తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో అజిత్ కుమార్.  ఏ క్యారెక్టర్ అయినా ఎంతో నేచురల్ గా నటించి మెప్పించే అజిత్ తాజాగా శివ దర్శకత్వంలో ‘విశ్వాసం’చిత్రంలో నటిస్తున్నారు.  ఈ చిత్రంలో అజిత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందినట్లు సమాచారం.

ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ లభిస్తుంది.  అంతే కాదు ఈ చిత్రంలో రెండు విభిన్నమైన పాత్రల్లో అజిత్ కనిపించబోతున్నాడు. జనవరి 10వ తేదీన ఈ సినిమాను తమిళనాట భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.
Image result for ajit viswasam
తమిళ నాట అజిత్ నటించి ప్రతి చిత్రం తెలుగు లో రిలీజ్ చేయడం తెలిసిందే..ఈ చిత్రం కూడా సంక్రాంతి బరిలో దించాలని చూసినా  తెలుగులో పెద్ద చిత్రాలతో పాటు రజినీకాంత్ నటించిన పెట్టా చిత్రం కూడా రిలీజ్ అవుతుంది.  అందుకే ఈ చిత్రాన్ని  రిపబ్లిక్ డే వీకెండ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట దర్శకనిర్మాతలు. ఈ చిత్రంలో   పవర్ఫుల్ విలన్ గా జగపతిబాబు కనిపించనున్న సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: