మనోజ్ యాక్టింగ్ , యాక్షన్ సీక్వెన్సెస్, కెమెరా వర్క్ , రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్మనోజ్ యాక్టింగ్ , యాక్షన్ సీక్వెన్సెస్, కెమెరా వర్క్ , రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్కథ, కథనాలు , సరైన పాత్రల ప్రాధాన్యత లేకపోవడం

ఒకప్పుడు సీరియస్ గా దందాలు చేసుకుంటూ జీవనం సాగించిన గురు రాజ్ (ప్రకాశ్ రాజ్) సడెన్ గా అవన్ని మానేసి మంచిగా బ్రతకాలనుకుంటాడు. అనుకున్న విధంగానే గతాన్ని పక్కనపెట్టి నిత్య నూతన జీవితాన్ని సాగిస్తుంటాడు. ఇక రియల్ ఎస్టేట్ చేస్తూ ప్రశాంతంగా ఉంటాడు. గురుకి ముగ్గురు కొడుకులు పెద్దవాడు కాళి (జగపతి బాబు), రెండవ వాడు  గోపి (వడ్డె నవీన్), మూడో కొడుకు రాధ (మంచు మనోజ్) ఎవరికి వారు బ్రతికేస్తుంటారు. సడెన్ గా ఓ సెటిల్మెంట్ చెసి వస్తుండగా గురుని ఎవరో ఎటాక్ చేసి దారుణంగా చంపేస్తారు. అయితే ఆ తండ్రి హత్య వెనుక ఉన్న వ్యక్తులు కనుక్కునే క్రమంలో ఉన్న గురు పెద్ద కొడుకు కాళిని కూడా చంపేస్తారు. అసలు ఈ హత్యలకు గల కారణాలు ఏంటి..? సిటిలో రౌడి గ్యాంగ్ సత్తూ (అభిమన్యుసింగ్) కు గురుకి ఉన్న సంబంధం ఏంటి..? ఈ మర్డర్ మిస్టరీను రాధా ఎలా కనుక్కున్నాడు..? తన అన్న, నాన్నలను చంపిన వారిని రాధ ఏం చేసాడు అన్నది అసలు కథ..!  

వర్మ దగ్గర ఎటువంటి వ్యక్తి దగ్గర నుండైనా తనకు కావాల్సిన నటనకు తీసుకునే సత్తా ఉంది. ఇక అలాంటి దర్శకుడికి విలక్షణ నటులు దొరికితే ఎటాక్ లా ఉంటుంది. సినిమా మొత్తం సీరియర్ మోడ్లో వెళ్లడంతో హీరో మనోజ్ తన కెరియర్లోనే ఇంత సీరియర్ మోడ్ సినిమా చేసి ఉండడు. ఇక కాళిగా జగపతి బాబు మరోసారి అదరగొట్టేశాడు. గురుగా ప్రకాశ్ రాజ్ తక్కువ పాత్రే అయినా చేసిన సీన్స్ ఓకే అనిపించాయి. ఇక పిరికివాడిలా వడ్డె నవీన్ పర్వాలేదనిపించుకున్నాడు. సినిమా ఎలా ఉన్నా తన సినిమాల్లో ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ లో కాంప్రమైజ్ అవ్వడు వర్మ. ఇక సినిమాలో హీరోయిన్ గా నటించిన సురభి అసలు ఈ సినిమా ఎందుకు చేసిందో తెలియదు.. క్యారక్టర్ కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. ఎటాక్ లో స్పెషల్ ఎట్రాక్షన్ పూనం కౌర్ హాట్ అప్పీల్.. ఇదవరకు ఎన్నడు లేని హాట్ లుక్ తో ఆడియెన్స్ ను మత్తులో దించే ప్రయత్నం చేసింది పూనం.

వర్మ సినిమా అనగానే టెక్నాలజీ పరంగా అధునాతనంగా ఉంటుంది. ఇక ఈ సినిమాను అతి తక్కువగా 107 నిమిషాలకే క్లోజ్ చేశాడు వర్మ. ఓ సింపుల్ రెగ్యులర్ డ్రామాను తన మార్క్ డైరక్షన్ తో తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కాని వర్మ సినిమాల్లో కనిపించే కొత్తదనం ఈ సినిమాలో కనబడలేదు. సినిమాలో వర్మ నైపుణ్యత పెద్దగా కనబడకపోయినా సినిమా వరకు ఓకే అనిపించుకున్నాడు. ఎటాక్ కు పనిచేసిన కెమెరా మెన్ అంజి ఓకే అనిపించుకున్నాడు. సినిమా 5డితో తీసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది.. కొన్ని చోట్ల ఆ డీమెరిట్స్ కూడా కనబడతాయి. రవి శంకర్ మ్యూజిక్ సినిమాకు తగ్గట్టుగా ఉంది. 

వర్మ సినిమా అంగానే ఆడియెన్స్ లో ఏదో తెలియని ఆకర్షణ ఏర్పడుతుంది. వరుస సినిమాలు ఫెయిల్ అవుతున్నా వర్మ నుండి రక్త చరిత్ర, కిల్లింగ్ వీరప్పన్ లాంటి సినిమాలు వస్తాయని ఆశిస్తారు. అందుకే సినిమా ఎప్పుడు వచ్చినా ఎలా వచ్చినా చూసేందుకు ఓ వర్గం ప్రేక్షకులు ఎప్పుడు రెడీగా ఉంటారు. ఇక ఈ ఎటాక్ సినిమా విషయంలో వర్మ ఎంచుకున్న కథ చాలా రెగ్యులర్ రివెంజ్ డ్రామా కాబట్టి ఆడియెన్స్ లో ఎటువంటి థ్రిల్ ఉండదు. పాత్రలు సన్నివేశాలు ఎంత అద్భుత ప్రదర్శన చేసినా వర్మ టేకింగ్ గొప్పతనాన్ని ఈ సినిమా చూపించలేకపోయింది. సినిమాలో ఎంటర్టైన్ లేకపోవడం ప్రధాన సమస్య. సినిమా మొత్తం మీద వర్మ చెప్పబోయే పాయింట్ ఎక్కడ హైలెట్ చేయలేదు. మనోజ్ కూడా సినిమా మొత్తం సీరియర్ మోడ్లో ఉండటం ఆడియెన్స్ కు కాస్త బోర్ గా అనిపిస్తుంది. ఇక బ్యాక్ గ్రౌండ్లో వచ్చే ఎటాక్ ఎటాక్ సాంగ్ ప్రేక్షకుల మీద ఎటాక్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. మొత్తానికి ఈ ఎటాక్ తో మరోసారి వర్మ తన రెగ్యులర్ హింసను చూపించాడని చెప్పొచ్చు. సి.కళ్యాణ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. వర్మ సినిమా చూడాలని తాపత్రయపడి వర్మ సినిమాలను వర్మ చేసే అరచాకలాను చూసి ఎంజాయ్ చేసే వారికి మాత్రమే నచ్చే సినిమా ఎటాక్.  

Manchu Manoj,Surabhi,Jagapati Babu,Ram Gopal Varma,Swethalana,Varun,Teja,CV Rao,Ravi Shankarవర్మ ఎటాక్.. అభిమానులకు మాత్రమే..!

మరింత సమాచారం తెలుసుకోండి: