స్టార్ కాస్ట్ అండ్ పర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్స్టార్ కాస్ట్ అండ్ పర్ఫార్మెన్స్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ వాల్యూస్అందరికి నచ్చకపోవచ్చు , మాస్ ఆడియెన్స్ కాస్త కష్టం
జీవితం మీద విరక్తితో ఉండే కాలి (కాజల్ అగర్వాల్), ఎలాగైనా టైం మిషన్ కనిపెట్టి అమ్మా నాన్నలను కనిపెట్టాలని శివ (శ్రీని అవసరాల), ప్రేమించిన వ్యక్తిని పరిచయం చేసేందుకు వచ్చిన రాధా (ఈషా రెబ్బ), ఆమెను పెళ్లిచేసుకోవాలని వచ్చిన కృష్ణ వేణి (నిత్యా మీనన్).. హోటల్ లో చెఫ్ గా వచ్చిన నలభీమ (ప్రియదర్శి), అందులో పనిచేసే మీరా (రెజినా), మ్యుజిషియన్ యోగి (మురళి శర్మ). వీరందరు తమ పనులు తాము చేసుకుంటారు. ఫైనల్ గా ఈ అందరు ఏం చేశారు. అసలు వీరంతా ఎవరు..? ఒకరి మీద మరొకరి ఇంపాక్ట్ ఎలా ఉంది..? సినిమాలో అసలు ట్విస్టులు ఏంటి అన్నది అసలు కథ. 
కాజల్, రెజినా, నిత్యా, ఈషా రెబ్బ, శ్రీని, ప్రియదర్శి, మురళి శర్మ ఇలా అందరు తమ పాత్రలకు పర్ఫెక్ట్ గా చేశారు. కొత్తగా అనిపించే పాత్రల్లో ఇంకా కొత్తగా కనిపించారు వీరందరు. సినిమాలో ప్రతి పాత్ర దానికి తగిన స్కోప్ దొరికింది. నాని, రవితేజ వాయిస్ ఓవర్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. 
కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు పర్ఫెక్ట్ కెమెరా వర్క్ కుదిరింది. ఇక సినిమాలో మార్క్ కె. రాబిన్ మ్యూజిక్ అలరించింది. ఈ సినిమాకు గౌతం నెరసు ఎడిటింగ్ బాగా కుదిరింది. అయితే అక్కడక్కడ కాస్త స్క్రీన్ ప్లే కన్ ఫ్యూజ్ అయినట్టు అవుతుంది. ప్రశాంత్ వర్మ కథ, కథనాలు సినిమా బలాలు.. అయితే కథ బాగున్నా కథనంలో కాస్త కన్ ఫ్యూజ్ అయ్యేలా చేశారు. నాని ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. నిర్మాణంలో ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా చూసుకున్నాడు.
నాని నిర్మాతగా ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో కొత్త ప్రయత్నంగా వచ్చిన సినిమా అ!. కథ, కథనం అంతా కొత్త పంథాలో సాగగా.. కథనం మాత్రం కాస్త కన్ ఫ్యూజ్ చేసి చూపారని చెప్పొచ్చు. అయితే మల్టీప్లెక్స్ ఆడియెన్స్ కు సినిమా బాగా ఎక్కుతుంది. చెప్పాలనుకున్న కథను పర్ఫెక్ట్ గా చెప్పాడు డైరక్టర్. అయితే కథనంలో కొంత క్లారిటీ మిస్ అయ్యింది. 


సినిమా అంతా ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ఊహాజనితమైన కథలు, సినిమాలు చూసి విసుగు చెందినా ఆడియెన్స్ కు ఇది కొత్తగా అనిపిస్తుంది. అయితే అన్ని పాత్రలు వాటి స్వభావాలు ఆడియెన్స్ ను కొంత ఆశ్చర్యానికి గురి చేసినా ఫైనల్ గా వచ్చే ట్విస్ట్ ను జడ్జ్ చేసేందుకు టైం తీసుకుంటాడు. రెగ్యులర్ అండ్ రొటీన్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టిన ఆడియెన్స్ కు ఈ సినిమా కచ్చితంగా స్పెషల్ గా అనిపిస్తుంది.   


అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. మురళి శర్మ కొన్ని సీన్స్ కాస్త బోర్ అనిపిస్తాయి. కాజల్, రెజినాలు సినిమాకు ఎక్కువ ప్రాధాన్యత కలిగిన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓవరాల్ గా సినిమా అంతా డిఫరెంట్ మూవీ.. డిఫరెంట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. అయితే బి, సి సెంటర్స్ లో మాత్రం ఈ సినిమా కష్టమే అని చెప్పొచ్చు.  
Kajal Aggarwal,Nithya Menen,Regina Cassandra,Eesha Rebba,Srinivas Avasarala,Prasanth Varma,Nani,Prashanti Tipirneni,Mark K Robinనాని అ!.. నిజంగానే 'అ!'శ్చర్యపరచాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: