స్మాల్ స్క్రీన్ లో కామెడీ కింగ్ గా టి.ఆర్.పిలో మిగతా రియాలిటీ షోలు కనీసం టచ్ చేయనంత రేంజ్ లో ఉన్న జబర్దస్త్ షో సూపర్ పాపులర్ అయ్యింది. అందులో చేస్తున్న కమెడియన్స్ ప్రస్తుతం సినిమాల్లో కూడా మంచి అవకాశాలను సంపాదిస్తున్నారు. ఈమధ్యనే 300 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న జబర్దస్త్ షో ఎంతోమంది ఆర్టిస్టులకు, కమెడియన్స్ కు ఆసరాగా నిలబడింది.  


జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ ఈ రెండు షోలలో 12 టీం మెట్స్ చేసే కామెడీ హంగామా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇంతకీ జబర్దస్త్ లో ప్రతి టీం కు ఎంత రెమ్యునరేషన్ ఉంటుంది. వారి షెడ్యూల్స్ ఎలా ఉంటాయన్నది తెలుసుకోవాలని ఉంటుంది. అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో వెళ్లడించారు జబర్దస్త్ షో ఒకప్పుడు చేసిన షేకింగ్ శేషు.    


చలాకి చంటి టీం నుండి బయటకు వచ్చి సొంతగా టీం లీడర్ అయిన షేకింగ్ శేషు ఆ తర్వాత కొద్దిరోజులకే సినిమాల్లో బిజీ అవడం వల్ల తన టీం ను ఆపేశాడు. జబర్దస్త్ ఒక స్కిట్ కు 50,000 ల వరకు రెమ్యునరేషన్ ఉంటుందట. అయితే అది టీం మొత్తానికా లేదా ఒక్కో పర్సన్ కా అన్నది చెప్పలేదు.


ఇక క్రేజ్ ను బట్టే అక్కడ కూడా కాలిక్యులేషన్స్ ఉంటాయట. మంచిగా చేస్తున్న టీం లకు కొంత ఎక్కువే ఉంటుంది కాస్త వెనుకపడ్డ టీం కు తక్కువ ఇస్తారట. వచ్చిన మొత్తాన్ని టీం అందరికి ఎవరికి ఎంత ఇవ్వాలన్నది టీం లీడర్స్ డిసైడ్ చేస్తారట. అందరు కలిసికట్టుగానే షో చేస్తున్నారని చిన్న చిన్న గొడవలు ఉన్నా అవి అప్పటికప్పుడు సర్ధుకునేలా చేసుకుంటామని అన్నారు శేషు.  


జబర్దస్త్ ఫ్లాట్ ఫాం వల్ల తమలాంటి వారికి ఎంతో మంచి పేరు వచ్చిందని ప్రస్తుతం తాను వరుస సినిమాలు చేస్తున్నానని.. నటుడిగా సంతృప్తి కరమైన జీవితాన్ని గడుపుతున్నానని అన్నారు షేకింగ్ శేషు. మళ్లీ జబర్దస్త్ షోకి వచ్చే ఆలోచన ఉందన్నారు శేషు. మరి వస్తే టీం లీడర్ గా వస్తారా చలాకి చంటి టీంలో చేస్తారా అన్నది చూడాలి. నాగబాబు, రోజా జడ్జులుగా చేస్తున్న జబర్దస్త్ షో ఇంతగా పాపులర్ అవడానికి కామెడీతో పాటుగ హాట్ యాంకర్స్ అనసూయ, రష్మిలు కూడా ఒక కారణమని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: