Tadakha Reviews:  Tweet Review |  తెలుగు రివ్యూ |  English Full Review

మా ప్రియతమ ఎపిహెరాల్డ్.కామ్ రీడర్స్ కు స్వాగతం. అక్కినేని నాగ చైతన్య నటించిన తడాఖా సినిమా ట్వీట్ రివ్యూ, లైవ్ అప్ డేట్స్ మీ కోసం. 

                  ---  శుభం  --- 
12:55pm: 
సూపర్ ... పెద్దోడు - చిన్నోడు ... వాళ్ళు కుమ్మేయ్యడానికి ఒక వంద మంది రౌడీలు ... వెరసి పక్కా కమర్షియల్ మాస్ ఫైట్. సినిమా సమాప్తం. 

12:50pm: 
డాలీ గారో - క్లైమాక్స్ ఎసేయ్యండి సారూ ... ఇంకెంత సేపు ఈ ఫార్ములాలు ?  బోరు కొట్టకముందే సినిమా ని కంప్లీట్ చెయ్యండి ప్లీజ్

12:45pm: కథలో ఇంకో మలుపు ... కానీ అంత ఇంటరెస్టింగ్ గా లేదు. మళ్ళీ ఇంకో ఫైట్ ... కమర్షియల్ సినిమా కదా ... కామెడి - ఫైట్స్ - రొమాన్స్ - సెంటిమెంట్ అన్నీ కలిపేసి ... వాయకొకటి వదుల్తున్నారు 

12:40pm: 
ఇద్దరమ్మాయిలు - ఇద్దరబ్బాయిలు  : గణ గణ బొట్టేటి సాంగ్ ... ఎస్ ఎస్ ధమన్ డిక్-చిక్ డిక్-చిక్ మ్యూజిక్ ... ఎగిరినోడికి ఎగిరినంత ... నా సామిరంగా. 

12:30pm:
 సన్నివేశానికి తగ్గట్టుగా సునీల్ గొంతు మార్చి మాట్లాడడం ... సీన్స్ మంచిగా రావడానికి హెల్ప్ చెస్తున్ది. చిన్నోడు తెలివితేటలతో పరిస్థితులను ఎదుర్కొనడం ... యూత్ ని ఆకట్టుకునే విధంగా వుంది 

advertisements


12:20pm: 
సునీల్ ... ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ లాగ తయారయ్యే సీన్స్ ఓకే - ఒకే. చిన్నోడు - పెద్దోడికి హెల్ప్ చేసే సీన్స్ బావున్నాయి.

12:15pm: 
సునీల్ - నాగ చైతన్య ల అన్న-దమ్ముల అనుబంధం ప్రెజంటేషన్ బావున్ది. వీళ్ళిద్దరు రక్త సంబందికులేమో అనుకునేటట్లు ఉంది కథ వెళ్ళే విథానం. సీతమ్మ వాకిట్లో కంటే ముచ్చటగా వుంది అక్కడక్కడా 

12:10pm: 
నాగ చైతన్య ఒక మాస్ హీరో గా సెటిల్ అవ్వడానికి ఈ సినిమా బాగా ఉపయోగ పడవచ్చు. సునీల్ మాత్రం సెంటిమెంట్ సీన్స్ ని నమిలి మిన్గేస్తున్నాడు ...

12:05pm: 
డాలీ తనదైన శైలి తో చేసిన ఫైట్ సీక్వెన్స్ - గమ్మతైన మలుపులతో చైతు కి మాస్ ఇమేజ్ ఎస్టాబ్లిష్ చేసే విధంగా వుంది. 

11:57am: అశుతోష్ రానా పర పర చిన్చేతన్నాడు స్క్రీన్ ని తన పెర్ఫార్మన్స్ తో ... భలెటొణ్ణి పట్టుకోచ్చరండి బాబు 

11:50am: 
శుభానల్లా పాట ... శారీ  లో తమన్నా బుట్ట బొమ్మ లా చక్కగా వున్ది.  మిల్కీ బ్యూటీ డాన్సు స్టెప్స్ వాటితో పాటు అప్పుడప్పుడూ నడుం తో చేస్తున్న విన్యాసాలు ... అబ్బబ్బ 

11:45am: 
తమన్నా ని పెళ్లి చేస్కొడానికి వచ్చిన ఎన్అర్ఐ గా వెన్నెల కిషోర్ కారెక్టర్ ఫన్నీ గా బావుంది

11:35am: 
ఫస్ట్ హాఫ్ జస్ట్ నాట్ బాడ్. అంతే ... జస్ట్ నాట్ బాడ్. బ్యాక్ గ్రౌండ్ మూజిక్ బావుంది, ఫైట్స్ బావున్నాయి, తమన్నా - చైతన్యా కెమిస్ట్రీ బావుంది 

11:30am: విశ్రాంతి - అంత పెద్ద ఇంటర్వెల్ బాంగ్ ఏమీ లేదిక్కడ 

11:30am: అబ్బా ... అన్నగారికోసం తమ్ముడి ఫైట్ ... కాన్సెప్ట్ బావుంది కానీ ... ఎగ్జిక్యుషన్ తన్నింది ఇక్కడ. 

11:25am: 
అంత ఇంటరెస్టింగ్ సీన్స్ ఏమీ లేవు గురువుగారూ ... చాలా సాదా సీదా గా నడుస్తుంది సినిమా ... ఇంటర్వెల్ కార్డ్ ఎప్పుడెస్తారో !

11:20am: 
మారో - మారో : బీచ్ సాంగ్ ... తమన్నా మొహమాటం లేకుండా నటిస్తుంది . అందుకేనేమో బెల్లంకొండ - ఈ పాప నే - తన తరువాత సినిమా కు కూడా బుక్ చేసేసాడు. 


11:15am:
 సునీల్ - రెండో కేసు సాల్వ్ చేసి డిపార్టుమెంటు లో పాపులర్ అవుతున్న విధానం బానేవుంది కానీ ... సినిమా కొంచెం స్లో అయినట్లనిపిస్తుంది 

11:10am: 
వర్షం లో ఫైట్ ... చాలా కాలం తరువాత కణల్ కణ్ణన్ ఫైట్ కంపోజ్ చేసిన విధానం బావుంది .

11:05am: 
తమన్నా - చైతన్య మధ్య సన్నివేశాలు లైవ్లీ గా ఉంటూ ముద్దు - ముద్దు గా సాగుతున్నాయి 

11:00am: బ్రాహ్మీ కామెడీ అట్టాక్ ... నవ్వులే నవ్వులు, వియ్యాల వారు సాంగ్ తమన్నా - చైతన్య కెమిస్ట్రీ బావుంది. సాంగ్ తీసిన విధానం కూడా బావుంది. ఆండ్రియా తన గ్లామరస్ అందం తో తమన్నా కి పోటీ వస్తుంది.  
10:55am: తమన్నా వోణీ లో హాట్ హాట్ గా ఊరిస్తుంది . హాట్ గానే కాకుండా చాలా క్యూట్ గా కన్పిస్తుంది తమన్నా 

10:50am: 
కామెడీ ఎపిసోడ్ : జయ ప్రకాష్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి కామిక్ ఎంట్రన్స్. ఫర్వాలేదు 

10:45am: 
సినిమాలో మొదటి ఫైట్ ... నాగ చైతన్య ఇరగాదేసేసాడు ... ఫైట్ మాస్టర్ బాగా కంపోజ్ చేసాడు 


10:40am: 
అన్న దమ్ములు గా సునీల్ - చైతు ల నటన చాలా నాచురల్ గా, చూడటానికి ఎబ్బెట్టు కొట్టకుండా ఉంది 

10:35am: 
ఈమధ్య పెంచిన కండలు - తయారు చేసిన ఫిజిక్ తో పోలీస్ ఆఫీసర్ గా సునీల్ చూడ ముచ్చటగున్నాడు ... కానీ ... ఆ కామెడీ టచ్ అలాగే ఉంది

10:35am: 
మిల్కీ బ్యూటీ తమన్నా - ఆండ్రియా ఇంట్రడక్షన్ కలర్ ఫుల్ గా వుంది . స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా వెళుతూ సినిమా బావుంది ఇప్పటివరకు. 

10:30am: 
బ్రంహానందం ఎంట్రీ కూడా బావుంది . రమాప్రభ - బ్రంహనందం కామెడి సీన్ నవ్వులు పూఇస్తున్ది 

10:30am: విలన్ అశుతోష్ రానా ఎంట్రీ జబర్దస్త్ గా వుంది 

10:25am: 
మజా - మజా గా వున్నా సాంగ్ అయ్యేటప్పటికే ... నాగబాబు గారి కారెక్టర్ మాయం . ఎస్ . ఎస్ ధమన్ బ్యాక్ గ్రౌండ్ మూజిక్ ఇరగదీస్తున్నాడు. 
 
10:20am: నువ్వు-నేను బొమ్మ బొరుసే సాంగ్ ... భీమవరం బుల్లోడు సునీల్ డాన్సు ఇరగ దీసెస్తన్నడహె ... చైతు బాబు తెగ కష్ట పడవలసోస్తుంది సునీల్ ని కాచ్ చెయ్యడానికి. 
 
10:15am:  ఛైతూ , సునీల్ తండ్రి గా కొణెదెల నాగేంద్ర బాబు ఎంట్రన్స్, సునీల్ కంటే కూడా నాగ బాబు గారే  ఇంకా యంగ్ గా కన్పిస్తున్నారు 

10:05am: 
ఉహించినట్లుగానే ... ఛైతూ - సునీల్ ల బాల్యానికి సంబంధించిన ఎపిసోడ్ తో సినిమా మొదలయ్యింది 

10:00am: 
స్క్రీన్ మార్చారు ... బొమ్మ స్టార్ట్ అయ్యింది ... సౌండ్ కూడా వస్తుంది.  

9:40am: 
ఎరక్కపోయి వచ్చాము ... ఇరుక్కు పోయాము .... అక్కినేని నాగేశ్వర రావు గారి సూపర్ హిట్ సాంగ్ చూస్తూండండి
 
9:30am: మాటలు లేవు ... బొమ్మోక్కటే కనపడుతుంది. ఏంటో ఈరోజు శకునం బాగోలేదు, ఐమాక్స్ లోనే ఏదో ప్రొబ్లెమ్. సినిమా ఆపు చేసేసారు మళ్ళీ . 

9:25am: 
బెల్లం కొండ సినిమా లేట్ అవ్వడం ఇదే మొదలనుకుంటా ... అయ్య-బాబోయ్ టైటిల్స్ స్టార్ట్ ... మొత్తానికి సినిమా స్టార్ట్ అయ్యింది. 

9:20am: 
ఐమాక్స్ లో రగడ స్టార్ట్ . జనాలు విజిల్స్, అరుపులు రగడ - రగడ చేస్తున్నారు ... కానీ ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు :(

9:10am: 
ఈ సినిమా చైతూ కి చాలా ఇంపార్టెంట్... లాస్ట్ ఇయర్ మొత్తం ఒక్క హిట్ కూడా లేకుండా అయ్యిపోయింది. 2013 లో వస్తున్న చైతు మొదటి  సినిమా హిట్   అవ్వాలని కోరుకుందాం. 

9:05am: 
ఉఫ్ఫ్ మళ్ళీ ఆగింది బొమ్మ. పది నిమిషాలన్నరు ... ఇరవై నిమిషాలయ్యింది, ఇప్పుడేమో ధియేటర్ లో కూర్చోబెట్టి కింగ్ నాగార్జున గ్రీకు వీరుడు పాటలెస్తున్నాడు. 

9:00am: 
హమ్మయ్య సినిమా మొదలయ్యింది మొత్తానికి ... అంతే కాదండోయ్ ఐమాక్స్ ధియేటర్  హౌస్ ఫుల్ :)

 8:45am:
8:30 కి స్టార్ట్ కావలసిన సినిమా తోమ్మిదవుతున్నా స్టార్ట్ కాలేదు. ఐమాక్స్ ధియేటర్ లో ప్రాబ్లెమ్ అట. సరి చెస్తున్నారు. ఇంకొక పదినిమిషాలు వెయిట్ చెయ్యమని అన్నౌన్సుమెంట్ .  ధియేటర్ లో ప్రొబ్లెమా లేక ప్రింట్ రాలేదా తెలీదు 

8:30am:
 ఇదీ ఒకందుకు మంచిదే ... సినిమాలో ఏమాత్రం మేటర్ వున్నా ఇప్పుడున్న పరిస్తితులలో మంచి హిట్ అవుతుంది 

8:20am: 
నాగ చైతన్య గత 2 సినిమాలు వరస ఫ్లాప్ అవడం ... సునీల్ గత 2 సినిమాలు కూడా అదే దారి పట్టడంతో  తడాఖా పై అంచనాలు లేకుండా చేసింది . 

Review board: Cheruku Raja, Viswa Prasad, Shashikant.
Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Tadakha | Tadakha Wallpapers | Tadakha Videos

మరింత సమాచారం తెలుసుకోండి: