తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు మంచు మోహన్ బాబు.  కెరీర్ బిగినింగ్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని  సాంఘీకం, జాన‌ప‌దం, చారిత్రాత్మ‌కం, పౌరాణికం ఇలా ఎలాంటి చిత్రమైన సరే తన పాత్రలో లీనమైపోయి నటించే వారు. అలనాటి అగ్రనటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లే కాదు తమిళ నటులు శివాజీ గణేష్ తో కలిసి నటించి మెప్పించారు.  కేవలం నటుడిగానే కాకుండా విద్యావేత్త, రాజకీయ నాయకుడిగా ప్రజల మనసు దోచారు. ప్రస్తుతం మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ లతో పాటు ఆయన కూతురు మంచు లక్ష్మి కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. 
Related image
ఇక ‘ఆ నలుగురు’వంటి ఉత్త‌మ చిత్రంతో క‌థా ర‌చ‌యిత‌గా మెప్పించి... ఆ పై ‘పెళ్ళైన కొత్తలో’, ‘గుండె ఝల్లుమంది’, ‘ప్రవరాఖ్యుడు’ వంటి విభిన్న చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు మదన్. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం  ‘గాయత్రి’.  తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్ క‌థ‌తో తెర‌కెక్కిన ఈ సినిమాలో మంచు విష్ణు, శ్రియ, అన‌సూయ‌, నిఖిలా విమ‌ల్ ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. నేడు గాయత్రి చిత్రం రిలీజ్ అయ్యింది. ఇక సినిమా విషయానికి వస్తే..మోహన్ బాబు వయసులో ఉన్నపుడు ఆయన తనయుడు ఆ పాత్రలో నటించారు.
Image result for mohan babu gayatri movie stills
నటుడిగా కొనసాగే సమయంలో తన భార్య, బిడ్డలను పోగొట్టుకుంటాడు. మంచి పోజీషన్ కి వచ్చిన తర్వాత తన కూతురు ఎవరో తెలుస్తుంది.  అప్పటికే తండ్రి అంటే ద్వేషం పెంచుకున్న కూతురు తండ్రి గురించి తెలుసుకొని దగ్గరయ్యే సమయానికి మోహన్ బాబు పోలికలతో మరో వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు.  తన కూతురు ని చంపాలనుకుంటున్న మరో మోహన్ బాబు నుంచి కూతురు ని కాపాడుకుంటాడా లేదా అనేది చిత్రకథ. ఇక శివాజీగా ఒక పాత్రలో సౌమ్యూడిగా కనిపించిన మోహన్ బాబు, గాయత్రి పటేల్ పాత్రలో విలనీజం చూపించాడు. 
Image result
దాస‌రి శివాజీ, గాయ‌త్రీ ప‌టేల్‌.. ఇలా రెండు విభిన్న పాత్ర‌ల్లో మోహ‌న్ బాబు క‌నిపించారు. అయితే.. ఆయ‌న మార్క్ న‌ట‌న క‌నిపించేది కేవ‌లం గాయ‌త్రీ ప‌టేల్ పాత్ర‌లోనే. ఆ పాత్రలో ఆయ‌న లుక్‌, డైలాగ్స్ బాగున్నాయి. ఆయ‌న కూతురిగా న‌టించిన నిఖిలా విమ‌ల్ న‌ట‌న అంతంత మాత్ర‌మే. టీవీ జ‌ర్న‌లిస్ట్ శ్రేష్ఠ పాత్ర‌లో అన‌సూయ మెప్పిస్తుంది.

ఇక  శివాజీ యంగ్ వెర్ష‌న్‌గా విష్ణు, అత‌ని భార్య శార‌ద‌గా శ్రియ నాట్ బ్యాడ్ అనిపించుకున్నారు. ఇక‌, నేప‌థ్య సంగీతం అయితే ఎక్క‌డా మెప్పించ‌క‌పోయింది. స‌ర్వేష్ మురారి ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. ఎడిటింగ్ మ‌రింత క్రిస్పీగా ఉండాల్సింది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. అయితే ఈ సినిమా పై కొన్ని చోట్ల పాజిటీవ్, నెగిటీవ్ టాక్ వచ్చింది. ఏది ఏమైనా సినిమా హిట్టా ఫట్టా అన్న విషయం రేపటితో తెలిసిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: