సాయి కుమార్ నటన , కోర్ట్ సీన్స్సాయి కుమార్ నటన , కోర్ట్ సీన్స్రొటీన్ గా అనిపించే కథ , మ్యూజిక్ , స్క్రీన్ ప్లే

ఎల్.ఎల్.బి పూర్తి చేసి ఊరిలో పంచాయితీ గొడవలను సమర్ధవంతంగా పరిష్కరిస్తున్న సప్తగిరి హైదరాబాద్ వెళ్లి అక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుంటారు. పెద్ద లాయర్ కావాలన్న ఉద్దేశంతో మూసి ఉన్న కేసు సప్తగిరిని ఆకర్షితుడిని చేస్తుంది. దాన్ని తిరగతోడే ప్రయత్నం చేస్తాడు. ఓ బడా బాబుని కాపాడే క్రమంలో రాజ్ పాల్ (సాయి కుమార్) కేసు అతనికి ఫేవర్ గా కొట్టించేస్తాడు. అయితే మళ్లీ తిరగతోడటంతో సప్తగిరి అనుకోని సమస్యల్లో పడతాడు. ఎవరైతే తనని నమ్ముతారో వాళ్లకే సప్తగిరి ద్రోహిగా కనిపించేలా ప్లాన్ చేస్తారు. ఇంతకీ సప్తగిరి ఈ ఇబ్బందులను ఎలా అధిగమించాడు. రాజ్ పాల్ మీద ఆ కేస్ ఎలా గెలిచాడు అన్నది అసలు కథ. 

సప్తగిరి ఎక్స్ ప్రెస్ కు ఎల్.ఎల్.బికి సప్తగిరి నటనలో పరిణితి వచ్చింది. హీరోగా ఇమేజ్ పెంచుకునే ప్రయత్నంలో కామెడీతో పాటుగా మాస్, ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ కు అంత ప్రాధ్యాన్యత ఉన్నట్టు అనిపించదు. సినిమాలో సాయి కుమార్ కూడా ప్రధాన పాత్ర చేశాడు. సప్తగిరికి పోటీగా ఆయన పాత్ర సాగుతుంది. ఇక హరి ప్రసాద్ కూడా తన సహజ నటనతో మెప్పించాడు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

జాలీ ఎల్.ఎల్.బి కథను దర్శకుడు చరణ్ తెలుగులో ఓ కమర్షియల్ సినిమాకు తగినట్టుగా బాగా డీల్ చేశాడు. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు ఆకట్టుకున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు వినడానికి మాములుగా ఉన్నాయి. ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

అక్షయ్ కుమార్ చేసిన జాలీ ఎల్.ఎల్.బి సినిమాను తెలుగులో సప్తగిరి చేయడం షాకింగ్ అని చెప్పొచ్చు. అయితే బాలీవుడ్ లో ఈ సినిమా సున్నితమైన భావోద్వేగాలతో వెళ్తుంది. అయితే సప్తగిరి సినిమా అనగానే ఉండాల్సిన కామెడీ.. ఇక సినిమా కోసం కొన్ని కమర్షియల్ అంశాలను యాడ్ చేశారు. చివరి 20 నిమిషాల్లో సప్తగిరి, సాయి కుమార్ పోటా పోటీగా నటించి మెప్పించారు.

సినిమా మొత్తం సప్తగిరి కామెడీ టైమింగ్ తో నడుస్తుంది. ఇక ఎప్పుడైతే సాయి కుమార్ పాత్ర ఎంటర్ అవుతుందో అప్పుడు సినిమాలో వేగం పెరుగుతుంది. సినిమా రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లానే అనిపించినా అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. సాధ్యమైనంతవరకు ఎంటర్టైనింగ్ యాస్పెక్ట్ లో తెరకెక్కించారు. అయితే కథ తెలిసినది కావడం వల్ల ప్రేక్షకుడు త్రిల్ ఫీల్ అయ్యే అవకాశం ఉండదు. 

సప్తగిరి ఎక్స్ ప్రెస్ తో పర్వాలేదు అనిపించుకున్న సప్తగిరి ఈ సినిమాలో మాస్ కమర్షియల్ అంశాలతో ఈ సినిమా తెరకెక్కించారు. అయితే సినిమా కథనం ఆకర్షణగా సాగిందని చెప్పలేం. మాస్ ప్రేక్షకుల కోసం ఈ సినిమా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. 
Sapthagiri,Kashish Vohra,Charan Lakkaakula,Dr. K. Ravi Kirane,Vijay Bulganinసప్తగిరి ఎల్.ఎల్.బి.. ఫెయిల్యూర్ అటెంప్ట్

మరింత సమాచారం తెలుసుకోండి: