కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం అట్లీ డైరక్షన్ లో తన 63 వ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే రికార్డులతో చెడుగుడు ఆడేస్తుంది. విజయ్ అట్లీ కాంబినేషన్ లో ఇదవరకు తెరి, మెర్సల్ సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. మెర్సల్ సినిమా ఏకంగా 200 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది.


ఇక ఇప్పుడు ఈ ఇద్దరు హ్యాట్రిక్ మూవీ చేస్తున్నారు. విజయ్, అట్లీ ఈసారి స్పోర్ట్స్ డ్రామా కథతో వస్తున్నారని తెలుస్తుంది. స్పోర్ట్స్ కోటాలో జరిగే అక్రమాలు.. అవినీతి గురించి ఈ సినిమాలో ప్రస్తావిస్తారట. తన ప్రతి సినిమాలో ఓ సోషల్ కాజ్ ఉండేలా చూసుకుంటున్న విజయ్ 63వ సినిమా షూటింగ్ లో ఉండగానే రికార్డులు కొడుతుంది.   


ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను సన్ టివి ఏకంగా 60 కోట్లకు కొనేసిందట. అన్ని భాషల్లో కలిపి ఈ రైట్స్ అయ్యి ఉండొచ్చు. అయితే ఈ రేంజ్ లో ఓ తమిళ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడవడం ఇదే మొదటిసారి. 50 కోట్ల పైన శాటిలైట్ రైట్స్ అంటే అది బాలీవుడ్ సినిమాలకే సాధ్యం కాని విజయ్ సినిమా తమిళంలో ఆ రికార్డ్ సృష్టించింది.


విజయ్ క్రేజ్ తమిళంలో రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పొచ్చు. శాటిలైట్ రైట్సే ఇలా ఉంటే ఇక డిజిటల్, థియేట్రికల్ రైట్స్ కూడా దుమ్ముదులిపేస్తాయని చెప్పొచ్చు. భారె బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. నయనతార కూడా ఉందని తెలుస్తుంది. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కు ప్రేక్షకుల ముందుకు రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: