టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఒకరకంగా చెప్పాలంటే..టాలీవుడ్ లో ఫైటింగ్స్ అంటే ఇలా ఉండాలి..జేమ్స్ బాండ్, సీఐడీ తరహా సినిమాలకు ఆధ్యం పోశారు సూపర్ స్టార్ కృష్ణ.  అంతే కాదు అప్పట్లో ఈస్ట్ మాన్ కలర్ లో అల్లూరి సీతారామరాజు సినిమాతో ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేశారు.  అప్పట్లో కృష్ణ ఒకే సంవత్సరంలో దాదాపు పది సినిమాలకు పైగా నటించే వారని..ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లకు ధీటుగా నిలబడ్డారు. 
Image result for భరత్ అనే నేను
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మంచి ఫామ్ లో ఉన్నారు.  కృష్ణ నట వారసులుగా రమేష్ బాబు, మహేష్ బాబు లు హీరోగా ఎంట్రీ ఇచ్చినా..రమేష్ బాబు నిర్మాణరంగం వైపు వెళ్లగా..మహేష్ బాబు మాత్రం హీరోగా కొనసాగుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
Related image
ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి.. అంతకు మించిన ఎమోషనల్ మూమెంట్ మహేష్ బాబుకి మరొకటి ఉంది. నేడు ఆయన తల్లి ఇందిరాదేవి జయంతి నేడు. భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే మహేష్ బాబు ఈ విషయాన్ని వెల్లడించాడు.  భరత్ అనే నేను  సినిమా తనకు చాలా ప్రత్యేకమని ఎందుకంటే ఈ సినిమా తన తల్లి జన్మదినం రోజున విడుదల కాబోతోందని తెలిపాడు.
Image result for భరత్ అనే నేను
తాజగా మహేష్ బాబు తన తల్లి ఇందిరా దేవి యంగ్ గా ఉన్నప్పటి అపురూపమైన ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. హ్యాపీ బర్త్ డే అమ్మా అంటూ కామెంట్ పెట్టాడు.కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను  సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సర్వత్రా పాజిటివ్ బజ్ తో ఈ  సినిమా విడుదలవుతోంది. వీరి కాంబినషల్ లో ఇప్పటికే శ్రీమంతుడు వంటి బ్లాక్ బాస్టర్  సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: