ఈ మద్య వరుసగా సినీ, రాజకీయ, క్రీడా నేపథ్యంలో బయోపిక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే.  తెలుగులో మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, బాలీవుడ్ లో సంజు సినీ నేపథ్యంలో రూపొందాయి.  మహానాయకుడు,యాత్ర, థాకరే మరికొన్ని సినిమాలు రాజకీయ నేపథ్యంలో రూపొందాయి.  త్వరలో ప్రధాని మోదీ జీవిత కథ నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతుంది.  టాలీవుడ్, బాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’రూపొందించారు.   
Image result for laxmi ntr
ఈ సినిమా మొదలు పెట్టినప్పటి ప్రతి విషయంలనూ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వస్తున్నాడు వర్మ.  ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎలా ప్రవేశించింది..ఆ తర్వాత ఆయన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు..జరిగిన కుట్రల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందని వర్మ అంటున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో సందడి చేశాడు.  వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా..వాయిదాలు పడుతూ వస్తుంది. 
Image result for laxmi ntr
ఒకదశలో ఈ సినిమా ఆపివేయాలని టీడీపీ శ్రేణులు విఫల యత్నం చేశారు.   తాజాగా  లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల మరోమారు వాయిదా పడింది.  ఎన్నికల ముందు సినిమా విడుదలను ఒప్పుకునేది లేదని, ఓటర్లపై ఈ సినిమా ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటూ సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వర్మ కోర్టు కెళ్తానని ప్రకటించాడు.  సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నాడు. అయితే, సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు.

ఈ నెల 22న సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదని ఓ నిర్ణయానికి వచ్చిన వర్మ 29న విడుదల చేయాలని నిర్ణయించాడు. ఇందులో అభ్యంతరకరంగా ఉన్న సీన్లు, సంభాషణలు తొలగించి రీ స్క్రీన్ చేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ కారణంతోనే సినిమా వాయిదా వేస్తున్నట్లు వర్మ ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: