వరుణ్ తేజ్, మ్యూజిక్ ,సినిమాటోగ్రఫీ ,కొన్ని కామెడీ సీన్స్వరుణ్ తేజ్, మ్యూజిక్ ,సినిమాటోగ్రఫీ ,కొన్ని కామెడీ సీన్స్సెకండ్ హాఫ్, స్క్రీన్ ప్లే
స్పెయిన్ లో ఉన్న చై (వరుణ్ తేజ్) అక్కడకి వచ్చిన మీరా (హెబ్బా పటేల్)ను చూసి ప్రేమలో పడతాడు.. ఆమె ఉన్న ఐదు రోజులు జాలీగా గడిపిన చై మీరాకు ప్రపోజ్ చేయాలని చూస్తాడు కాని మీరా సిద్ధార్థ్ (ప్రిన్స్)ను ప్రేమిస్తున్నానని చెబుతుంది. మొదటి ప్రేమ విఫలమైన బాధలో చై ఉండగా మీరా నుండి ఫోన్ వస్తుంది. తన పెళ్లికి సిద్ధార్థ్ నో చెప్పాడని సాయం కావాలని అంటుంది. విషయం తెలుసుకున్న చై మీరా కోసం ఇండియాకు వస్తాడు. ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే మీరా వాళ్ల అన్నయ్యే పెద్ద విలన్ అవడం.. అతనే సిద్ధార్థ్ ను బెదిరించి డ్రామా నడిపిస్తాడు. ఎలాగైనా సరే మీరా ప్రేమను కలపడానికి సిద్ధమైన చై.. సిద్ధార్థ్ తల్లిదండ్రులను సేఫ్ ప్లేస్ కు చేరుస్తాడు. మరో పక్క ఈ జర్నీలో చంద్రముఖి (లావణ్య త్రిపాఠి) చైకు పరిచయమవుతుంది. పేరు అడ్రెస్ లేదంటూ పరిచయమైన చంద్రముఖి శ్రీకృష్ణ దేవరాయ వంశలో నరసింహరాయలు కూతురని తెలుస్తుంది.

తన కూతురిని చై ప్రేమించాడని నరసింహరాయలు వారు మరణ శిక్ష విధిస్తారు. కాని లక్కీగా అక్కడి నుండి తప్పిస్తాడు చంద్రముఖి సోదరుడు. ఓ పక్క మీరాని వాళ్ల అన్నయ్య తీసుకెళ్తాడు.. మళ్లీ మీరాని, చంద్ర ముఖిని తీసుకుని తాతయ్య పిచ్చయ్య నాయుడు దగ్గరకు వస్తాడు. తాతయ్య అంటే అసలు పడని చై అనుకోకుండా వచ్చి అసలు నిజం తెలుసుకుంటాడు. ఇంతకీ చై ఎవరిని ప్రేమించాడు..? మీరాను సిద్ధార్థ్ తో పంపిస్తాడా..? చంద్రముఖి చై ప్రేమ ఫలించిందా అన్నది తెర మీద చూడాల్సిందే. 

చైగా వరుణ్ తేజ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. క్యారక్టర్ పర్ఫెక్షన్ లో ఇదవరకు సినిమాలతో పోలిస్తే వరుణ్ పరిణితి చెందాడని చెప్పొచ్చు. సినిమా మొత్తం తన మీదే నడుస్తుండటంతో మంచి నటన కనబరిచాడు. మీరాగా హెబ్బా పటేల్ తన నటనతో ఇంప్రెస్ చేసింది. సినిమాలో హెబ్బా మోడ్రెన్ లుక్ లోనే కనిపించింది. ఎలాంటి వల్గారిటీకి ఆస్కారం లేకుండా చూపించారు. చంద్రముఖిగా లావణ్య త్రిపాఠి మరోసరి హాఫ్ సారీస్ లో అదరగొట్టింది. ఇలాంటి పాత్రలకు లావణ్య పర్ఫెక్ట్ అని మరోసారి ప్రూవ్ చేసుకుంది. పిచ్చయ్య నాయుడు గా నాజర్ తన నటనతో ఆకట్టుకున్నారు. థర్టీ ఇయర్స్ పృధ్వి, సత్యం రాజేష్, జబర్దస్త్ శేషులు చేసిన కామెడీ అంతగా వర్క్ అవుట్ కాలేదు కాని పర్వాలేదు అనిపిస్తుంది. నాగినీడు, మెయిన్ విలన్ పాత్రలు బాగానే డిజైన్ చేశారు కాని అవి అంతగా ఎక్స్ పోజ్ కాలేకపోయాయి.  

గోపిమోహన్ కథ రొటీన్ గానే అనిపిస్తుంది. కమర్షీయల్ సినిమాగా అన్ని కథలను కలిపి ఈ సబ్జెక్ట్ రాసుకున్నారు. శ్రీనువైట్ల డైరక్షన్ కూడా యావరేజ్ గా ఉంది. మిక్కి జె మేయర్ మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ ఇంకాస్త ట్రిం చేయాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా రిచ్ గా ఉన్నాయి. 

స్టార్ హీరోలతో వరుస ఫ్లాపులను ఎదుర్కున్న శ్రీనువైట్ల మిస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపి మోహన్ అందించిన ఈ కథ రొటీన్ గానే ఉంది. ఇక కథ ఎంత రొటీన్ అనిపించినా కథనం కాస్త కొత్తగా ఉండేలా చూడాలి. ఇక ఈ సినిమా కథనలో కూడా సాగదీత కనిపిస్తుంది. మొదటి భాగం కాస్త ఎంటర్టైన్మెంట్ మోడ్ లో నడిపించిన శ్రీనువైట్ల సెకండ్ హాఫ్ మాత్రం బోర్ కొట్టించేశాడు.

ముఖ్యంగా కృష్ణదేవరాయల ఎపిసోడ్ మాత్రం అసలు సెట్ అవలేదు. సినిమాలో చెప్పుకోదగా అంశాలు ఉంటే వరుణ్ తేజ్ సినిమా హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. సెకండ్ హాఫ్ మీద కాస్త దృష్టి పెట్టి ఉండే బాగుండేది. ఇద్దరి అమ్మాయిలను సమస్యలనుండి కాపాడటమే హీరో పనిగా పెట్టుకుంటాడు. 

మధ్యలో కామెడీ కోసం ఊపిరి పేరడిని తీసుకున్నా మొదటి భాగం మొత్తం అలా నడిచిపోతుంది. కాని ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలవుతుందో కథ ఎక్కడెక్కడికో వెళ్తుంది. కచ్చితంగా రెండు మూడు సినిమాలు చూసిన అనుభవం రాక తప్పదు. ఆర్టిస్ట్స్ పర్ఫార్మెన్స్ వరకు బాగుంది. కాని శ్రీనువైట్ల డైరక్షన్ మాత్రం మరోసారి దెబ్బకొట్టింది.


ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే బాగుండేది. సినిమాలో వరుణ్ తేజ్ మాత్రం ఇరగదీశాడు. క్యారక్టరైజేషన్ లో త్వరగా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాడు. రొటీన్ గా వచ్చిన ఈ మిస్టర్ సగటు ప్రేక్షకుడికి నచ్చే అవకాశం ఉందేమో కాని సినిమాలో విషయం మాత్రం లేదు.
Varun Tej,Lavanya Tripathi,Hebah Patel,Sreenu Vaitla,Tagore Madhu,Nallamalupu Bujji,Mickey J Meyerమిస్టర్ ఇదో రొటీన్ సినిమానే..!

మరింత సమాచారం తెలుసుకోండి: