నిన్న పవన్ కళ్యాణ్ గాజువాక అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తూ దాఖలు చేసిన తన వ్యక్తిగత ఎఫడబిట్ లో కొన్ని ఆశ్చర్యకర విషయాలు ఉన్నట్లుగా గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. సాధారణంగా ఎన్నికలలో పోటీ చేసే చాలామంది ప్రముఖులు తమకు సొంత కారు ఇల్లు కూడ లేదు అంటూ తాము దాఖలు చేసే ఎఫడవిట్ లో పేర్కొంటూ ఉంటారు. 
ఇలా చేశారేంటి పవన్ సర్?
విలువైన సాంప్రదాయాలు రాజకీయాలలో నైతిక విలువలు కోసం రాజకీయాలలోకి వచ్చాను అని చెప్పే పవన్ కళ్యాణ్ కూడ తన ఎఫడవిట్ లో కొన్ని ఆశ్చర్యకర విషయాలను పేర్కొన్నట్లు తెలుస్తోంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అత్యంత భారీ పారితోషికం తీసుకుంటూ పవర్ స్టార్ గా కొనసాగుతున్న పవన్ 2016-2017 లో 15.28 కోట్ల ఇన్ కమ్ ట్యాక్స్ కడితే అలాంటి వ్యక్తి తనకు ప్రస్తుతం 33 కోట్ల అప్పులు ఉన్నట్లు ప్రకటించడం షాకింగ్ న్యూస్ గా మారింది.  
జగన్, లోకేష్‌ను ఎలా విమర్శిస్తారు?
పవన్ కళ్యాణ్ కు అప్పులు ఇచ్చిన రుణదాతల లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ చిరంజీవి భార్య సురేఖ పవన్ తో ‘అత్తారింటికి దారేది’ సినిమాను తీసిన బివిఎస్ఎన్ ప్రసాద్ ఇలా అనేకమంది ఉన్నట్లు వార్తలు రావడం మరింత ఆశ్చర్యకరంగా మారింది. లక్ష పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానం సంపాదించుకున్న పవన్ తాను నెల్లూరులోని సెంట్ జోసఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 10వ క్లాస్ వరకు చదివానని ఆతరువాత తాను ఎటువంటి డిగ్రీలు చదవలేదు అని స్పష్టం చేయడంతో పవన్ విద్యా అర్హత గురించి కూడ స్పష్టత వచ్చింది.
Pawan Kalyan Porata Yatra
అంతేకాదు 40 కోట్ల స్థిరాస్థి 12 కోట్ల చరాస్థి కలిగిన పవన్ ఇలా ఎన్నో సంచలనాలు ఆ ఎఫడవిట్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ పిల్లలు ఆద్యా అకిరాలకు ఉన్న ఆస్తుల కంటే పవన్ భార్య అన్నా కు 30 లక్షల చరాస్తులు ఉన్నట్లు చూపించడం ఇక్కడి ట్విస్ట్. దీనితో ప్రస్తుతం పవన్ ఆస్థులు అప్పుల విషయాలు పవన్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుత ఎన్నికలలో ఒక అభ్యర్ధి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నిక కావాలి అంటే కనీసం 20 కోట్లు ఖర్చు చేయవలసిన నేపధ్యంలో రెండు చోట్ల పోటీ చేస్తున్న పవన్ ఇంత భారీ ఎన్నికల ఖర్చును ఇన్ని అప్పుల మధ్య ఎలా తట్టుకుంటాడు అన్నది సమాధానం లేని ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి: