శ్రీకాంత్ , ప్రొడక్షన్ వాల్యూస్శ్రీకాంత్ , ప్రొడక్షన్ వాల్యూస్స్క్రీన్ ప్లే ,మ్యూజిక్ ,లాజిక్ లేకపోవడం

గొప్ప దర్శకుడి కొడుకైన రాజ్ కిరణ్ (శ్రీకాంత్) తండ్రి అంత గొప్ప దర్శకుడిగా కావాలనుకుంటాడు. తండ్రి చనిపోయాక తల్లిని కాపాడుకునేందుకు ఓ హిట్ సినిమా తీసి ఆమె సంతోషానికి కారణం అవ్వాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అతను ఓ బంగ్లాలో సినిమా తీసేందుకు వెళ్తాడు. అక్కడ రాజ్ కిరణ్ కు అనుకోని సమస్యలు ఎదురవుతాయి. హిట్ సినిమా తీసేందుకు రాజ్ కిరణ్ పడిన కష్టాలేంటి..? దీయ్యాలతో రాజ్ కిరణ్ ఎలా ఇబ్బంది పడ్డాడు..? చివరకు కథ ఎలా ముసింది అన్నదే సినిమా.  

సీనియర్ హీరోగా శ్రీకాంత్ ఈ సినిమా ఓ కొత్త ప్రయత్నంగా చేశాడు. అయితే నటనలో తనకు తాను న్యాయం చేసినా సినిమాలో అంత మ్యాటర్ లేకపోయేసరికి ఇంప్రెసివ్ గా అనిపించదు. హీరోయిన్స్ నజియా, సీతా నారాయణలు పర్వాలేదు అనిపించారు. ఇక కమెడియన్స్ బాగానే ఉన్నా సినిమా రొటీన్ కామెడీతో నడిచింది.  

శంకర్ స్టోరీ, స్క్రీన్ ప్లే ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెసివ్ గా అనిపించదు. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. సినిమా అంతా ఎక్కువ శాతం బంగ్లాలో తీశారు. నిర్మాణ వ్యయం కూడా తక్కువే అనిపిస్తుంది.
కథ, కథనాలన్ని రొటీన్ గా అనిపించడమే కాకుండా బోర్ కొట్టించేస్తాయి. సినిమా ఓపెనింగ్ కాస్త ఇంట్రెస్టింగ్ గా సాగిందని అనిపించినా రాను రాను రొటీన్ గా నడుస్తుందని అనిపిస్తుంది. ఏమాత్రక్ ఆకట్టుకోలేని కథనంతో సినిమా నడుస్తుంది. కథ కూడా ఇదవరకు వచ్చిన రెగ్యులర్ హర్రర్ కామెడీ నేపథ్యంలోనే సాగుతుంది.

అటెంప్ట్ బాగానే అనిపించినా సినిమా స్క్రీన్ ప్లే బాగా మైనస్ అయ్యింది. దర్శకుడు అన్నివిధాలుగా సినిమాకు న్యాయం చేయలేకపోయాడు. సినిమాకు కావాల్సిన ఫీల్ తీసుకురావడంలో ఫెయిల్ అయ్యాడు. దెయ్యాలు మనుషులను చూసి భయపడటం.. ఇక కమెడియన్స్ కేకలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో భయన్ని కలిగించడం ఇదవరకే చాలా సినిమాల్లో చూశాం. 

ఫైనల్ గా అతను చెప్పాలనుకున్న నోట్ బాగానే అనిపించినా సినిమాగా చెప్పడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. హర్రర్ ప్రియులకు ట్రైలర్, టీజర్ తో ఇంప్రెస్ చేసిన రా..రా సినిమా మాత్రం నిరాశ పరస్తుంది.



Srikanth,Naziya,Shankar,M Vijay,Rap Rock Shakeelశ్రీకాంత్ రా.. రా.. మరో విఫల ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: