తేజ్ డ్యాన్స్ ,ప్రొడక్షన్ వాల్యూస్ , కెమెరా వర్క్తేజ్ డ్యాన్స్ ,ప్రొడక్షన్ వాల్యూస్ , కెమెరా వర్క్కథ, కథనం, రొటీన్ డ్రామా, మ్యూజిక్

అనాథలను ఆదుకుంటూ నడిపించే సాఫ్ట్ వేర్ కంపెనీ అయినా ప్రజలకు మేలు చేసే నంద కిశోర్ కంపెనీ మీద కన్నేస్తాడు విక్కీ భాయ్ (రాహుల్ దేవ్). అనుమానాస్పదంగా నంద కిశోర్ చనిపోతాడు. ఇక తేజాగా ఉన్న హీరో ధర్మాన్ని కాపాడేందుకు ధర్మా భాయ్ గా మారుతాడు. రాహుల్ దేవ్ కు సపోర్ట్ గా ఉన్న మినిస్టర్ కూడా నంద కిశోర్ చావుకి కారణమని తెలుస్తుంది. ఇంతకీ ధర్మా భాయ్ అలియాస్ తేజా వారికి ఎలా బుద్ది చెప్పాడు..? నందకిశోర్ ను చంపిన వారిని ఏం చేశాడు అన్నది సినిమా కథ. 

సాయి ధరం తేజ్ ఎనర్జిటిక్ క్యారక్టరే కాని సినిమా కథలో దమ్ము లేకపోవడంతో తేజ్ కూడా అంతగా ఇంప్రెస్ చేయలేదు. చేసినంతవరకు సాయి ధరం తేజ్ ఓకే అనిపించాడు. ఇక లావణ్య త్రిపాఠి కేవలం పాటలకే అన్నట్టు ఉంటుంది. తన కెరియర్ కు ఏమాత్రం ఉపయోగపడని సినిమా ఇది. రాహుల్ దేవి విలనిజం ఓకే. దేవి గిల్, వినీత్ కుమార్ లు పర్వాలేదు అనిపించారు. పోలీస్ పాత్రల్లో షియాజి షిండే, ఆశిష్ విద్యార్ధి ఎప్పటిలానే చేశారు. సప్తగిరి, రాహుల్ రామకృష్ణ, వేణు, జబర్దస్త్ వెంకీ కామెడీ అంతగా పండలేదు.

విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త జాగ్రత్త పడాల్సి ఉంది. ఆకుల శివ కథ అసలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇలాంటి కథలు ఇప్పటికి తెలుగులో వందల సినిమాలు వచ్చాయి. తమన్ మ్యూజిక్ కూడా ఆకట్టుకోలేదు. కథనంలో దర్శకుడు వినాయక్ ఏమాత్రం కొత్తదనం చూపించలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కాని అందుకు తగ్గ కథ కథనాలు లేకపోవడంతో ఫెయిల్యూర్ అటెంప్ట్ అని చెప్పొచ్చు.
ఖైది నంబర్ 150 తర్వాత వినాయక్ డైరక్షన్ లో వచ్చిన ఇంటిలిజెంట్ ఏమాత్రం ఆకట్టుకోలేదు. కథ కథనాల్లో దర్శకుడి విఫలమయ్యాడు. ఆకుల శివ కథ బోరింగ్ కథ అందించాడు. కథనం కూడా రొటీన్ పంథాలో సాగుతుంది. కొత్తగా ఎక్కడ అనిపించదు. సమాజానికి సేవ చేద్దాం అనుకున్న ఓ గొప్ప మనిషి హీరోని చేరదీయడం. అతన్ని తన దగ్గర ఉంచుకుని పెద్దవాడిని చేయడం. ఈలోగా ఆ పెద్ద మనిషిని విలన్ లు టార్గెట్ చేస్తే హీరో కాపాడటం ఎన్నో సినిమాల్లో చూశాం.

సేం టూ సేం అలాంటి కథతోనే ఇంటిలిజెంట్ వచ్చింది. సినిమా నడుస్తున్నంత సేపు ఇంకా ఏమైనా ఉంటుందేమో అనుకునేలోపు సినిమా అయిపోతుంది. వినాయక్ మార్క్ సినిమా ఏమాత్రం కాని సినిమా ఇంటిలిజెంట్ అని చెప్పొచ్చు. సాయి ధరం తేజ్ కూడా ఇలానే రెండు మూడు సినిమాలు చేస్తే కచ్చితంగా కెరియర్ సంక్షోభంలో పడక తప్పదు.

ఏమాత్రం కొత్తదనం లేని కథ.. కథనాలతో వినాయక్, తేజ్ కలిసి చేసిన ఈ ఇంటిలిజెంట్ మూవీ అనవసర ప్రయాస అని చెప్పొచ్చు. ఈ కథను కళ్యాణ్ ఎలా నమ్మి సినిమాగా తీశారో తెలియదు.
Sai Dharam Tej,Lavanya Tripathi,VV Vinayak,C Kalyan,SS Thamanఇంటిలిజెంట్.. వినాయక్, తేజ్ ల విఫల ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: