నాగార్జున, టేకింగ్ ,సెంటిమెంట్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్నాగార్జున, టేకింగ్ ,సెంటిమెంట్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్మిస్సింగ్ ఎంటర్టైన్మెంట్, స్క్రీన్ ప్లే, రొటీన్ స్టోరీ
సిన్సియర్ పోలీస్ గా ముంబైలో మాఫియాను రూపుమాపేసిన నారాయణ పసారి తన లోపల మాత్రం తన స్వలాభం కోసం కొందరిని చంపేస్తాడు. అయితే అది ఫేక్ ఎంకౌంటర్ అని తేలగా దాని మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసేందుకు హైదరాబాద్ నుండి ఐపిఎస్ ఆఫీసర్ శివాజి రావు (నాగార్జున)ను ముంబైకి బదిలీ చేస్తారు. ముందు పసారి మంచి పోలీస్ అనుకున్న శివాజి రావు తన ఇన్వెస్టిగేషన్ లో కొన్ని నిజాలు తెలుసుకుంటాడు. ఇక శివాజి కదలికలు కనిపెట్టిన నారాయణ పసారి మళ్లీ తానే ఓ కంపెనీ స్టార్ట్ చేసి ముంబైలో మాఫియా అలజడలను సృష్టిస్తాడు. దాన్ని అరికట్టేందుకు పసారినే ప్రభుత్వం నియమిస్తుంది. సో పసారి ఏర్పాటు చేసిన కంపెనీని నాశనం చేసేందుకు శివాజి ఏం చేశాడు అన్నది సినిమా కథ.

నాగర్జున శివాజి రావుగా పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టాడు. స్క్రీన్ ప్రెజెన్స్ లో నాగార్జున స్టైలే వేరు అన్నట్టుగా సినిమాలో చాలా గ్లామర్ గా కనిపించారు. శివ టైంలో నాగార్జునకి, ఇప్పటికి కాస్త లావెక్కాడే తప్ప మిగతా అంతా సేమ్ అనిపిస్తుంది. ఇక హీరోయిన్ మైరా సరైన్ బాగానే చేసింది. విలన్ పసారి పాత్రలో నటించిన వ్యక్తి కూడా బాగా చేశాడు. అజయ్, షియాజి షిండే పాత్రలు అలరించాయి. సినిమాలో పాప పాత్ర కూడా ఆకట్టుకుంటుంది.

భరత్ వ్యాస్ సినిమాటోగ్రఫీ బాగుంది. వర్మ టేకింగ్ కు అనుగుణంగా కెమెరా వర్క్ ఉంది. ఇక కథ పాతదే అయినా కథనం పర్వాలేదు అన్నట్టు తీశాడు. అయితే సినిమా ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. రవి శంకర్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ వరకు ఒకే. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత గొప్పగా ఏమి లేవు. రెగ్యులర్ ఆర్జివి సినిమాలకు తగినట్టుగానే ఉంది.
శివ, గోవింద గోవింద తర్వాత వర్మ డైరక్షన్ లో నాగార్జున మూవీ అనగానే పాఇకేళ్ల తర్వాత కాంబో కాబట్టి ఎలాంటి సినిమా తీస్తారో అని ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మాత్రం సినిమా అందుకోలేదని చెప్పొచ్చు. కథ పరంగా రెగ్యులర్ సినిమాల కథల్లానే అనిపించినా కథనమైనా కాస్త కొత్తగా తీస్తే బాగుండేది.

కొన్ని సీన్స్ బాగున్నాయి అనిపిస్తుంది. సినిమా కథ మొత్తం కేవలం హీరో విలన్ మధ్య తిరగడం అన్నది ఇంట్రెస్టింగ్ గా సాగితే బాగుండేది కాని అక్కడక్కడ బోర్ కొడుతుంది. 126 నిమిషాల రన్ టైం కాస్త బెటరే అనిపించినా సినిమా ఇంకా బోర్ అనిపిస్తుంది. శివ రేంజ్ లో ఊహించుకుని వచ్చిన ఆడియెన్స్ కు ఇది ఎక్కడం కాస్త కష్టమే.

టేకింగ్ పరంగా వర్మ ఓకే అనిపించుకున్నా కంటెంట్ విషయంలో ఇంకాస్త వర్క్ అవుట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. ఎంటర్టైనింగ్ విషయంలో కూడా సగటు ప్రేక్షకుడికి ఇది నిరాశ కలిగిస్తుందని చెప్పొచ్చు.
Nagarjuna,Myra Sareen,Ram Gopal Varma,Sudheer Chandra Padiri,Ravi Shankarనాగార్జున ఆఫీసర్.. అంచనాలు తారుమారయ్యాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: