Star cast: Venkat RahulAnisha Ambrose
Producer: Neelima TirumalasettiDirector: Dayaa K

Alias Janaki - English Full Review


అలియాస్ జానకి రివ్యూ
: చిత్రకథ
 
జానకి రామ్ (వెంకట్ రాహుల్) అలియాస్ జానకి ఒక నిజాయితీ గల టీచర్ అయిన నాగబాబు కొడుకు చిన్నప్పట్టి నుండి తండ్రి అడుగుజాడల్లో పెరిగిన జానకి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగంలో చేరతాడు. ఎప్పుడు నీతిగా న్యాయంగా ఉండే జానకి హైదరాబాద్ లో ఉద్యోగంలో కూడా అలానే ఉంటాడు, ఇదిలా ఉండగా ఒకానొక కేసు విషయంలో పరిచయమయిన చైత్ర(అనీష అంబ్రోస్) తో ప్రేమలో పడతాడు. వారి ప్రేమకథ కొనసాగుతుండగా లాల్ నగర్ అనే ప్రాంతంలో ఉంటున్న ప్రజల చేత ఆ స్థలం ఖాళీ చేయించి కబ్జా చెయ్యాలని సిటీలోని పెద్ద రౌడీ వాసుదేవ్ మైసా (శత్రు)కి వ్యతిరేకంగా న్యాయబద్ధంగా ఆ స్థలం పేద ప్రజలకి చెందాలని జానకి పోరాటం మొదలు పెడతాడు, అక్కడనుండి జానకి అడ్డు తొలగించి ఆ స్థలం కబ్జా చెయ్యాలని మైసా , మైసా నుండి ఆ స్థలాన్ని కాపాడి పేదలకే అప్పగించాలని జానకి....... వీరి మధ్యలో పియదర్శిని(శ్రీ రమ్య) అనే అమ్మాయి ఎలా వచ్చింది ఆలు కథకు ప్రియదర్శిని కి గల సంబంధం ఏంటి ... ఇలా సాగుతుంది కథ, చివరికి ఎవరు గెలిచారు అన్నది తెలిసిందే, చైత్ర ఏమయ్యింది? జానకి చిత్రాల పెళ్లి అయ్యింద లేదా? ప్రియదర్శిని ఎవరు?లాంటి సందేహాలున్నా లేక ఏదయినా ట్విస్ట్ ఉంటది అని మీరు నమ్మినా మీరే తెర మీద చూసి క్లారిఫై చేసుకోండి.

అలియాస్ జానకి రివ్యూ: నటీనటుల ప్రతిభ
హీరో రాహుల్ వెంకట్ కి ఇది తొలి చిత్రం అందుకే ఏమో చెప్పుకోడానికి నవరసాలు ఉన్నా అన్ని ఒకే సినిమాలో చూపించలేను అనుకున్నాడో లేక చూపించకూడదు అనుకున్నాడో కాని చిత్రం ఆసాంతం ఒకటే ఎక్స్ప్రెషన్ మెయింటెయిన్ చేశాడు. యాక్షన్ సన్నివేశాల్లో పర్లేదు కాని రొమాంటిక్ ట్రాక్ వచ్చినప్పుడు ఆ సీరియస్ లుక్ చూసిన సగటు ప్రేక్షకుడు తలగోక్కొక మానడు. ఒక్కోసారి సన్నివేశానికి హీరో హవాభావాలకి సంభంధం లేకుండా పొయింది. ఇక హీరోయిన్ విషయానికొస్తే చాలా చిత్రాలలో లానే కథతో సంబంధంలేని పాత్ర కి అందంగా ఉండే అమ్మాయి, ఈ చిత్రంలో హీరోయిన్ నిజంగానే తెర మీద చాలా అందంగా కనిపించింది. ఇంతకుమించి ఈ అమ్మాయి గురించి కాని ఈ పాత్ర గురించి కానీ చెప్పుకోలేము. ఇక విలన్ గా నటించిన శత్రు పరవాలేధనిపించాడు. నాగబాబు, తనికెళ్ళ భరణి ఏదో ఉన్నాం అనిపించారు. ప్రియదర్శిని పాత్ర పోషించిన శ్రీరమ్య చాలా బాగా నటించింది.

అలియాస్ జానకి రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

మొదట కథ గురించి మొదలెడితే కథ హీరోదే కావడం విశేషం అనాలో లేదా విషాదం అనాలో అర్ధం కావట్లేదు మంచిని చెప్పాలి అన్న అంశాన్ని తెరకెక్కించాలన్న ఆలోచన మంచిదే కాని అందులో నేను హీరోగా నటించాలన్న ఆలోచన ఏదయితే ఉందో అక్కడే విషాదం మొదలయ్యింది. కథనం మాటలు దర్శకత్వంకి తోడుగా ఫైట్స్ మరియు సాంగ్స్ కోరియోగ్రఫీ కూడా చేసిన దయ పనితనం గురించి చెప్పాలంటే కథనం - బాగా స్లో, ఇంటర్వెల్ అయ్యాక కొద్దిసేపటికే చెప్పడానికి ఏమి లేక క్లైమాక్స్ వరకు ఏదో లాక్కొని రావాలి అన్నట్టు ఉంటాయి సన్నివేశాలు, కథనంలో వేగం లేదు, పట్టు లేదు ఇక లాజిక్ గురించి మాటల్లేవ్..... దర్శకత్వం - రాహుల్ లాంటి నటుడి నుండి ఈ మాత్రం నటన రాబట్టడమే గొప్ప విషయం అన్నట్టు కనిపిస్తుంది కాని దర్శకుడిగా ఇంకా మెరుగుపడాలి మాటలు - చిత్రంలో కొన్ని సన్నివేశాలలో సంభాషణలు బాగున్నా కొన్ని కీలక సన్నివేశాల వద్ద బాగా తేలిపోయాయి చిత్రంలో సాంకేతికంగా ఏవయినా బాగున్నాయి అని చెప్పుకోవాలంటే శ్రవణ్ అందించిన సంగీతం, సన్నివేశాలలో బలం లేకపోయినా ఈ సంగీత దర్శకుడు తన నేపధ్య సంగీతంతో కాస్తయిన బలం చేకూరేలా చూసుకున్నాడు సినిమాటోగ్రఫీ విషయంలో సుజీత్ కూడా మంచి పనితీరుని కనబరిచారు. నిర్మాణ విలువల విషయంలో నీలిమ ఎక్కడా రాజి పడలేదు.


అలియాస్ జానకి రివ్యూ: హైలెట్స్
  • చెప్పుకోగలిగినన్ని హైలైట్స్ ఈ చిత్రంలో లేవు ఆ స్థాయి కాకపోయినా ఈ కోవలో ఏదో ఒకటి చెప్పాలంటే శ్రవణ్ సంగీతం మరియు సుజీత్ సినిమాటోగ్రఫీ గురించి చెప్పుకోవచ్చు.

అలియాస్ జానకి రివ్యూ: డ్రా బాక్స్
  • రాస్తే చాలా వస్తాయి కాని టైం వేస్ట్ చెయ్యడం ఇష్టం లేదు కాబట్టి క్లుప్తంగా
  • హీరో మోనో ఎక్స్ప్రెషన్ యాక్టింగ్
  • లాజిక్ లెస్ మరియు స్లో స్క్రీన్ ప్లే
  • ఎంటర్టైన్మెంట్ మచ్చుక్కయిన లేకపోవడం (ఇవి చాలనుకుంటాను)

అలియాస్ జానకి రివ్యూ: విశ్లేషణ

మెసేజ్ లు ఇవ్వాలన్న ఆలోచన మంచిదే కాని సినిమాల విషయంలో అందరు దర్శకులు ఆలోచించాల్సింది ఒకటుంది డబ్బులిచ్చి థియేటర్ కి వచ్చి రెండు గంటల పాటు క్లాసు పీకిన్చుకునేంత ఓపిక ప్రేక్షకుడికి ఉండదు. ప్రేక్షకుడికి కావలసింది జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఈ సినిమాలో అదే మిస్ అయ్యింది పోనీ అనుకున్న కథకు న్యాయం జరిగిందా అంటే అదీ లేదు పస లేని కథనానికి కసి లేని నటన తోడయితే ఫైర్ ఉన్న కాన్సెప్ట్ కూడా నీరు గారిపోతుంది అని ఈ సినిమా చూస్తే అర్ధం అయిపోద్ది. మొదట్లో పవర్ ఫుల్ గా కనిపించిన విలన్ చివరికి వచ్చేసరికి హీరో దగ్గర ఓడిపోడం నా కర్తవ్యం అన్నట్టు లొంగిపోయాడు. అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ బాగానే రాసినా కొన్ని చోట్ల మాత్రం దారుణంగా ఉన్నాయి ఉదాహరణకు లంచాలకు బాగా అలవాటు పడ్డ తనికెళ్ళ భరణి హీరో చెప్పే "అమ్మ నాన్న...." డైలాగ్ తో మారిపోడం నాకయితే అర్ధం కాలేదు, అక్కడ హీరో చెప్పే డైలాగ్ లో తనికెళ్ళ భరణి మారిపోవల్సినంత సీన్ లేదు. పోనీ ఇది పక్కనెడితే సెకండ్ హాఫ్ మొదటి నుండి సాక్ష్యం కోసం తిరిగిన హీరో చిత్రం చివరికి వచ్చేసరికి ఆ సంగతి మర్చిపోయాడు. ఈ లాజిక్ దర్శకుడు మరిచిపోయాడా లేక ప్రేక్షకుడు మరిచిపోతాడులే అని అనుకున్నాడా అన్నది ఎవరికీ అర్ధం కాని విషయం. పవన్ కళ్యాణ్ తో పంజా నిర్మించిన నిర్మాత నీలిమ మంచి కసి ఉన్న నిర్మాత అని మరోసారి నిరూపించుకుంది నిర్మాణ విలువలు పడిపోకుండా జాగ్రత్త వహించారు కాని నటనలో విలువలు కథనంలో విలువలు పడిపోవడం గమనించినట్టు లేరు. నిజానికి ఈ చిత్రం మొదలు పెట్టినప్పుడు చేసినంత హంగామాలో సగం కూడా ఈ చిత్ర విడుదలకు చెయ్యలేదంటే నిర్మాతకి ఫలితం ముందే తెలిసినట్టు కనిపిస్తుంది పబ్లిసిటీ కూడా అంతంతమాత్రంగానే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరుని ఉపయోగిస్తున్నప్పుడు చిత్రం కూడా ఆయనలానే ఉన్నతంగా ఉండేలా జాగ్రత్త వహించాలి ఈ చిత్రంలో ఆ ఛాయలు కనపడలేదు. ఈ చిత్రాన్ని కాపాడే అంశం ఏదయినా ఉంది అంటే అది "పవనిజం" మాత్రమే మరి ఫలితం ఏంటో వేచి చూడాలి. నా సలహా అయితే ఈ చిత్రాన్ని స్కిప్ చేసేయండి లేదు నేను హార్డ్ కోర్ మెగా ఫ్యాన్ ని రాహుల్ మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో అంటారా మీ ఇష్టం ఇక..........


అలియాస్ జానకి రివ్యూ: చివరగా
అలియాస్ జానకి - అలియాస్ జాగ్రత్త
 

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Alias Janaki | Alias Janaki Wallpapers | Alias Janaki Videos

మరింత సమాచారం తెలుసుకోండి: