ఇప్పుడు తెలుగులో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది.. మహానటి హిట్ తో మరికొన్ని సినిమాలు రెడీ అయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులుగా సిద్ధమై మొదటి పార్ట్ ఆల్రెడీ విడుదలైంది. ఇక వైఎస్సార్ యాత్ర కూడా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఈ బయోపిక్ ట్రెండ్ ను కొందరు క్యాష్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related image


సినీ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించిన శ్రీరెడ్డి బయోపిక్ కూడా సిద్ధమవుతోందట. రవి దేవన్ అనే నిర్మాత ఈ సినిమా తీస్తున్నారట. దర్శకుడు అల్లాద్దీన్.. శ్రీరెడ్డి జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘటనలు తీసుకుని ఈ కథ తయారు చేసుకున్నారట.

Image result for sri reddy images


సినీ ఇండస్ట్రీలోని లైంగిక దోపిడీని కూడా హైలెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ చిత్రంలో దగ్గుబాటి అభిరామ్ పాత్ర కూడా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినీ వారసుడి గురించి ఆ మధ్య శ్రీరెడ్డి హడావిడి చేసిన సంగతి తెలిసిందే.

Image result for sri reddy images


కానీ శ్రీరెడ్డి ఏం చేసిందని.. ఆమె బయోపిక్ తీస్తున్నారంటున్నారు కొందరు సినీ అభిమానులు. బట్టలు విప్పి రోడ్డు మీద కూర్చోవడం తప్ప.. ఆమె ఏం సాధించిందంటున్నారు. కానీ.. బయోపిక్ అంటే ఏదైనా సాధిస్తేనే తీయాలనే రూల్ ఏముందంటున్నారు ఈ చిత్రం నిర్మాతలు. మరి ఈ సినిమా ఎన్ని సంచలనాలకు దారి తీస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: