నాగచైతన్య సమంతలు తమ పెళ్ళి తరువాత కలిసి నటిస్తున్న ‘మజిలీ’ పై భారీ అంచనాలు ఉన్నాయి. దీనితో ఈసినిమా గ్యారెంటీ హిట్ అన్న ప్రచారం చైతూ అభిమానుల మధ్య జరుగుతోంది. ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమాలో చైతన్య ఈమూవీలోని మరొక హీరోయిన్ దివ్యాన్ష్ కౌషిక్ తో నటించిన ఒక లిప్ లాక్ సీన్ పై సమంత అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ సమంతకు ఒక విచిత్ర ప్రశ్న వేసారు.
Majili first-look poster
‘రంగస్థలం’ సినిమాలో తన పాత్ర స్వభావం రీత్యా సమంత రామ్ చరణ్ కు లిప్ లాక్ ఇస్తే అప్పట్లో చైతన్య అభిమానులు సమంతను టార్గెట్ చేస్తూ పెళ్ళి అయిన హీరోయిన్ ఇలా చేయవచ్చా అంటూ చైతన్య అభిమానులు సమంతను టార్గెట్ చేసిన విషయాన్ని ఇప్పుడు సమంతకు గుర్తు చేసి ఆమెకు ఒక ప్రశ్న వేసారు. పెళ్ళి అయిన హీరోయిన్ కు ఒక రూల్ పెళ్లి అయిన హీరోకు ఒక రూల్ ఉంటుందా అని ప్రశ్నిస్తూ నాగచైతన్య ఇలా ఒక హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ లో నటించడం ఎంత వరకు సమంజసం అంటూ సమంత అభిమానులు తమ ఆవేదనను సమంత దృష్టికి తీసుకు వచ్చారు.
Naga Chaitanya, Samantha Akkineni
అయితే ఈ ఆవేదనకు సంబంధించిన కామెంట్స్ అన్నీ సమంత దృష్టికి రావడంతో ఆమె ఈవిషయమై విభిన్నంగా స్పందించింది. సినిమాలలో తాము నటించేడప్పుడు సహజత్వం కోసం అనేక సీన్స్ చేస్తామని అలాంటి సీన్స్ ను తమ నిజజీవితాలకు అన్వయిస్తూ ఎందుకు మధన పడుతున్నారు అంటూ సమంత తన అభిమానులకు ఎదురు ప్రశ్న వేసింది. 
Naga Chaitanya And Samantha's Majili Movie Latest HD Poster
అంతేకాదు ‘రంగస్థలం’ లో తాను లిప్ లాక్ సీన్ లో నటించినందుకు చైతన్యకు మజిలీ మూవీలో మరో హీరోయిన్ తో లిప్ లాక్ సీన్ లో నటించినందుకు తనకు ఎటువంటి అభ్యంతరాలు లేని పరిస్థుతులలో తమ అభిమానులకు ఎందుకు ఇంత ఆవేదన అంటూ స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది సమంత. సినిమా సెలెబ్రెటీలను అభిమానించడం తప్పు కాదుకానీ వారి సినిమాలకు సంబంధించిన విషయాలను వ్యక్తిగత జీవితంలోని విషయాలను తమ అభిమానులు ఎక్కువగా ఆలోచించి తమ టైమ్ ను వేస్ట్ చేసుకోవద్దు అంటూ సమంత తమ అభిమానులకు ఇచ్చిన క్లాస్ హాట్ న్యూస్ గా మారింది.. 
.


మరింత సమాచారం తెలుసుకోండి: