ఆది పినిశెట్టి, కెమెరా వర్క్, నిర్మాణ విలువలుఆది పినిశెట్టి, కెమెరా వర్క్, నిర్మాణ విలువలుమ్యూజిక్, స్క్రీన్ ప్లే, మిస్సింగ్ ఎంటర్టైమెంట్

తానో బ్లైండ్ మ్యాన్ అయినా సరే రెస్టారెంట్ నడిపే కళ్యాణ్ (ఆది పినిశెట్టి) తన స్నేహితురాలు అను (రితిక సింగ్)ను ప్రేమిస్తాడు. సరదాగా సాగే అతని లైఫ్ లోకి వెన్నెల (తాప్సి) వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత కళ్యాణ్ లైఫ్ లో మార్పులు వస్తాయి. ఇక ఓ యాక్సిడెంట్ లో కళ్యాణ్ తన కంటిచూపు తిరిగి వస్తుంది. అయితే అప్పటిదాకా ఉన్న వెన్నెలను దూరం చేసుకుంటాడు. వెన్నెల ఎక్కడికి వెళ్లింది..? అసలు వెన్నెల ఎవరు..? తన కోసం కళ్యాణ్ ఏం చేశాడు అన్నది సినిమా కథ. 

తెలుగులో హీరోగా ప్రయత్నించి ఆ తర్వాత విలన్ అండ్ సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నాడు ఆది పినిశెట్టి. సరైనోడు, నిన్ను కోరి, అజ్ఞాతవాసి సినిమాల్లో నటించాడు ఆది పినిశెట్టి. ఇక ఇప్పుడు సోలో హీరోగా మళ్లీ మరో ప్రయత్నం చేశాడు. దర్శకుడు రాసుకున్న పాత్రకు ఆది నూటికి నూరు పాళ్లు న్యాయం చేశాడు. బ్లైండ్ గా ఆది మెప్పించాడు. తాప్సీ కూడా తన పాత్రలో అదరగొట్టింది. రితిక సింగ్ గురు తర్వాత ఈ సినిమాలో కనిపించగా అమ్మడు కూడా తన వరకు బాగానే చేసింది. జీవా, శివాజి రాజా, వెన్నెల కిశోర్ అందరు బాగానే చేశారు. 

సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేసింది. థ్రిల్లర్ కు కావాల్సిన కెమెరా వర్క్ కనబరిచాడు. అచ్చు రాజమని మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. సాంగ్స్ అంతగా ఇంప్రెస్ చేయకున్నా బిజిఎం ఆకట్టుకుంది. కథ, కథనాల్లో దర్శకుడు హరినాధ్ మంచి ప్రయత్నమే కాని మెప్పించేట్టుగా తీయలేదు. కథనం మరి ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.  

ఆది సినిమా అంటే కచ్చితంగా కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. తను సోలోగా తీసిన ఇదవరకు సినిమాలు ఆ అంచనాలను ఏర్పడేలా చేశాయి. ఇక నీవెవరో ట్రైలర్ కూడా అదేవిధంగా క్యూరియాసిటీని పెంచింది. నీవెవరో కచ్చితంగా మంచి ఎఫర్ట్ అని చెప్పొచ్చు. కాని దర్శకుడు ఎంచుకున్న కథను సీరియస్ గా కాకుండా ఎంటర్టైనింగ్ గా చెప్పాలనుకున్నాడు.

సినిమా మొదటి భాగం అంతా మంచిగా నడుస్తుంది. సెకండ్ హాఫ్ ట్రాక్ తప్పేసింది. సినిమా మూడ్ ను డిస్ట్రబ్ చేసేలా కామెడీ సీన్స్ వస్తాయి. అవి కూడా ఆశించిన స్థాయిలో ఎంటర్టైన్ చేయవు. ఇక థ్రిల్లర్ కథకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పాలి. సినిమా మొత్తం వెన్నెల పాత్ర మీద ఆధారపడి ఉంటుంది.

ఆ పాత్రని ఇంకాస్త డీటైలింగ్ ఇచ్చి ఉంటే బాగుండేది. అయినా సరే ఇదో మంచి ప్రయత్నమని చెప్పొచ్చు. నీవెవరో ఆది పినిశెట్టి మరో క్రేజీ అటెంప్ట్ అయితే థ్రిల్లర్ కాబట్టి యూత్ కు నచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించే ఆస్కారం లేదని చెప్పొచ్చు.
Aadhi Pinisetty,Taapsee,Ritika Singh,Harinath,MVV Satyanarayana,Achu & Prasan'నీవెవరో' ఆది పినిశెట్టి ప్రయత్నం ఆకట్టుకోలేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: