించిన 150 సినిమాల్లో ఏ పాటనైనా, ఏ డైలాగ్ అయినా ఆయన  కుటుంబహీరోలు వాడుకోవచ్చు అన్నవిషయం సర్వసాధారణమే అయినా తాను నటించిన ప్రతి సినిమాలోను చిరంజీవి ఇమేజ్ ను ఇలా అతిగా సాయి ధరమ్ తేజ్ వాడుకోవడం మొదలు పెడితే అతడి కెరియర్ కు సంబంధించి అతిగా మారి అసలకుమోసం వస్తుంది అంటూ సెటైర్లు పడుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: