తరుణ్ ,సినిమాటోగ్రఫీ ,బి.జి.ఎంతరుణ్ ,సినిమాటోగ్రఫీ ,బి.జి.ఎంరొటీన్ స్టోరీ ,ల్యాగ్ అవడం, స్క్రీన్ ప్లే

ఆల్రెడీ లవ్ లో ఫెయిల్ అయిన అభిరాం (తరుణ్) సోదరి సలహా మేరకు తన కాబోయే బావ దగ్గరకు వెళ్తాడు. అయితే అక్కడ డాక్టర్ శృతి (ఓవియా)గా పరిచయం అవుతుంది. ఆమెతో మాట్లాడుతూ ఆమెతో గడిచిన ఒకరోజులోనే ప్రేమలో పడతాడు. ఇక అభిరాం తన ప్రేమను వ్యక్తపరచే క్రమంలో అతనికి షాక్ ఇస్తుంది శృతి. అసలు ఆమె శృటి కాదని.. ఆమెలా అభిరాం ను ఆడుకుంటుందని తెలుసుకుంటాడు. అయినా సరే ఆమెను ప్రేమిస్తాడు. ఇంతకీ అభిరాం లవ్ సక్సెస్ అయ్యిందా..? అభిరాం తన ప్రేమికురాలిని దక్కించుకున్నాడా అన్నది సినిమా కథ.

తరుణ్ నటన ఎప్పటిలానే అలరించింది. లవర్ బోయ్ ఇమేజ్ ను తిరిగ్ తెచ్చుకునే క్రమంలో తరుణ్ ఓ మంచి ప్రయత్నమే చేశాడు. ఇక ఓవియా కూడా ఆకట్టుకుంది. కోలీవుడ్ బిగ్ బాస్ తో ఆమె అందరికి సుపరిచితురాలైంది. తరుణ్, ఓవియాల జంట బాగుంది. సినిమా మొత్తం ఈ ఇద్దరి పాత్రల మీదే నడుస్తుంది. లీడ్ పెయిర్ బాగానే అలరించారు.

జోసెఫ్ సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. శ్రీనాథ్ విజయ్ మ్యూజిక్ పర్వాలేదు. రమేష్ గోపి డైరక్షన్ పర్వాలేదు. అయితే కథ సింపుల్ గా ఉన్నా కథనం ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

ఇది నా లవ్ స్టోరీ.. రొటీన్ కథ.. కథనం కూడా నెమ్మదిగా సాగుతుంది. సినిమా మొత్తం లీడ్ కాస్టింగ్ అయిన హీరో.. హీరోయిన్ మీదే నడుస్తుంది. సినిమా అంతా తరుణ్ బాగానే చేశాడు. అయితే కథనంలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటే బాగుండేది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకోలేదు. లవ్ స్టోరీ అంటే లవ్ అండ్ ఎమోషన్స్ మీద సీన్స్ బాగా రాసుకోవాలి.

అయితే సినిమాలో డైలాగ్స్ కాస్త బాగా రాసుకున్నారు. మొదటి భాగం ఇంట్రెస్టింగ్ గా సాగగా సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్టు అవుతుంది. తరుణ్ నటనకు మంచి మార్కులే పడతాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా వచ్చిన తరుణ్ ఇది నా లవ్ స్టోరీ అంచనాలను అందుకోలేదు. 

కథ, కథనంలో సినిమా టైంపాస్ గా సాగుతుంది కాని అంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టస్ ఏమి ఉండవు. ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయని అనిపిస్తుంది. అయితే హీరో ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ చెప్పేప్పుడు వేరే పాత్రలు కాకుండా లీడ్ హీరో, హీరోయిన్ నే ఊహించుకోవడం కాస్త బాగుంటుంది.
Tarun,Oviya,Ramesh Gopi,SV Prakash,Srinath Vijayఇది నా లవ్ స్టోరీ.. తరుణ్ ప్రయత్నం ఫలించలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: