ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను కేవలం అతడి అభిమానులు మాత్రమే కాకుండా జపాన్ దేశస్తులు కూడ జరుపుకోవడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. బాలీవుడ్ హీరోలకు ధీటుగా ప్రభాస్ కు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలలో అతడికి అభిమానులు ఉన్న విషయాన్ని నిన్న ప్రభాస్ ఇంటి వద్ద జరిగిన జపనీ దేశస్తుల హడావిడితో మరొకసారి రుజువైంది. 
మేకింగ్ వీడియోతో అదరగొట్టారు
‘బాహుబలి’ మూవీ జపాన్ లో విడుదలై అక్కడ ఘన విజయం సాధించడంతో ప్రభాస్ కు రజినీకాంత్ స్థాయిలో జపాన్ లో అభిమానులు ఏర్పడి భారీ స్థాయిలో ప్రభాస్ జన్మదినోత్సవ వేడుకలు జపాన్ లో కూడ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు హైదరాబాద్ లో ఉండే కొందరు జపాన్ దేశస్తులు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఇంటి వద్ద సందడి చేసినట్లు కూడ తెలుస్తోంది. 

ఇక సోషల్ మీడియాలో అయితే ప్రభాస్ వీరాభిమానులు తమ హీరోకు శుభాకాంక్షలు తెలియచేస్తూ చేసిన హడావిడి ఆకాశాన్ని తాకింది. అంతేకాకుండా ప్రభాస్ అభిమానులు చాలామంది మన తెలుగు రాష్ట్రాలలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి. 
శుభాకాంక్షల వెల్లువ
 ప్రభాస్ కు పుట్టినరోజు సందర్భంగా టాప్ హీరోల నుండి చిన్న హీరోల వరకు తమ శుభాకాంక్షలు తెలపడంతో ప్రభాస్ అందరివాడు అన్న మాటలు మరొకసారి నిజం అయ్యాయి. ‘బాహుబలి’ సక్సస్ లో ప్రభాస్ పాత్ర ఉన్నా ప్రభాస్ కు వచ్చిన గుర్తింపుకన్నా రాజమౌళికి వచ్చిన గుర్తింపు ఎక్కువ అన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే ‘సాహో’ విషయంలో అన్నీ తానై ప్రభాస్ వ్యవహరిస్తున్న తీరుతో ‘సాహో’ అంచనాలకు అనుగుణంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇండస్ట్రీ టాప్ పొజిషన్ కు ప్రభాస్ చేరుకుంటాడు అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: