నాని, మ్యూజిక్నాని, మ్యూజిక్హీరోయిన్స్ ,స్క్రీన్ ప్లే, క్లైమాక్స్

ఇంజినీరింగ్ కంప్లీట్ చేసుకుని సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న ఆదిత్య (నాని) ఓ రోజు యాక్సిడెంట్ లో కిరణ్మయి (అను ఎమన్యుల్)ను చూస్తాడు. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిన ఆదిత్య ఆమె కోసం తన జాబ్ వదిలేస్తాడు. హీరోయిన్ చదువుతున్న కాలేజ్ లోనే లెక్చరర్ గా చేరి ఆమెను కూడా ప్రేమలో దించేస్తాడు. సడెన్ గా ఆదిత్య లవ్ బ్రేక్ అవుతుంది. తనని మర్చిపోయే క్రమంలో హైదరాబాద్ లో రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా చేస్తుంటాడు ఆదిత్య. ఇక అక్కడ సుమ (ప్రియ శ్రీ)ను చూడగానే ఇష్టపడి ఆమె కోసం వెంటపడతాడు. సుమని ప్రేమను ఒప్పించే ప్రయత్నంలో ఆమెకు తన బ్రేక్ అప్ లవ్ స్టోరీ గురించి మళ్లీ తన లవ్ ఫీలింగ్స్ ను గుర్తుతెచ్చుంటాడు. అసలు ఆదిత్య, కిరణ్ లు ఎందుకు విడిపోతారు..? కిరణ్ మీద ఉన్న ప్రేమను ఆదిత్య ఎలా చూపించాడు..? చివరకు వారిద్దరు కలిశారా లేదా అన్నది అసలు కథ. 

నాచురల్ స్టార్ నాని ఆదిత్యగా ఈ సినిమాలో తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా అంతా నాని తన భుజాన వేసుకుని నడిపించాడు. కామెడీ, ఎమోషన్ ఈ రెండిటిలో నాని మరోసారి అదరగొట్టేశాడు. ఇక హీరోయిన్స్ గా చేసిన అను ఎమాన్యుల్ పర్వాలేదు. అయితే మనసుకోని ప్రేమను చెప్పలేని క్య్రారక్టర్ లో ఆమె నుండి అవుట్ పుట్ సరిగా తీసుకోలేదు అనిపిస్తుంది. సుమగా నటించిన ప్రియ శ్రీ కూడా తన పాత్ర వరకు ఓకే అనిపించుకుంది. ఇక కాశి, వెన్నెల కిశోర్, సప్తగిరిలను వాడుకున్నంత వరకు పర్వాలేదు కామెడీ పండింది. పోసాని కృష్ణమురళిని కేవలం రెండు డైలాగులే ఇచ్చి సరిపెట్టారు. ఇక మిగతా నటీనటులంతా తమ తమ పాత్రల పరిధి మేరకు మంచి నటన కనబరిచారు.

నాని మజ్ను సినిమా డైరక్టర్ విరించి వర్మ విషయానికొస్తే సినిమా తీసుకున్న పాయింట్ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా ఓకే కాని సినిమా ఎందుకో ఆడియెన్ కు కనెక్ట్ అవ్వలేదు అనిపిస్తుంది. దర్శకుడిగా సక్సెస్ అయినా కథ అనేది బలంగా రాసుకోవడంలో విఫలమయ్యాడు. సినిమాకు మ్యూజిక్ అందించిన గోపి సుందర్ మరోసారి అద్భుతమైన సంగీతం అందించడం జరిగింది. గ్యానశేఖర్ కెమెరా వర్క్ బాగుంది. సినిమలో నాని లుక్ మిగతా సినిమాల కన్నా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓకే.. కాని ఇంకాస్త ట్రిం చేసుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇక కిరణ్, గీతా గళ్ల ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు ఎంత కావాలో అంత రిచ్ గా అనిపించాయి. 

ఫాంలో వరుస హిట్లతో జోష్ మీదున్న నానితో మజ్నుగా ఓ ప్రయత్నం చేశాడు విరించి వర్మ. సినిమాకు అంత గొప్ప టైటిల్ పెట్టి సినిమాను మాత్రం పేలవంగా నడిపించేశాడు. సినిమాలో నాని పాత్ర ఓ భగ్న ప్రేమికుడు.. అయితే అలాంటి తను వేరే అమ్మాయిని ప్రపోజ్ చేయడం కాస్త లాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. నాని పాత్ర మీదే దృష్టి పెట్టి రాసుకున్న ఈ మజ్ఞు కథలో మిగతా పాత్రలన్ని పేలవంగా తయారయ్యాయి.


ముఖ్యంగా సినిమాలో హీరోయిన్స్ అను ఇమాన్యుల్. ప్రియా శ్రీ పాత్రలను దర్శకుడు మంచిగా రాసుకోలేదు అని చెప్పాలి. హీరోయిన్ క్యారక్టర్ అంతా గజిబిజిగా ఉంటుంది. అసలు ఆ అమ్మాయి ఇంటెన్షన్ ఏంటి అనేది పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద పండిచలేదు. అంతేకాదు సుమ క్యారక్టర్ కూడా సరిగా రాసుకోలేదు. ఫస్ట్ ఎంతో బిల్డ్ అప్ ఇచ్చిన ఆ పాత్ర అదిత్య లవ్ స్టోరీ చెప్పగానే అతనంటే ఇష్టం ఏర్పడటం అతనితో పెళ్లికి సిద్ధమవడం అంతా క్లారిటీ లేకుండా ఉంటుంది.


మొదటి భాగం అంతా సరదాగా నడుస్తుంది. ఒక అమ్మాయిని పడేయడం కోసం తన బ్రేక్ అప్ అయిన లవ్ స్టోరీని చెప్పడం ఇక భీమవరంలో కాలేజ్ లెక్చరర్ గా నాని చేయడం అంతాఫ్రెష్ గా అనిపించినా ఎప్పుడితే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో సినిమా ఇక స్లో అవుతుంది. అంతేకాదు సెకండ్ హాఫ్ లో అంతగా కథ నడిచే వీలు లేకపోవడంతో సాగదీసినట్టు అనిపిస్తుంది.


సినిమా ఇంటర్వల్ దాకా ఎంజాయ్ చేసిన ఆడియెన్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి తను బ్రేక్ అప్ అయ్యింది ప్రస్తుతం ప్రేమించే సుమ కజిన్ అని తెలియగానే ఇక మళ్లీ కథ రొటీన్ పంథాలో సాగుతుంది. ఆమెను ఇంప్రెస్ చేయడానికి హీరో నానా తిప్పలు పడతాడు. క్లైమాక్స్ కూడా అంత బలంగా ఏం రాసుకోలేదు దర్శకుడు. ప్రస్తుతం హిట్ మేనియాలో ఉన్న నాని మజ్నుతో కాస్త లెక్క తప్పినట్టు అనిపించినా తన మార్క్ నటన కోసం వచ్చే వారికి మంచి సినిమా చూసిన తృప్తి కలిగేలా చేస్తాడు. 


నాని చెప్పిన హైలెట్ డైలాగ్స్.. నువ్వు నన్ను విడిచి ఎంత దూరం వెళ్లినా అంత దూరం నేను వస్తా.. చేయి విరిగిన రోజు నాకు తెలియదు ఏదో ఓ రోజు నా మనసు కూడా విరిచేసి వెళ్లిపోతావని.. లాంటి డైలాగ్స్ మనసుకి తాకుతాయి. అయితే డైలాగ్స్ సీన్ అంతా బాగున్నా ఇదో రెగ్యులర్ సినిమా కావడంతో ఆడియెన్స్ ఎలాంటి రిపోర్ట్ ఇస్తారో చూడాలి.  

Nani,Anu Emmanuel,Priya Shri,Virinchi Varma,Geetha Golla,P. Kiran,Gopi Sunderఈ మజ్ను ప్రేమ భారంగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: