రవితేజ , సినిమాటోగ్రఫీ, ఎంటర్టైనింగ్రవితేజ , సినిమాటోగ్రఫీ, ఎంటర్టైనింగ్లాజిక్ లేని సీన్స్ , హీరోయిన్
రాజా (రవితేజ) చిన్న తనం నుండే అంధత్వం తో ఉంటాడు. కళ్లు ఒకటే కనిపించవు కాని ఇక మిగతా అంతా చాలా ఎజర్టిక్ గా ఉంటాడు. వాసన చూసి అన్ని పసిగట్టేస్తుంటాడు. తనకు నచ్చిన పనికోసం ఎంతదూరమైనా వెళ్లే రాజా తండ్రిని కోల్పోయిన లక్కీ (మెహెరిన్ కౌర్)కి అండగా ఉంటాడు. తన తండ్రిని చంపిన రౌడి తనని చంపకుండా పోలీసులు ఆమెను చూసుకునేందుకు స్పెషల్ టీం ను అపాయింట్ చేస్తుంది. అందులో ఎలాగోలా చాన్స్ దక్కించుకుని లక్కీ జీవితంలో ధైర్యం నింపుతాడు రాజా. విలన్ దేవరాజ్ మాత్రం లక్కీని చంపడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. చివరకు రాజా చేతిలో దేవరాజ్ చనిపోతాడు. దేవరాజ్ లక్కీని ఎందుకు చంపాలనుకున్నాడు..? రాజా లక్కీలకు ఉన్న రిలేషన్ ఏంటి అన్నది తెర మీద చూడాల్సిందే.

రాజా ది గ్రేట్ లో మరోసారి తన ఎనర్జీ లెవల్స్ చూపించాడు రవితేజ. అంధునిగా తన యాక్టింగ్ బాగుంది. అంధునిగా చేస్తున్నా తన స్టైల్ ఏమాత్రం మిస్ అవ్వలేదు. ఇక మెహెరిన్ కౌర్ కూడా బాగానే చేసింది. ప్రస్తుతం అమ్మడి లక్కీ హ్యాండ్ వల్ల ఆమె చేసిన సినిమాలన్ని సక్సెస్ అవుతున్నాయి. ప్రకాశ్ రాజ్ పాత్ర ఆకట్టుకుంది. కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి పాత్ర నవ్వులు పండించింది. రాధిక, రాజేంద్ర ప్రసాద్ ల పాత్ర ఆకట్టుకుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించారు.

సినిమా దర్శకుడు రాజా ది గ్రేట్ మొత్తం ఎంటర్టైనర్ మోడ్ లో తీర్చిదిద్దాడు. లాజిక్ లు ఏమి పట్టించుకోకుంటే సినిమా బాగానే తీశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. సాయి కార్తిక్ సాంగ్స్ ఓకే. ఎడిటింగ్ ఆకట్టుకుంది. నిర్మాణ విలువల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రాజా ది గ్రేట్ గా వచ్చిన రవితేజ మొదటి భాగం బాగా అలరించగా సెకండ్ హాఫ్ అంతా ఫ్లాట్ గా నడుస్తుంది. కథ ముందే చెప్పేసినట్టు అనిపించినా కథలో దర్శకుడు చూపించిన ప్రతిభ బాగుంది. సినిమాలో హీరోయిజం అతని అంధుడైనా సరే రవితేజ ఇమేజ్ కు తగ్గట్టుగా నడిపించారు. ఇక సినిమాలో రవితేజ చిన్నప్పటి రోల్ రవితేజ కొడుకు మహాధన్ నటించడం జరిగింది.


అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. హీరో క్యారక్టర్ అంధునిగా ఉన్నా సరే హీరో క్యారక్టర్ ఎక్కడ తగ్గకుండా రాసుకున్నాడు దర్శకుడు. సినిమా కథ కథనాలు పాతవే అయినా హీరో అంధునిగా కమర్షియల్ వేలో సినిమా తీశారని చెప్పాలి. సినిమా అంతా ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యాడు అనీల్ రావిపుడి. ఇక అంధునిగా రవితేజ తను ప్రయోగాలకు సిద్ధం అన్నట్టు కనిపించాడు. యూత్ అంతా ఎంజాయ్ చేసే సినిమాగా రాజా ది గ్రేట్ మంచి ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు.


అయితే రొటీన్ కథతోనే మళ్లె హీరోకి బ్లైండ్ క్యారక్టర్ ఒకటి తగిలించి ఈ సినిమా తీశారని చెప్పొచ్చు. ముఖ్యంగా డైలాగ్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి.
Ravi Teja,Mehreen Pirzada,Anil Ravipudi,Dil Raju,Sai Karthikరాజా ది గ్రేట్ రొటీన్ గా అలరించాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: