GJG: Tweet Review || తెలుగు ట్వీట్ రివ్యూ || English Full Review

GJG:గుండెజారి గల్లంతయ్యిందే వాయిస్ రివ్యూ || Gunde Jaari Gallanthayyinde Voice Review

‘ఇష్క్’ విజయం తరువాత  యువహీరో నితిన్ నటించిన సినిమా ‘గుండెజారి గల్లంతయ్యిందే’. శ్రీరామనవమి నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఇష్క్’ తో కలిసి వచ్చిన నిత్యామీనన్ తో నితిన్ మళ్లీ నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!   చిత్రకథ : కార్తీక్ (నితిన్) అమ్మానాన్నలు అమెరికాలో ఉంటే తను మాత్రం ఇండియాలో సింగిల్ గా ఉంటూఉంటాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన కార్తీక్ తన ఫ్రెండ్ పెళ్లిలో ఒక అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అయితే ఫ్రెండ్ చేసిన పొరపాటు కారణంగా ఆ అమ్మాయి అనుకుని వేరే అమ్మాయి శ్రావ్య (నిత్యామీనన్)  తో ఫోన్ లో పరిచయం పెంచుకుంటాడు. అయితే తాను క్లోజ్ అవుతున్నది తాను ప్రేమించిన అమ్మాయిని కాదని తెలుసుకున్న కార్తీక్ ఏం చేశాడు...? మరి శ్రావ్య, కార్తీక్ తో తన బంధాన్ని ఎలా కొనసాగించింది..? అంశాలతో సినిమా సరదాగా, ఆసక్తి సాగుతుంది.

advertisements


నటీనటుల ప్రతిభ :   నితిన్ ఈ సినిమాలో చాలా ఎనర్జిటిక్, చాలా  కాన్ఫిడెంట్ తో పాటు చాలా కూల్ గా నటించాడు. చాలా కాలం మాస్ కథల వెంటపడిన ఈ యువహీరో తాను దేనికి సరిగ్గా సరిపోతాడో తెలుసుకుని చేసిన సినిమా ఇది. కామెడి, యాక్షన్, లవ్ సన్నివేశాల్లో సూపర్ అనిపించాడు. కొన్ని సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ ను గుర్తిచేసినా సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించాడు. నితిన్ ను ఈ సినిమాలో చూస్తుంటే ఈ హీరోకు వరుసగా 12 ఫ్లాపులు వచ్చాయనే విషయాన్ని నమ్మలేం. నితిన్ తరువాత చెప్పుకోవాల్సిన తార నిత్యామీనన్. శ్రావణి పాత్రకు నిత్యామీనన్ ను తప్ప మిగిలిన వారిని ఊహించుకోలేం. ప్రేమలో పడిన అమ్మాయిగా, ఆఫీస్ లో బాస్ లాగా నిత్యామీనన్ చేసిన అభినయం చాలా బాగుంది. నితిన్-నిత్యామీనన్ మధ్యన సన్నివేశాలు బాగా పండాయి. ఇషా తల్వార్ పాత్రకు పెద్దగా ప్రాధన్యం లేదు. అలీ, నితిన్ ఫ్రెండ్ గా చేసిన నటుడు ఆకట్టుకుంటారు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు. ప్రముఖ క్రీడాకారణి గుత్తా జ్వాల ఒక ఐటెం  పాటలో నటించింది. ఇదే అమెకు చివరి సినిమా చాన్సు అనిపిస్తుంది.   సాంకేతిక వర్గం పనితీరు :    ఫోటోగ్రఫీ బావుంది. ప్రతీ సీన్ చక్కగా వచ్చింది. సంగీతం బావుంది. అన్ని పాటలు ఆకట్టుకునేవిధంగా ఉన్నాయి. తొలి ప్రేమలోని పాటను రీమిక్స్ చేశారు. ఈ పాటల చిత్రీకరణ కూడా బావుంది. నిర్మాతలు కథకు సరిపడా ఖర్చు చేశారు. మాటలు సరదాగా సాగుతూ అక్కడక్కడ ఆకట్టుకుంటాయి. దర్శకత్వం విషయానికి వస్తే ఒక ప్రేమకథను వినోదభరితంగా, ట్విస్ట్ లతో ఆసక్తికరంగా తీసాడు.  ముందు ఎం జరుగుతుందో అనే విషయం తెలిసినా ఎలా జరుగుతుందో అనే ఆసక్తి కలిగిస్తూ సినిమా సాగుతుంది. ఆకట్టుకునే ముగింపు సినిమాకు మంచి బలాన్ని ఇస్తుంది. అయితే ఇషా తల్వార్ పాత్ర చివరిలో ఒక్కసారిగా రియిలేజ్ అయ్యానని చెప్పడం పూర్తి సినిమా ట్రిక్ గా అనిపిస్తుంది హైలెట్స్ : నితిన్-నిత్యాల మధ్య కెమిస్ర్టీ, వారి నటన, కామెడి, ముగింపు  డ్రాబ్యాక్స్ :   గొప్పగా లేని కథ, ఇషా తల్వార్ పాత్ర ఆకస్మాత్తుగా రియిలేజ్  కావడం విశ్లేషణ : ప్రేమకథలను హ్యాండిల్ చెయ్యడం అందరికి చేతకాదు. అయితే కొత్త దర్శకుడు అయినా విజయకుమార్ కొండా ఈ సినిమాను అందరూ మెచ్చే విధంగా తీశాడు. నితిన్- నిత్యామీనన్ నుంచి పూర్తి సహకారం రావడంతో దర్శకుడు తను అనుకున్న విషయాన్ని చక్కగా తెరకెక్కించాడు. కొన్ని సన్నివేశాల్లో సెంటిమెంట్ ను పండించాడు.  ప్రేమ కథలంటే విషాదాలు, వాస్తవాలు అనే పరదా తొలగిస్తూ సరదా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా రూపుదిద్దుకుంది. అక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్నట్లు అనిపించినా సమ్మర్ లో మంచి సినిమా చూసిన అనుభూతిని కలిగిస్తుంది. మంచి ఫీల్ తో సినిమా సాగుతూ మనసును హత్తుకుంటుంది. చివరగా :    ‘గుండె జారి గల్లంతయ్యిందే’ గుండెను హత్తుకుంటుంది.   

Gunde Jaari Gallanthayyinde Review: Cast & Crew

More Articles on GJG || GJG Wallpapers || GJG Videos


మరింత సమాచారం తెలుసుకోండి: