సమంత, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీసమంత, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీఅక్కడక్కడ స్లో అవడం, మిస్సింగ్ కమర్షియల్ ఎలిమెంట్స్
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టర్ గా పనిచేస్తున్న రచన (సమంత) ఆర్కే పురం యాక్సిడెంట్స్ మీద ఆసక్తి కలగడంతో కథ రాయాలనుకుంటుంది. ఈ క్రమంలో అక్కడ యూటర్న్ తీసుకున్న వ్యక్తులతో వరుసగా ఇంటర్వ్యూస్ చేస్తుంది. వారి నెంబర్ ప్లేట్ లను కూడా కలెక్ట్ చేస్తుంది. అలా ఇంటర్వ్యూ చేసిన వారిలో సుందరం ఉంటాడు. అయితే ఇంతలోనే అతను చనిపోతాడు. రచనే అతన్ని హత్య చేసి ఉంటుందని అందరు భావిస్తారు. ఎస్.ఐ నాయక్ (ఆది పినిశెట్టి) ఎంక్వైరీలో రచన ఈ మర్డర్ చేయలేదని తెలుస్తుంది. అయితే ఇంతలోగా ఆ ఫ్లై ఓవర్ మీద యూటర్న్ తీసుకున్న అందరు వరుసగా చనిపోతుంటారు. ఈ మర్డర్ మిస్టరీని ఛేధించేందుకు పోలీసులకు రచన తన సపోర్ట్ అందిస్తుంది. ఫైనల్ గా అవీ ఎందుకు జరుగుతున్నాయి.. వాటి వెనుక కారణం ఏంటన్నది మిగతా సినిమా కథ.  
యూటర్న్ సినిమా మొత్తం సమంత సింగిల్ హ్యాండ్ తో మేనేజ్ చేసిందని చెప్పొచ్చు. ఆమెలోని అన్ని యాంగిల్స్ ఈ సినిమాతో ఫుల్ గా చూపించింది. ఆది పినిశెట్టి పోలీస్ పాత్రలో బాగానే చేశాడు. సర్ ప్రైజ్ రోల్ లో భూమిక మెప్పించింది. రాహుల్ రవింద్రన్ కూడా ఆకట్టుకున్నాడు.
నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. కెమెరా వర్క్ ప్రాధాన్యతతో సినిమా సాగుతుంది. పూర్ణ చంద్ర మ్యూజిక్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మర్డర్ మిస్టరీ ఛేధించే క్రమంలో అలరించింది. సురేష్ ఎడిటింగ్ వర్క్ ఆకట్టుకుంది. ఇలాంటి సినిమాకు ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్.. ఆ విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్త పడ్డాడు. పవన్ కుమార్ కథ, కథనాలు బాగున్నాయి. అయితే సెకండ్ హాఫ్ కాస్త ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
కన్నడలో ఆల్రెడీ సూపర్ హిట్ అయిన యూటర్న్ మూవీ తెలుగు రీమేక్ గా అదే టైటిల్ తో వచ్చింది. సమంత మనసు పడి మరి చేసిన ఈ సినిమాలో ఆమె నటన మెప్పించింది. సినిమా మొత్తం సమంత భుజాల మీద వేసుకుని చేసింది. ఇక సినిమా దర్శకుడు పవన్ యూటర్న్ తో ఓ మెసేజ్ కూడా ఇచ్చాడు.


కథ కొత్తగా ఉంది.. కథనంలో మొదటి భాగం సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. అయితే సెకండ్ హాఫ్ అంత గ్రిప్పింగ్ సాధించలేదు. ప్రెడికటబుల్ గా సాగడంతో సెకండ్ హాఫ్ అంత కిక్ అనిపించదు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మళ్లీ సినిమా మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తాయి.


భూమిక సర్ ప్రైజ్ రోల్ అందరిని సర్ ప్రైజ్ చేస్తుందని చెప్పొచ్చు. సమంత, ఆది పినిశెట్టి, భూమిక సినిమాకు మంచి సపొర్ట్ గా నిలిచారు. సమంత, రాహుల్ ల లవ్ ట్రాక్ అంత మెప్పించలేదు. ఫైనల్ గా యూటర్న్ సినిమా కొత్త సినిమా ప్రియులకు నచ్చేస్తుంది. కమర్షియల్ ఎంటర్టైనర్స్ కోరుకునే వారికి నచ్చే అవకాశం ఉండదు.
Samantha Akkineni,Aadhi Pinisetty,Rahul Ravindran,Bhumika Chawla,Pawan Kumar,Srinivasa Chitturi,Rambabu Bandaru,Poorna Chandra Tejaswiయూటర్న్.. సమంత మెప్పించే ప్రయత్నం..!

మరింత సమాచారం తెలుసుకోండి: