అల్లరి నరేష్, సునీల్ కొన్ని కామెడీ సీన్స్, సాంగ్స్అల్లరి నరేష్, సునీల్ కొన్ని కామెడీ సీన్స్, సాంగ్స్కథనం, రొటీన్ స్టోరీ, హీరోయిన్స్

ఎమ్మెల్యే జాకెట్ జానకీ రాం (జయప్రకాశ్ రెడ్డి) అనుచరులుగా ఉంటున్న వీరబాబు (అల్లరి నరేష్), సూరి బాబు (సునీల్) ఎమ్మెల్యే కోసం ఎలాంటి మోసానికైనా చేసేందుకు సిద్ధపడతారు. ఇలాంటి టైంలో ఓ ఈవెంట్ లో భాగంగా సూరిబాబు జాకెట్ పరువు కాపాడేందుకు పుష్ప (నందిని రాయ్)ను పెళ్లాడాల్సి వస్తుంది. అప్పటికే సూరిబాబు కృష్న వేణి (పూర్ణ) తో పెళ్లి కుదురుతుంది. అప్పుడు పుష్కని వదిలించుకునేందుకు జాకెట్ జానకి రాం ను ఆశ్రయిస్తాడు. ఇక మరోపక్క వీరబాబు ప్రేమించిన వాసంతి (చిత్ర శుక్లా) ఉద్యోగం కోసం జాకెట్ కు డబ్బు ఇస్తాడు.


ఇలాంటి టైంలో మినిస్టర్ చనిపోతూ జానకి రాం కు 500 కోట్లకు సంబందించిన రహస్యాన్ని చెబుతాడు. అది కనిపెట్టేందుకు భూతం (పోసాని) ఎమ్మెల్యే వెంట పడతాడు. ఈ టైంలో జానకీ రాం కు యాక్సిడెంట్ అయ్యి గతం మర్చిపోతాడు. 500 కోట్ల రహస్యం కోసం పోసాని..? తమ సమస్యల పరిష్కారం కోసం వీరబాబు, సూరి బాబులు ఎమ్మెల్యే మాములు మనిషి కావాలని కోరుకుంటారు. మరి జాకెట్ వీరి సమస్యలను ఎలా తీర్చాడు అన్నది సినిమా కథ.

అల్లరి నరేష్ ఎప్పటిలానే కామెడీ రోల్ తో ఆకట్టుకున్నాడు. సునీల్ చాలా రోజుల తర్వాత కామెడీ రోల్ తో ఆకట్టుకున్నాడు. చిత్ర శుక్ల తన పాత్రతో ఆకట్టుకోగా.. నందిని రాయ్ పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. పూర్ణ గెస్ట్ రోల్ లో అలరించింది. జయ ప్రకాశ్ రెడ్డి, పోసాని కామెడీతో నవ్వించారు.

అనీష్ తరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీ వసంత్ మ్యూజిక్ పర్వాలేదు. కథ, కథనాల్లో దర్శకుడు భీమనేని శ్రీనివాస్ రొటీన్ పంథా కొనసాగించారు. తమిళ రీమేక్ సినిమా అయినా తెలుగులో ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి.

అల్లరి నరేష్, సునీల్ కలిసి చేసిన సినిమా సిలీ ఫెలోస్. భీమనేని శ్రీనివాస్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా తమిళ సినిమా వెలైను వంధుట్ట వెల్లకారన్ సినిమాకు రీమేక్. ఆ సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్టుగా మార్చారు. ఇక ఈ సినిమా మొదటి భాగం పాత్రల పరిచయం అంతా సరదాగా తీసుకెళ్లగా సెకండ్ హాఫ్ రొటీన్ కామెడీతో ఊహాజనితమైన కథనమాలతో విసిగించారు.

ఏమాత్రం ఆకట్టుకోలేని కథ, కథనాలు ప్రేక్షకులను మెప్పించలేదు. రీమేక్ స్పెషలిస్ట్ అయిన భీమనేని డైరక్షన్ పరంగా బాగున్నా స్క్రీన్ ప్లే చాలా రొటీన్ గా నడిపించాడు. అల్లరి నరేష్ తన వరకు తాను బాగానే చేశాడు. ఈమధ్య తను చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర విఫలమవుతుంటే సుడిగాలి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా కూడా నిరాశ పరచింది.
Allari Naresh,Sunil,Chitra Shukla,Poorna,Nandini Rai,Bheemaneni Srinivasa Rao,Kiran Reddy,Bharat Chowdary,Sri Vasanthనరేష్ ను కాపాడలేకపోయిన 'సిల్లీ ఫెలోస్'..!

మరింత సమాచారం తెలుసుకోండి: